దీపావళి సీజన్‌లో STB ధరలను మళ్ళి రూ.300 తగ్గించిన టాటా స్కై

|

డిటిహెచ్ రంగంలోని సర్వీస్ ప్రొవైడర్‌లలో టాటా స్కైకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల డిటిహెచ్ రంగంలో మొదటి స్థానంలో ఉన్న డిష్ టీవీను వెనుకకు నెట్టి మొదటి స్థానంను ఆక్రమించింది. ఇప్పుడు ఇది ఇండియాలో రాబోయే దీపావళి సీజన్‌లో మరింత కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి తన సెట్-టాప్ బాక్సుల ధరలను మరోసారి తగ్గించింది. గత ఆరు నెలల్లో టాటా స్కై మూడవసారి STB ధరలను తగ్గించింది.

డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్‌
 

ఇండియాలో ప్రస్తుతం డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో మొదటి స్థానంలో ఉన్న టాటా స్కై ఇప్పుడు SD సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,099 ధరలకు, HD సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,299 లకు అందిస్తోంది. అంతకుముందు SD మరియు HD సెట్-టాప్ బాక్సుల ధరలు వరుసగా రూ .1,399 మరియు రూ .1,499 లుగా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ వాటి ధరలను రూ.300 వరకు తగ్గించింది.

ఛానల్ ధరలను

ఇతర వార్తలలో టాటా స్కై కొత్తగా తను అందిస్తున్న ఛానల్ ధరలను కూడా కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులు మునుపటి ధరల కంటే 7 రూపాయల తక్కువ ధరతో ప్రముఖ ఛానెళ్లను పొందుతారు. ఇటీవల మేము ఎయిర్టెల్ డిజిటల్ టీవీ HD STB యొక్క కొత్త ధర 1,300 రూపాయలను నివేదించాము.

జనాదరణ పొందిన ఛానెల్ ధరలను తగ్గించిన టాటా స్కైజనాదరణ పొందిన ఛానెల్ ధరలను తగ్గించిన టాటా స్కై

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌ల కొత్త ధరలు
 

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌ల కొత్త ధరలు

టాటా స్కై ప్రకారం ఈ దీపావళి సీజన్‌లో సెట్-టాప్ బాక్స్‌లపై కంపెనీ 28% వరకు తగ్గింపును అందిస్తుంది. టాటా స్కై యొక్క SD సెట్-టాప్ బాక్స్‌ను 1,099 రూపాయలకు, HD STB 1,299 రూపాయలకు లభిస్తుంది. ట్రాయ్ యొక్క కొత్త టారిఫ్ పాలన అమల్లోకి రాకముందు టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్‌ను 1,899 రూపాయలకు విక్రయించేది. కాబట్టి ఇప్పుడు ఇది 600 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. ఇది వినియోగదారులకు టాటా స్కై అందిస్తున్న దీపావళి బహుమానం. ఈ కొత్త ధరలతో టాటా స్కై తన చందాదారుల సంఖ్యను మరింత పెంచాలని చూస్తుంది. టాటా స్కై అందిస్తున్న ఈ ఆఫర్ క్రొత్త కనెక్షన్‌లకే పరిమితం చేయబడింది అంతే కానీ SD నుండి HDకు అప్‌గ్రేడ్ పొందాలనే వినియోగదారులకు కాదు.

BSNL ప్లాన్ లపై అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా పొందడం మరింత సులువుBSNL ప్లాన్ లపై అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా పొందడం మరింత సులువు

డిటిహెచ్ రంగంలో పోటీ

డిటిహెచ్ రంగంలో పోటీ విషయానికొస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన HD సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,300లకు, ఎస్‌డి STBని రూ.1,100 లకు విక్రయిస్తోంది. చందాదారుల స్థావరం విషయానికి వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి వినియోగదారులకు పలు రకాల సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నప్పటికీ డిష్ టివి కంటే ఒక స్థానం దిగువన మూడవ స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులకు విస్తృత శ్రేణి STBలను కూడా అందిస్తోంది. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్, ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టివి, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి హెచ్‌డి మరియు ఎస్‌డి ఎస్‌టిబిలు కూడా ఉన్నాయి. టాటా స్కై తన వినియోగదారులకు కేవలం నాలుగు సెట్-టాప్ బాక్స్‌లను మాత్రమే అందిస్తోంది. అవి వరుసగా టాటా స్కై హెచ్‌డి, టాటా స్కై ఎస్‌డి, టాటా స్కై + హెచ్‌డి మరియు టాటా స్కై అల్ట్రా హై డెఫినిషన్ 4K.

శామ్సంగ్ దీపావళి సేల్స్ : గెలాక్సీ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లుశామ్సంగ్ దీపావళి సేల్స్ : గెలాక్సీ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు

SD సెట్-టాప్ బాక్స్‌

టాటా స్కై కేవలం HD మరియు SD సెట్-టాప్ బాక్స్‌ల ధరలను మాత్రమే తగ్గించింది. సంస్థ యొక్క ఇతర రెండు STBల ధరలు పాత ధరలకు రిటైల్ చేస్తున్నాయని గమనించండి. టాటా స్కై + హెచ్‌డి డిజిటల్ సెట్-టాప్ బాక్స్ రూ.9,300 వద్ద లభిస్తుంది. అలాగే టాటా స్కై అల్ట్రా హెచ్‌డి 4K బాక్స్‌ను రూ.6,400 ధర వద్ద పొందవచ్చు.

వివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చువివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చు

లీనియర్ సెట్-టాప్ బాక్స్ విభాగంలో టాటా స్కై లేకపోవడం

లీనియర్ సెట్-టాప్ బాక్స్ విభాగంలో టాటా స్కై లేకపోవడం

టాటా స్కై ఇండియాలో ప్రముఖ డైరెక్ట్-టు-ది-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్‌గా అవతరించగలిగినప్పటికీ ఇది కీలకమైన అంశం యొక్క పోటీలో ఇంకా వెనుకబడి ఉంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ గత నెలలో రూ.3,999లకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఆపరేటర్‌ను డిష్ టివి కూడా అనుసరించింది. ఇది డిష్ SMRT హబ్‌ను గత వారం మార్కెట్‌లో రూ.3,999ల ధర వద్ద తీసుకువచ్చింది. టాటా స్కై ఇప్పటికి తన వినియోగదారులకు కేవలం HD మరియు SD సెట్-టాప్ బాక్స్‌లను మాత్రమే అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మరో దీపావళి సేల్స్... స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి చివరి అవకాశంఫ్లిప్‌కార్ట్‌లో మరో దీపావళి సేల్స్... స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి చివరి అవకాశం

బింగే సర్వీస్

టాటా స్కైకి బింగే సర్వీస్ ఉంది. దీనితో కస్టమర్ అమెజాన్ ఫైర్ టివి స్టిక్ ద్వారా OTT కంటెంట్‌ను చూడవచ్చు ఇది ఒక ప్రత్యేక అనుబంధం. హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ సాటిలైట్ టీవీ మరియు OTT యాప్ ల కంటెంట్ రెండింటినీ అందిస్తుంది ఇది అదనపు ప్రయోజనం. టాటా స్కై పోటీని చేపట్టడానికి రాబోయే వారాల్లో బింగే + స్మార్ట్ సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేస్తుందని పుకారు ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Diwali Offer: HD and SD Set-Top Boxes Price Again Slashed Rs.300

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X