వీర్యమిస్తే.. కొత్త ఐఫోన్ ఇస్తారట

Posted By:

కొత్త ఐఫోన్ మార్కెట్లో విడుదలైన ప్రతిసారి ఏదో ఒక సంచలనం చోటుచేసుకుంటూనే ఉంటుంది. తాజాగా, ఐఫోన్ 6ఎస్ విడుదల నేపథ్యంలో చైనాలో సంచలనాల చిట్టా పెరిగిపోతోంది. ఐఫోన్ 6ఎస్‌ను సొంతం చేసుకునేందుకు కొద్ది రోజులు క్రితం ఇద్దరు చైనా కుర్రోళ్లు కిడ్నీలు అమ్ముకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Read More : మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు

కొత్త ఐఫోన్‌లకు క్రేజ్ మిన్నంటుతోన్న నేపథ్యంలో షాంఘైలోని రెండు స్పెర్మ్ బ్యాంక్‌లు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. వీర్య ధానం చేయండి, కొత్త ఐఫోన్‌‌ను పట్టికెళ్లండంటూ యువతకు గాలం వేస్తున్నాయి. ‘ఐఫోన్ 6ఎస్ ను సొంతం చేసేుకునేందుకు మీ కిడ్నీలను అమ్ముకోవల్సిన అవసరం లేదు, జస్ట్ వీర్యాన్ని దానం చేస్తే చాలు' అంటూ ఈ సంస్థలు ప్రకటనలు విడుదల చేయటం ముఖ్యంగా యాపిల్ అభిమానుల్లో ఓ విధమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More : మీ గాడ్జెట్‌లను క్లీన్ చేేసేందుకు తీరైన మార్గాలు

షాంఘైలిస్ట్.కామ్ వెల్లడించిన వివరాల మేరకు వీర్యదానం చేసేందుకు కొన్ని అర్హతలను ఈ స్పెర్మ్ బ్యాంక్స్ నిర్థేశించాయి. వీర్యదానం చేసే వారు తప్పనిసరిగా చైనా గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. వారికి ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఉండకూడదు. 165 సెంటీ మీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. కాలెజ్ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. 17 మిల్లీమీటర్ల వీర్యాన్ని డొనేట్ చేస్తే రూ.60,000వరకు ఇస్తామని ఈ సంస్థలు చెబుతున్నాయి. ఒక సారి దానం చేసిన తరువాత 48 రోజులు గ్యాప్ తీసుకోవాలన్న నిబనంధనను కూడా ఈ సంస్థలు విధించాయి.

Read More : కొత్త ఐఫోన్ కోసం ఏకంగా కిడ్నీలే బేరం పెట్టారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ కంపెనీని ప్రారంభించిన రోజు ఏప్రిల్ 1, 1976

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ తన మొదటి కంప్యూటర్ యాపిల్1ని విడుదల చేసిన రోజు జూలై 1976,

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ మొదటి ఐపోడ్ విడుదలైన రోజు నవంబర్ 10, 2001,

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ మొదటి ఐఫోన్ విడుదలైన రోజు జూన్ 29, 2007.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ మొదటి ఐప్యాడ్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2010

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

సెప్టంబర్ 2013 నాటికి అమ్ముడైన యాపిల్ ఐఓఎస్ డివైజుల సంఖ్య 700 మిలియన్లు,

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 39 శాతం.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను వాస్తవానికి తయారు చేసింది సామ్‌సంగ్.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 80,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్పట్లో తన షేర్లను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు వాటి విలువ 35 బిలియన్ డాలర్లు.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట యాపిల్ కంపెనీని పంపబడుతుంది. ఆ పదాలను విశ్లేషించి స్టోర్ చేస్తారు.

యాపిల్ గురించి ఆసక్తికర నిజాలు

యూఎస్ ఖజానాతో పోలిస్తే యాపిల్ ఎక్కవ ఆపరేటింగ్ క్యాష్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Donate sperm to get rose gold iPhone 6S. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot