కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ తాకట్టు!

Posted By:

ఫోన్ పై పెంచుకున్న వ్యామోహం ఆఖరికి కిడ్నీలను అమ్ముకునే స్థాయికి దిగజార్చింది. తూర్పు చైనాలోని జియంగ్సు ప్రావిన్స్‌లో ఇద్దరు వ్యక్తులు యాపిల్ కొత్త ఐఫోన్‌ల కోసం కిడ్నీలను అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు. వీరిలో ఒకరిని ‘యూ'గా మరొకరిని ‘హాంగ్'గా గుర్తించారు.

Read More : కొత్త ఐఫోన్‌ రికార్డుల మోత!

ఐఫోన్ 6ఎస్‌ను కొనుగోలు చేసేంత డబ్బులు వీరి వద్ద లేవు. అయితే, చెరో కిడ్నీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేద్దామని హాంగ్, యూకు సూచించాడు. అనుకన్నదే తడవుగా వీరు ఇంటర్నెట్ ద్వారా అక్రమ ఏజెంట్‌ను కలిసారు. ఆ ఏజెంట్ వీరిని వైద్య పరీక్షల నిమిత్తం న్యాంజింగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి హాజరుకావాలని కోరాడు.

Read More : వెబ్‌సైట్‌లో డబ్బు సంపాదించే మార్గాలివే

అనుకున్నమాటల ప్రకారం వీరిద్దరు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి హాజరయ్యారు. అయితే ఏజెంట్ అక్కడ లేడు. దీంతో వీళ్లు పునరాలోచనలో పడ్డారు. కొద్దిసేపు ఆలోచించుకున్న తరువాత యూ తన కిడ్నీని అమ్మేదిలేదని ఈ ప్లాన్‌ను ఇక్కడితో ఆపేద్దామని హాంగ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. హాంగ్ ఇందుకు నిరాకరించటంతో యూ వెంటనే వ్యవహారాన్నీ పోలిసుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ బేరం!

గతంలోనూ ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మకున్న సంఘటనలు చైనాలో కలకలం రేపాయి. చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2 కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు.

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ బేరం!

పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది. సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు.

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ బేరం!

. లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ బేరం!

సు నమోదు చేసిన పోలీసులు కిడ్నీ కోనుగోలులో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారైన హీ వై‌ను పోలీసులు విచారిస్తున్నారు.

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ బేరం!

ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం పడిపోయింది. అమ్ముకున్న ఆ కిడ్నీ తిరిగి వస్తుందా..?, ఆ యువకుడి ఆరోగ్యం కుదటపడుతుందా..?, ఆలోచించండి ఇతర సుఖాల కోసం అవయువాలను అమ్ముకోవద్దు.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ టీనేజర్ ఇంగ్లాండ్‌కు చెందిన ఓ టీనేజర్ డ్రెయిన్‌లో పడిపోయిన తన ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో డ్రెయిన్‌లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది కొన్ని గంటల పాటు బాధితురాలిని రక్షించాల్సి వచ్చింది.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

జపాన్‌కు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్‌ను ముందుగా దక్కించుకునే క్రమంలో యాపిల్ స్టోర్ వద్ద 7 నెలల ముందు నుంచే తిష్టవేసుకు కూర్చున్నాడు.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

తన కొడుకు ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి తన క్రింద పని చేసే 10 మంది పరిశోధకులను పురమాయించడం ఓ సంచలనమైంది.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

యాపిల్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలన్న తపనతో ఓ మహిళ క్యూలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు తన 2000 డాలర్ల హ్యాండ్ బ్యాగ్‌ను ఇచ్చేసింది.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

కొత్త ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ కోసం ఓ కుర్రవాడు తన కిడ్నిని అమ్ముకున్నాడు.

బాబోయ్.. ఐఫోన్ పిచ్చోళ్లు

చైనాకు చెందిన ఓ జంట ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు తమ బిడ్డలను అమ్మకానికి పెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Two Chinese men try to sell kidney for latest iPhone. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot