IMEIతో ఫోన్ భద్రం బాసూ..

Written By:

ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే చెప్పలేని బాధ ఉంటుంది. అందుకే అందరూ IMEI నంబర్లను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఫోన్ పోయిన పక్షంలో దాని జాడ కనిపెట్టేందుకు ఈ నంబరు ఉపయోగపడుతుంది. ఇప్పుడు IMEI నంబర్లు చాలావరకు టాంపరింగ్ అవుతూ విదేశీ మార్కెట్లకు తరలిపోతున్నాయి.

ఫ్రభుత్వ యాప్‌లతో కార్బన్ కొత్త ఫోన్, కేవలం రూ.5290 కే..

IMEIతో ఫోన్ భద్రం బాసూ..

అయితే ఇలా తరలిపోకండా IMEI నంబర్ టాంపరింగ్ చేసే వీలు లేకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. 1885లో బెంగాల్ లో తీసుకువచ్చిన టెలిగ్రాప్ చట్టంలోని నిబంధనలనే ఇప్పుడు అన్ని టెలికం కంపెనీలు పాటిస్తున్న సంగతి విదితమే. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం అనుకుంటోంది.

జియో ప్లాన్లు మారాయి, యూజర్లకు ఇక తిప్పలే !

డుప్లికేట్ IMEI నంబర్లను అరికడుతూ IMEI నంబర్ ను టాంపరింగ్ చేసేవారికి కఠిన శిక్ష విధించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా సెక్షన్ 7, 25లో మార్పులు చేసి నిందితులకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాని సవరించనున్నట్లు తెలుస్తోంది. అపహరణకు గరైన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్:

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ ( Avast! mobile security):

ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించికుండా నివారించటమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యూప్ ఏర్పరుస్తుంది. ఈ యూప్‌లో పొందుపరిచిన యాంటీ-తెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది

మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్ (Mobile chase-location tracker):

ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్‌లను చేధించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదురు మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది.

తీఫ్ ట్రాకర్ (Thief tracker):

ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే తీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈ-మెయిల్‌కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు.

స్మార్ట్ లుక్ (Smart look):

ఈ సాఫ్ట్‌వేర్, మీ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను క్యాప్చర్ చేసి వెనువెంటనే మీ ఈ-మెయిల్‌కు చేరవేస్తుంది. అంతేకాదండోయ్ ఈ యూప్‌లో పొందుపరిచన కంటిన్యూస్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం గూగుల్ మ్యాప్ సాయంతో ఫోన్ ఆచూకీని చేధించగలదు.

ట్రెండ్ మైక్రో మొబైల్ సెక్యూరిటీ & యాంటీ వైరస్ (Trend Micro mobile security & antivirus):

అత్యధికంగా అమ్ముడువుతున్న అప్లికేషన్‌లలో ఈ అప్లికేషన్ మొదటి స్థానాల్లో ఉంది. పటిష్టమైన యాంటీ వైరస్, యాంటీ తెఫ్ట్ ఫీచర్లను ఈ యూప్‌లో పొందుపరిచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
DoT working on stricter rules for tampering of IMEI number, tracking lost mobiles Read more At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot