ఆ 15 రోజులు భూమి మొత్తం చీకటేనట?

Posted By:

నాసా పేరుతో ఓ ఆసక్తికర వార్త ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 15 నవంబర్ 2015 నుంచి 29 నవంబర్ 2015 వరకు ఏకంగా 15 రోజుల పాటు భూమి చిమ్మ చీకట్లలో మగ్గుతుందని ఓ అనధికారిక వార్త ప్రపంచానికి దడ పట్టిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ విషయాన్ని ధృవీకరించిదంటూ వార్తలు వస్తున్నాయి.

Read More : ఇవి నాసా పంపిన రాకెట్లు

ఆకాశంలో అరుదుగా సంభవిస్తోన్న ఈ ఘటనకు ‘బ్లాక్ అవుట్' అని పేరు పెట్టారట. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న కథనాల మేరకు నవంబర్ 15, 2015 ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యే గాఢాంధకారం నవంబర్ 30, 2015 సాయంత్రం 4.15 నిమిషాల వరకు ఉంటుందట.

Read More : ఫోన్ చార్జింగ్ నిమిషాల్లో.. 10 టిప్స్!

గత 10,00000 లక్షల సంవత్సరాల కాలంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదట. గురు, శుక్రు గ్రహాల మధ్య చోటు చేసుకునే ఖగోళపరమైన సంఘటనల కారణంగా ఈ చీకటి సంభవించబోతోందని ఈ వార్తలు చెబుతున్నాయి.

Read More : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?

‘నవంబర్ బ్లాక్ అవుట్' ఈవెంట్ కు సంబంధించి నాసా హెడ్ చార్లెస్ బోల్డెన్ అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకు 1000 పేజీల డాక్యుమెంట్ ను ప్రిపేర్ చేసిన ఇచ్చారన్నది ఈ వార్తల సారాంశంగా ఉంది. గతంలోనే ఇలాంటి వార్తలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసాయి. వాటిలో పసలేదని ఆ తరువాత రుజువైంది.

Read More : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?

అంతరిక్షం నుంచి ముంచుకొస్తున్న ఓ  పెనుముప్పుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

{

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మృత్యువు ముంచుకొస్తోంది

అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా వస్తువులు ఫుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

వీటితోపాటు మరో 5లక్షల చిన్న వ్యర్థాలు కూడా శూన్యంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఇవి నట్లు, బోల్టులు, మేకుల వంటివి. ఇక గుర్తుపట్టలేనంత చిన్న వస్తువులు లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

మృత్యువు ముంచుకొస్తోంది

ఇవి గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మనం విసిరే రాయి తలకు తగిలితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఇంత వేగంతో తిరిగే వస్తువు వ్యోమగాములకు తగిలితే ఏమవుతుందో ఊహించారా?

మృత్యువు ముంచుకొస్తోంది

మన శరీరాన్ని అది రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోవడం ఖాయం. గన్ నుంచి వచ్చే బుల్లెట్ గంటకు 4,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ అంతరిక్ష వస్తువులు అంతకు ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

అభివృద్ధి పేరుతో మనం భూమి చుట్టూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. ప్రపంచ దేశాల శాటిలైట్లు భూకక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయిగానీ, కాలపరిమితి ముగిసినవి మాత్రం ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా మారుతున్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

వాటిని తిరిగి భూమికి తెచ్చేందుకు ఏ దేశమూ ప్రయత్నించట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మరి. చిన్న చిన్న వ్యర్థాల వల్ల ప్రస్తుత శాటిలైట్లకూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చాలా నష్టం జరుగుతోంది. స్పేస్ షటిల్స్ అద్దాలు, కిటికీలూ, సోలార్ ప్లేట్లూ దెబ్బతింటున్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను రష్యాకు చెందిన పాతకాలపు ఉపగ్రహం ఢీకొట్టింది.

మృత్యువు ముంచుకొస్తోంది


2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను నాశనం చేసేద్దామని చైనా ఓ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు శూన్యంలో తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి తిరుగుతూనే ఉన్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి భూమిపై పడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్ మెంట్లపై కూలుతున్నాయి. అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరుగుతోంది. శాటిలైట్ ను పైకి పంపించేటప్పుడే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, తిరిగి భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

మృత్యువు ముంచుకొస్తోంది

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంటెగ్రల్ మిషన్ ను పైకి పంపించింది. దాని కాలపరిమితి 2028లో ముగుస్తుంది. అదే ఏడాది లేదా తర్వాతి సంవత్సరం అది భూమిపై పడేలా ప్రోగ్రాం రూపొందించారు. ఆ ఫలితాలు తేలడానికి మనం దశాబ్దం పైనే ఆగాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Earth experience 15 days of total darkness in November?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot