ఫేస్‌బుక్ ఉచిత మెసేజింగ్ సర్వీసులు

Posted By:

మొబైల్ వినియోగదారులకు ఉచిత మెసేజింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే కమ్రంలో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 14 దేశాల్లోని 18 మొబైల్ ఆపరేటర్‌లతో ఓ ఒప్పందాన్ని కదుర్చుకుంది. భారత్‌లో ఈ సర్వీసులను అందించేందుకు ఎయిర్‌టెల్ ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్‌‌లతో ఫే‌స్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపడాలంటే..?

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు (రూ.5000ధరల్లో)

ఈ క్రమంలో ఎయిర్‌టెల్ 2013 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఫేస్‌బుక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉచితంగా యాక్సిస్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా యూజర్ 500ఎంబి డేటాను ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఫేస్‌బుక్ ఉచిత మెసేజింగ్ సర్వీసులు

తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సరికొత్త ఫేస్‌బుక్ మెసెంజర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రిలయన్స్ యూజర్లు రూ.16 చెల్లించి ఫేస్‌బుక్ మెసెంజర్ అప్లికేషన్‌ను 30 రోజుల పాటు అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot