ఫేస్‌బుక్ ‘ఫైర్ ఛాలెంజ్’ పై విమర్సల వెల్లువ

Posted By:

ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ పెద్ద హాట్ టాపిక్. ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఇటీవల హల్ చల్ చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ కొత్తగా వెలుగులోకి వచ్చిన ‘ఫైర్ ఛాలెంజ్' మాత్రం సర్వత్రా విమర్శలను ఎదుర్కుంటోంది.

(చదవండి: బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు)

 ఫేస్‌బుక్ ‘ఫైర్ ఛాలెంజ్’  పై విమర్సల వెల్లువ

ఈ ‘ఫైర్ ఛాలెంజ్'లో పిల్లలు ఒంటి పై మండే స్వభావం కలిగిన లిక్విడ్‌ను పోసుకుని నిప్పటించుకుంటున్నారు. ఆ తరువాత మంటలు వ్యాపించే‌లోగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేస్తున్నారు. ఇలా చేసే క్రమంలో కొందరు యువకులు తీవ్రంగా గాయపడుతున్నారు. ఇది ఆ పిల్లల తల్లిదండ్రులకు తొలనొప్పిగా మారింది. ఫైర్ ఛాలెంజ్‌ను స్వీకరించి ఆ స్టంట్‌ను పూర్తి చేసే క్రమంలో నిప్పంటించుకుని గాయపడిన ఇద్దర పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయద్దంటూ వేడుకుంటున్నారు.

(చదవండి: 3జీబి, 4జీబి ర్యామ్‌లతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు)

ఫైర్ ఛాలెంజ్‌లో పాల్గొన్న టైలర్ ఓ కానర్ (9),  11 ఏళ్ల షాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు మెయిల్ ఆన్‌లైన్ పేర్కొంది. ఈ ఫైర్ ఛాలెంజ్ దృశ్యాలకు సంబంధించి వీడియోలు ఫేస్‌బుక్ ఇంకా యూట్యూబ్‌‌లో విస్తృతంగా షేర్ చేసుకున్నారు. నిప్పుతో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లను చేయవద్దని లండన్ అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫైర్ ఛాలెంజ్‌తో కూడిన రెండు వీడియోలను ఫేస్‌బుక్‌లో తొలగించినప్పటికి యూట్యూబ్‌లో మాత్రం షేర్ అవుతూనే ఉన్నాయి.

English summary
Facebook 'fire challenge' faces criticism. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting