ఫేస్‌బుక్ లైట్: ఇక 2జీ నెట్‌వర్క్‌లోనూ దూకుడే

Posted By:

తక్కువ వేగంతో స్పందించే 2జీ ఇంటర్నెట్ కనెక్షన్‌లను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ అభివృద్థి చేసిన ‘లైట్' (Lite) యాప్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ఫేస్‌బుక్ లైట్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న ఈ లైటర్ వర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా 2జీ డేటా యూజర్లు ఫేస్‌బుక్ లావాదేవీలను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. ఒక్క వీడియో షేరింగ్ ఆఫ్షన్ మినహా అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయని ఫేస్‌బుక్ చెబుతోంది.

Read More: ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు!

ఫేస్‌బుక్ లైట్: ఇక 2జీ నెట్‌వర్క్‌లోనూ దూకుడే

ఫేస్‌బుక్ లైట్ యాప్ ద్వారా 2జీ ఇంటర్నెట్‌లో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చేకూరే లాభాలు:

ఫోటోలను త్వరగా ఓపెన్ చేసుకుని త్వరగా షేర్ చేసుకోవచ్చు,
నోటిఫికేషన్‌లను వేగవంతంగా రిసీవ్ చేసుకోవచ్చు,
మెసేజింగ్ కూడా చాలా వేగవంతంగా ఉంటుంది,
గ్రూప్ కన్వర్‌సేషన్స్‌ను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు.

ఫేస్‌బుక్ లైట్: ఇక 2జీ నెట్‌వర్క్‌లోనూ దూకుడే

Read More: మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!
జీఎస్ఎంఏ (GSMA) లెక్కల ప్రకారం భారత్‌లో 2జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 80 శాతం ఉన్నట్లు ఫేస్ బుక్ చెబుతోంది. ఈ క్రమంలో 500కేబీ కంటే తక్కువ సైజులో ఉండే ఈ ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను ఇ‌ స్టాల్ చేసుకోవటం ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో ఉండే వినియోగదారులు ఫేస్‌బుక్‌ను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవచ్చు.

English summary
Facebook Lite now Available in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot