తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

By Hazarath
|

తెలుగు నేలపై నయా మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి వారి నుంచి వేలాది రూపాయలు డిపాజిట్లుగా దండుకుని పరారైన దురదృష్టకర సంఘటన. ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీ పేరుతో నవ్యాంధ్రలోని విశాఖలో ఐటీ కంపెనీ తెరిచిన కిరణ్ అనే వ్యక్తి ఉద్యోగం పేరు చెప్పి ఉద్యోగుల నుంచి వేలాది రూపాయలు డిపాజిట్లుగా తీసుకున్నారు. విశాఖ ఐటీ పార్క్ లోని హిల్ నంబర్ 2లో కంపెనీనీ ఏర్పాటు చేసి అక్కడ ఆరునెలల శిక్షణ ఇస్తామని ఆశచూపాడు.

Read more: ఈ ఉద్యోగానికి రూ.3 కోట్ల వేతనం

job

ఉద్యోగం వస్తుందనే ఆశతో చాలామంది అతని వలలో పడిపోయి వేలాది రూపాయలు కట్టారు. అయితే శిక్షణ సమయంలో వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోగా శిక్షణ పూర్తవుతున్న తరుణంలో గుట్టు చప్పుడు కాకుండా మాయమయ్యాడు. జరిగిన మోసం గురించి తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అయితే చాలా కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.

Read more: బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

చాలా కంపెనీలు ఉద్యోగం ఇచ్చేశాం. త్వరలో ఫోన్ చేస్తాం అని చెప్పి, నెలల తరబడి వెయిటింగ్‌లో పెట్టి, చివరకు నో చెప్పేసి, విద్యార్థులను రోడ్డున పడేస్తున్నాయి కంపెనీలు. ఇందులో ఎంఎన్ సీ కంపెనీలు కూడా ఉన్నాయి.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

దానికి తోడు కొత్తగా మొదలైన స్టార్టప్ మోజు కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దేశంలో కొత్తగా చాలా చిన్న కంపెనీలు పుట్టుకువచ్చాయి. ఇప్పటికే ఉన్న సంస్థలు కూడా బాగా విస్తరించాలన్న ఆశలో ఉన్నాయి.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
 
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

అందుకోసం ఐఐఎం, ఐఐటి లాంటి పెద్ద సంస్థల విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నాయి. తీరా విస్తరణ ఆలస్యం అవడమో, కంపెనీ ప్రారంభం కాకపోవడమో, మరో కారణం చేతనో, చాలా మంది ఈ కొత్త ఉద్యోగులకు నో చెప్పేస్తున్నారు.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

ప్రస్తుతం దాదాపు 8 కంపెనీల వరకూ ఇలా ఐఐటి, ఐఐఎం విద్యార్థులను త్రిశంకు స్వర్గంలో పెట్టేశాయి. హెల్త్ కేర్ రంగంలో పోర్షియా, గ్రాసరీస్ రంగంలో పెప్పర్ ట్యాప్ వంటి సంస్థలైతే మరీ దారుణం. ఆఫర్ లెటర్లు ఇచ్చిన తరువాత ఉద్యోగాల్లేవని చెప్పింది.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

లాజిస్టిక్స్ రంగంలో కూడా రోడ్ రన్నర్, టెక్నాలజీలో ఇన్ మొబి, కమ్యూటర్స్‌లో కార్‌దేఖో, స్టేజిల్లా వంటి సంస్థలు నియామకాలను బాగా ఆలస్యం చేస్తున్నాయి. చేతిలో ఆఫర్ లెటర్లు ఉన్నాయి. వేరే ఉద్యోగంలో చేరలేరు. ఈ కంపెనీలు ఎప్పుడు పిలుస్తాయో తెలీదు.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

ఎల్ అండ్ టి గ్రూపులో ఐటి కంపెనీ ఎల్ అండ టి ఇన్ఫోటెక్ దాదాపు వెయ్యి మందికి ఇచ్చిన ఆఫర్ లెటర్స్ రద్దు చేసింది. దాదాపు 1500 మంది అప్పాయింట్మెంట్లు రద్దు చేశారనే వాళ్లు కూడా ఉన్నారు.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

2015లో వీళ్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి, ఏడాది పాటూ పనీ పాటా లేకుండా ఖాళీగా ఉంచి, ఇప్పుడు మీకు ఉద్యోగాల్లేవనేసింది. అదికూడా డైరెక్టుగా చెప్పకుండా సెకండ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి పెట్టారు. ఈ గొడవ చెన్నైలో కొందరు విద్యార్థులు నిరాహారదీక్షలు చేసే వరకూ వెళ్లింది.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

అప్పట్లో భారీగా విస్తరించాలన్న ప్రణాళికలో ఉన్న ఫ్లిప్ కార్ట్ సంస్థ ఐఐఎం, ఐఐటీల నుంచి పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్ చేసింది. వాళ్లందరికీ అప్పాయింట్ లెటర్లు ఇచ్చేసింది. కానీ ఎంతకీ పిలవలేదు.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

ఉద్యోగంలో చేర్చుకోవడం ఇంకా ఆలస్యం అవుతుందని సమాచారం కూడా ఇచ్చేసింది. ఇలా ఆలస్యం అయినందకు గానూ, వారు ఉద్యోగంలో చేరగానే లక్షన్నర రూపాయల అదనపు బోనస్ ఇస్తామని చెప్పింది. అటు ఐఐటీల నుంచి రిక్రూట్ చేసుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే వరకూ ఇంటర్న్‌షిప్‌గా పరిగణించడానికి ఒప్పుకుంది.

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..

ఇలా ఎన్నో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆఫర్ లెటర్ లేకపోతే స్టూడెంట్ వాడి తిప్పలు వాడు పడతాడు.. అనవసరంగా విద్యార్థుల జీవితాలతోనూ, వాళ్ల విలువైన సమయంతోనూ ఈ కంపెనీలు ఆడుకోవడం మానేయాలని పలువురు కోరుకుంటున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Fake IT company cheats unemployed in Visakha

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X