ఫ్లిప్‌కార్ట్‌లో మరో దీపావళి సేల్స్... స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి చివరి అవకాశం

|

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ యొక్క మొదటి రౌండ్‌ను బుధవారం ముగించింది. ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే రెండు సేల్స్ నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన రెండు సేల్స్ లోను స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపులను అందించింది. ఈ రెండు సేల్స్ లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేకపోయిన వారి కోసం ఫ్లిప్‌కార్ట్ చివరిసారిగా మరొక అవకాశం ఇవ్వనున్నది. ఇప్పడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ ను మరొక సారి అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ సేల్స్ అక్టోబర్ 21 సోమవారం నుండి మొదలుకానున్నాయి మరియు అక్టోబర్ 25 తో సేల్స్ ముగుస్తాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్
 

ఐదు రోజులపాటు జరిగే ఈ సేల్స్ లో రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7 ఎస్, రియల్‌మి 5, మరియు వివో జెడ్ 1 ప్రోతో సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను తీసుకువస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో వివిధ స్మార్ట్ టీవీ మోడల్స్ మరియు గృహోపకరణాలపై కూడా 75 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అదేవిధంగా అనేక స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, DSLRలు మరియు మిర్రర్‌లెస్ కెమెరాలపై కూడా బ్రహాండమైన ఆఫర్లను అందిస్తోంది.

డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో తన తదుపరి బిగ్ దీపావళి సేల్స్ సందర్భంగా డిస్కౌంట్ మరియు ఆఫర్‌లలో మనకు లభించే కొన్ని ముఖ్యమైన వాటి జాబితాను మైక్రోసైట్ లో విడుదల చేయబడింది. అక్టోబర్ 21 నుండి సాధారణ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ జరుగుతుండగా అక్టోబర్ 20 ఆదివారం రాత్రి 8 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ చందాదారులకు సేల్స్ కోసం దీని ప్రారంభ యాక్సిస్ అందించబడుతుంది.

ఆఫర్స్ ధరలు
 

ఆఫర్స్ ధరలు

ఫ్లిప్‌కార్ట్ యొక్క తన తాజా దీపావళి సేల్స్ లో రెడ్‌మి నోట్ 7 ప్రోను రూ.11,999, రెడ్‌మి నోట్ 7 ఎస్ ను రూ. 8,999, రియల్‌మి 5ను రూ. 8,999, వివో జెడ్ 1 ప్రోను రూ. 12,990ల డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు.

స్మార్ట్ ఫోన్ మోడల్ ఆఫర్ ధర ఒరిజినల్ ధర
రెడ్‌మి నోట్ 7 ప్రో 11,999 13,999
రెడ్‌మి నోట్ 7 ఎస్ 8,999 10,999
రియల్‌మి 5 8,999 9,999
వివో జెడ్ 1 ప్రో 12,990 14,990

రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీ సేల్స్రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీ సేల్స్

డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ సందర్భంగా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ లను అందించడంతో పాటు నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో జాబితా చేయబడిన ఫోన్‌లపై పూర్తిగా మొబైల్ ప్రొటెక్షన్ సర్వీస్ ను జోడించడానికి కొన్ని డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు, DSLRలు, స్మార్ట్‌వాచ్‌లపై తగ్గింపు

స్మార్ట్ టీవీలు, DSLRలు, స్మార్ట్‌వాచ్‌లపై తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న రెండవ బిగ్ దీపావళి సేల్స్ లో 50,000లకు పైన గల ఉత్పత్తులపై 75 శాతం తగ్గింపును అందిస్తోంది. మైక్రోసైట్ శామ్‌సంగ్ స్మార్ట్ LED టీవీ 32-అంగుళాలపై కొన్ని డిస్కౌంట్ లను అందిస్తుంది. అదేవిధంగా వివిధ రకాల గృహోపకరణాలపై కూడా గొప్ప ఆఫర్లు ఉంటాయి.

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లువివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

ఎలక్ట్రానిక్ డివైస్ లు

ఫ్లిప్‌కార్ట్ వివిధ ఎలక్ట్రానిక్ డివైస్ లు మరియు వాటి ఉపకరణాలపై 90 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. DSLRలు, మిర్రర్‌లెస్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లపై గొప్ప డిస్కౌంట్ లను అందిస్తుంది. ఆన్‌లైన్ మార్కెట్ లో ఆపిల్ వాచ్ సిరీస్ 3 పై డిస్కౌంట్‌ను కూడా టీజ్ చేసింది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌లను కలిగి ఉన్న ఉత్పత్తుల మీద 85 శాతం వరకు తగ్గింపును పొందువచ్చు.

ధమాకా డీల్స్

ఫ్లిప్‌కార్ట్ ఐదు రోజుల పాటు జరుపుతున్న ఈ సేల్స్ లో భాగంగా ఉదయం 12am , ఉదయం 8am మరియు సాయంత్రం 4pm గంటలకు మొబైల్ ఫోన్లు, టీవీలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల్లో "ధమాకా డీల్స్" ద్వారా అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ యొక్క సాంప్రదాయ ప్రమోషన్లైన "రష్ అవర్" మరియు "మహా ప్రైస్ డ్రాప్" కూడా తదుపరి సేల్స్ రౌండ్లో అందుబాటులో ఉంటాయి.

శామ్సంగ్ దీపావళి సేల్స్ : గెలాక్సీ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లుశామ్సంగ్ దీపావళి సేల్స్ : గెలాక్సీ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు

SBI

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ సందర్భంగా SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించే వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి ఫ్లిప్‌కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale 2019 Again Starts from October 21: Discounts and Other Details Revealed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X