త్వరపడండి.... రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ 4GB RAM ఆఫర్ కొంతవరకే

|

ప్రముఖ చైనా కంపెనీ షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 ఇటీవల ఇండియాలో విడుదల అయింది. ఇది ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది రెడ్‌మి 7కు అప్డేట్ వెర్షన్ గా ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించబడింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ రోజు ఇండియాలో తన మరొక స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 8 ప్రోను కూడా విడుదల చేస్తోంది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

షియోమి యొక్క కొత్త రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదటిసారి మొదలవుతున్నాయి కావున పరిచయ ఆఫర్‌లో భాగంగా ఇది రూ.7,999 వద్ద లభిస్తుంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 64 జీబీ స్టోరేజ్ + 4 జీబీ ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.8,999లుగా నిర్ణయించబడింది. రెడ్‌మి 8 యొక్క 4 జీబీ ర్యామ్ వేరియంట్ మొదటి 5 మిలియన్ యూనిట్లు 7,999 రూపాయల తగ్గింపు ధరలో లభిస్తాయి. Mi.com సేల్స్ గురించి సమాచారం లేనప్పటికీ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్స్ జరగనుంది.

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ 6.22-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేతో వస్తుంది. రెడ్‌మి 7 మాదిరిగానే ఇది కూడా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ వాటర్‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. AI సెల్ఫీ కెమెరా పోర్ట్రెయిట్ మోడ్‌కు మరియు ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది 12 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా సోనీ IMX363 సెన్సార్‌తో జత చేయబడి ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. 104 భాషల మధ్య గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ ఆఫర్ ట్రాన్సలేషన్ కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్

రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ P2i ప్రొటెక్టెడ్ కోటెడ్ తో వస్తుంది. ఇది స్ప్లాష్ ప్రూఫ్ మరియు MIUI ఆధారంగా రన్ అవుతుంది. వెనుకవైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో USB టైప్-సి పోర్ట్,డ్యూయల్ సిమ్,4G కనెక్టివిటీ,వై-ఫై వంటి కనెక్టివిటీలతో ప్యాక్ చేయబడి వస్తుంది.

అమెజాన్ లో RS.700 లోపు కొనుగోలు చేయగల స్మార్ట్-హోమ్ గాడ్జెట్లు

రెడ్‌మి నోట్ 8 ప్రో లాంచ్
 

రెడ్‌మి నోట్ 8 ప్రో లాంచ్

షియోమి ఈ రోజు రెడ్‌మి నోట్ 8 ప్రోలను భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఎంట్రీ లెవల్ విభాగంలో రెడ్‌మి 8A, రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన తర్వాత రెడ్‌మి నోట్ 8 సిరీస్ ను విడుదల చేయబోతున్నారు. నేడు జరగబోయే ఈవెంట్ కి ముందు షియోమి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ యూనిట్లకు పైగా రెడ్‌మి నోట్ సిరీస్‌ను విక్రయించినట్లు ధృవీకరించింది.

సెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

షియోమి

షియోమి సంస్థ ఇండియాలో ఈవెంట్‌ను ఈ రోజు మధ్యాహ్నం 12:00 PM IST వద్ద షెడ్యూల్ చేసింది. ఇది యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధర మరియు లభ్యతను ప్రకటించనుంది. రెడ్‌మి నోట్ 8 ప్రో అధికారికంగా వెళ్ళిన తర్వాత అమెజాన్ ఇండియా మరియు Mi.కామ్ ద్వారా లభించవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 8 Sales Start Today on Flipkart: Price, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X