బిగ్ దీపావళి సేల్స్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరో బాంబ్.....ఫోన్లు, టీవీలపై ఊహించని డిస్కౌంట్

|

దసరా పండుగను పురష్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ను ముగించింది. అయితే ఈ నెలలో రాబోతున్న దీపావళికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో పండుగకు ముందే మరో సేల్ ను ప్రకటించింది. బిగ్ దీపావళి సేల్స్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 16 వరకు జరగనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్
 

కాకపోతే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 11 రాత్రి 8 గంటల నుంచి ముందస్తు యాక్సిస్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టివిలపై గొప్ప డిస్కౌంట్లను మరియు ఆఫర్‌లను అందిస్తోంది.

అమెజాన్‌లో మళ్ళీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్... గ్రేట్ ఆఫర్స్....

ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ లో స్మార్ట్‌ఫోన్‌లపై అందించే డిస్కౌంట్‌ల గురించి ఇంకా ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. అయితే రెడ్‌మి నోట్ 7 ప్రో, వివో జెడ్ 1 ప్రో, రియల్‌మి C2, రియల్‌మి 5 మరియు రెడ్‌మి నోట్ 7 ఎస్ వంటి ఫోన్‌ల మీద గొప్ప ఆఫర్లను ఆశించవచ్చు.

బిగ్ దీపావళి సేల్స్

బిగ్ దీపావళి సేల్స్ సమయంలో అంకితమైన మైక్రోసైట్ మీద అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ల నుండి పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు, బైబ్యాక్ గ్యారెంటీ మరియు మొబైల్ ప్రొటెక్షన్ ను ఆశించవచ్చని మాత్రమే పేర్కొంది. టీవీలు మరియు వాటి ఉపకరణాలలో 50,000 ఉత్పత్తులకు ఫ్లిప్‌కార్ట్ 75 శాతం వరకు రాయితీ ఇస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్స్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 90 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

ఎస్‌బిఐ క్రెడిట్ కార్డు
 

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్స్ సందర్భంగా ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుల వినియోగదారులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందగలుగుతారు. అదనంగా మీరు ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు.

రష్ అవర్

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్స్ సందర్భంగా మొబైల్స్, టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను కొన్ని నిర్దిష్ట సమయాల్లో అదనపు డిస్కౌంట్లతో అందిస్తుంది. ఈ ఫ్లాష్ సేల్స్ 12am, 8am, 4pm వంటి సమయాలలో అందిస్తుంది. 12am నుండి 2am గంటల మధ్య రష్ అవర్ వ్యవధిలో అదనపు డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. ఈ సమయంలో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మొబైల్స్ వంటి మరిన్నింటిపై 85 శాతం వరకు మినహాయింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ అక్టోబర్ 12 న ఉదయం 12 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale Announced starts From October 12 to 16

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X