ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ ఫెస్ట్ :ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు

|

ప్రముఖ తైవానీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆసుస్ తన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అది కూడా ఫ్లిప్‌కార్ట్ యొక్క మంత్- ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సందర్భంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. గత నెల ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్ ఫెస్ట్‌ల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ ఈ నెల చివరి వారంలో సేల్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం ఈ అమ్మకం ఆగస్టు 26, 2019 న ప్రారంభమై ఆగస్టు 31 వరకు ఆరు రోజుల పాటు కొనసాగుతుంది.

Flipkart Month-end Mobiles Fest: Amazing Discounts on Asus Smartphones

ఈ అమ్మకం సమయంలో ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌లపై లభించే అన్ని రకాల ఆఫర్ల యొక్క వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆసుస్ ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ వివరాలు:

ఆసుస్ ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ వివరాలు:

ఆసుస్ ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ వివరాల ప్రకారం ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ల కోసం ఆసుస్ అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. సమాచారం ప్రకారం ఆసుస్ 6Z ను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు తమ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే వారికి అదనంగా 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల సహాయంతో నో-కాస్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తోంది . ఈ ఆఫర్లు మూడు నుండి ఆరు నెలల మధ్య ఉంటాయి. దీనికి మించి దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఫ్లాట్ డిస్కౌంట్ లబిస్తాయి. ఈ అమ్మకంలో భాగంగా ఆసుస్ జెన్‌ఫోన్ 5Z కొనుగోలుపై 5,000 రూపాయల తగ్గింపు పొందవచ్చు. అంటే 8 జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్ గల కొత్త జెన్‌ఫోన్ 5Z స్మార్ట్‌ఫోన్‌ కేవలం 23,999 రూపాయలకు లభిస్తుంది.

ఇతర ఆఫర్లు:

ఇతర ఆఫర్లు:

ఇతర ఆఫర్ల విషయానికి వస్తే ఆసుస్ యొక్క జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1, మాక్స్ M2 మరియు మాక్స్ M1 లలో ఫోన్లపై 500 రూపాయల తగ్గింపును కూడా అందిస్తోంది. డిస్కౌంట్ తరువాత 3 జిబి మరియు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 ధర 7,499 రూపాయలకు లభిస్తుంది. అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కూడా 8,499 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఆసుస్ ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సందర్భంగా మాక్స్ M1 ను 6,499 రూపాయలకు మరియు మ్యాక్స్ M2 యొక్క 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను 7,499 రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ అమ్మకపు కార్యక్రమంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఇతర స్మార్ట్‌ఫోన్‌లను కూడా తక్కువ ధరకు అందిస్తోంది.

అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు:

అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు:

ఫ్లిప్‌కార్ట్‌ యొక్క మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ అమ్మకం సమయంలో వినియోగదారులు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల కింద ఒప్పో ఎఫ్ 11 ప్రో, ఒప్పో F11, హానర్ 20, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో రెనో 10X జూమ్ మరియు గూగుల్ పిక్సెల్ 3a మొబైల్స్ మీద 6,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రియల్‌మి 3 ప్రో, ఆసుస్ 5Z, బ్లాక్ షార్క్ 2, టెక్నో ఫాంటమ్ 9, ఆసుస్ 6Z, శామ్‌సంగ్ గెలాక్సీS10, శామ్‌సంగ్ గెలాక్సీ S10 +, శామ్‌సంగ్ గెలాక్సీ S10e, మరియు శామ్‌సంగ్ గెలాక్సీS9 + ల మీద ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ EMI ఎంపికలను జాబితా చేసింది.

ఆసుస్6Z స్పెసిఫికేషన్స్:

ఆసుస్6Z స్పెసిఫికేషన్స్:

ఆసుస్ 6Z 19.5: 9 కారక నిష్పత్తితో 6.4-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 855 SoC చేత శక్తిని కలిగి ఉంది. ఇది 8GB వరకు ర్యామ్ మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది.

ఆసుస్ 6z ప్రధానంగా ఫ్లిప్ కెమెరా మాడ్యూల్‌కు ప్రసిద్ది చెందింది.ఈ మాడ్యూల్ లో సోనీ IMX586 సెన్సార్ తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది మరియు 13-మెగాపిక్సెల్ వైడ్-ఆంగిల్ కెమెరా కలిగిన సెకండరీ కెమెరాను కలిగి ఉంది.ఈ రెండూ కూడా అవసరమైనప్పుడు ముందు కెమెరాగా కూడా ఉపయోగించవచ్చు. ఫ్లిప్ కెమెరా యాంత్రిక మోటార్ ద్వారా నియంత్రించబడుతుంది మరియు ఆసుస్ సంస్థ దీనిని మరింత మన్నికైన మరియు అనేక భద్రతా యంత్రాంగాలతో నిర్మించిందని పేర్కొంది.

ఫ్లిప్ కెమెరా సన్నని గడ్డం ఉన్న నాచ్-లెస్ నారో-బెజెల్ డిస్ప్లే కోసం చేస్తుంది.ఈ ఫోన్ ఫుల్ HD + రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానల్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో కెపాసిటివ్ వేలిముద్ర సెన్సార్ ఉంది. 2019 అన్ని ఫ్లాగ్‌షిప్‌ల మాదిరిగానే ఫోన్‌లో 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్ తో వస్తుంది. ఒకేసారి రెండు సిమ్ కార్డులు మరియు మైక్రో ఎస్డీ కార్డును ఉంచగల ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ను కూడా ఫోన్ అందిస్తుంది. ఫోన్ ఎప్పుడు ఆఫ్ కాకుండా ఉంచడానికి త్వరగా ఛార్జ్ చేయడానికి క్విక్ ఛార్జ్ 4.0 సహాయంతో గల 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.గూగుల్ అసిస్టెంట్ లేదా కస్టమ్ ఫంక్షన్లను ప్రారంభించటానికి గాను ఇది స్మార్ట్ కీతో వస్తుంది.

 

Best Mobiles in India

English summary
Flipkart Month-end Mobiles Fest: Amazing Discounts on Asus Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X