Home
News

ఫ్లిప్‌కార్ట్ లో మొదలైన నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్

ఈరోజు అంటే ఆగస్టు 8 నుండి ఫ్లిప్‌కార్ట్ లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ అనే పేరుతో మన ముందుకు వస్తోంది. అమెజాన్ కూడా మంచి ఆఫర్లతో అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ను ఈ రోజు నుండి మొదలుపెట్టింది. ఇండియా యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ ఆగస్టు 8 గురువారం అర్ధరాత్రి నుండి ప్రారంభంకానున్నాయి.

Today Flipkart Starts National Shopping Days Sale

ఈ సేల్స్ రెండు రోజుల పాటు ఆగస్టు 10 శనివారం వరకు ఈ సేల్స్ అందుబాటులో ఉంటుంది. ఈ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ ఆగస్టు 7 రాత్రి 8 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు యాక్సిస్ అందించి దాని యొక్క సేల్స్ ముందుగా ప్రారంభమయ్యాయి. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఈ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ ద్వారా అందించబోయే కొన్ని ప్రధాన ఆఫర్లను వెల్లడించింది.

Today Flipkart Starts National Shopping Days Sale

నేషనల్ షాపింగ్ డేస్ 2019 సేల్స్ సందర్భంగా బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి ఫ్లిప్‌కార్ట్ ఐసిఐసిఐ బ్యాంక్‌తో ఓప్పందం కుదుర్చుకున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ లో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు వంటి ఇతర ముఖ్యమైన ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M30, గెలాక్సీ M20:

శామ్‌సంగ్ గెలాక్సీ M30, గెలాక్సీ M20:

ఫ్లిప్‌కార్ట్ లో నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ సమయంలో శామ్‌సంగ్ గెలాక్సీ M30 మొబైల్ ఫోన్ కి 1,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క 4GB + 64GB మరియు 6GB + 128GB రెండు వేరియంట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీM30 చౌకగా మారడం ఇది మొదటిసారి కాదు. వాస్తవానికి గత కొన్ని అమ్మకాలలో గెలాక్సీM30 పై 1,000 రూపాయల తగ్గింపు అందించింది. అదేవిధంగా శామ్‌సంగ్ గెలాక్సీ M20 పై కూడా 1,000 రూపాయల తగ్గింపు అందిస్తోంది.

హానర్ 20i, హానర్ 8X :

హానర్ 20i, హానర్ 8X :

రెండు నెలల కిందట ఇండియాలో లాంచ్ అయిన హానర్ 20i మొబైల్ ఫోన్ కు ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ సమయంలో 2,000 రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్‌ యొక్క ప్రస్తుత ధర రూ.14,999 అయితే ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ సమయంలో దీని ధర 12,999 రూపాయలు. ఈ ఫోన్ ను కొనుగోలు చేయదలచిన వారు ICICI క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించినచో బ్యాంకింగ్ డిస్కౌంట్ కూడా ఫోన్‌ను మరింత చౌకగా చేస్తుంది. హానర్ 8X యొక్క 4 జీబీ + 64 జీబీ మోడల్‌ ప్రస్తుత ధర రూ.14,999 కానీ ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ సమయంలో దీనిని 10,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ యొక్క 6GB + 128GB మోడల్‌ ప్రస్తుత ధర 18,999 రూపాయలు దీనిని రూ.16,999లకు లభిస్తుంది.

రెడ్‌మి Y3, రెడ్‌మి Y2:

రెడ్‌మి Y3, రెడ్‌మి Y2:

ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ లో భాగంగా రెడ్‌మి 7, రెడ్‌మి 6A, రెడ్‌మి 6 మొబైల్ ఫోన్లు కూడా డిస్కౌంట్లను పొందనుంది. రెడ్‌మి 7 యొక్క 3 జీబీ + 32 జీబీ వేరియంట్‌ సాధారణ ధర రూ. 8,999. ఈ అమ్మకం సమయంలో దీనిని 8,499 రూపాయలకు అందిస్తున్నారు. అదేవిధంగా రెడ్‌మి 6A యొక్క 2 జీబీ + 32 జీబీ వేరియంట్ సాధారణ ధర రూ.6,999, ఈ అమ్మకం సమయంలో రూ. 6,199 కు అందిస్తున్నారు. అలాగే రెడ్‌మి 6 మొబైల్ ఫోనెను కూడా అమెజాన్ అమ్మకం సమయంలో 1,000 రూపాయల తగ్గింపుతో 6,999 రూపాయలకు అందిస్తున్నారు.

ఒప్పో & ఐఫోన్:

ఒప్పో & ఐఫోన్:

ఒప్పోR17 ప్రో, ఒప్పో రెనో 10X జూమ్, మరియు ఒప్పోF11 ప్రో కూడా సాధారణ ధర కంటే 7,000 రూపాయల అదనపు డిస్కౌంట్లతో ఈ వారం ఫ్లిప్‌కార్ట్‌లో జరగబోయే నేషనల్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యొక్క నేషనల్ షాపింగ్ డేస్ సేల్ ఖరీదైన EMI చెల్లింపు ఎంపికలతో పాటు ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై తగ్గింపును తెస్తుంది. ఐఫోన్ మోడళ్ల గురించి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లు ప్రస్తుతం తెలియవు.

స్మార్ట్ టీవీలు:

స్మార్ట్ టీవీలు:

మొబైల్ ఫోన్‌లతో పాటు ఈ వారం ఫ్లిప్‌కార్ట్ చేసిన అతి పెద్ద సేల్స్ టీవీలు మరియు ఇతర ఉపకరణాల మీద 75 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. షియోమి యొక్క MI 4A ప్రో యొక్క 32-అంగుళాల ఆండ్రాయిడ్ టివి మరియు VU యొక్క అల్ట్రా స్మార్ట్ టీవీ 40-అంగుళాల ఫుల్-హెచ్‌డి LED టివి ఈ అమ్మకంలో భాగంగా గొప్ప ఆఫర్లతో అందుబాటులో ఉంటాయి. శామ్సంగ్ యొక్క కొత్త 32-అంగుళాల హెచ్‌డి-రెడీ స్మార్ట్ టీవీ మీద కూడా ఈ అమ్మకం సమయంలో గొప్ప రాయితీ ధరతో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Today Flipkart Starts National Shopping Days Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X