తక్కువ ధరకు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి iFFALCON K31 స్మార్ట్ టీవీ

|

చైనాకు సంబందించిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇఫాల్కాన్ తన సరికొత్త స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల విడుదల అయిన ప్రకటన ప్రకారం ఇఫాల్కాన్ యొక్క తాజా మోడల్ ఇఫాల్కాన్ K31 స్మార్ట్ టివి సిరీస్. ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్లు, లభ్యత మరియు ధర వివరాలను ఇఫాల్కాన్ సంస్థ ప్రకటించింది.

iffalcon k31 smart tv series with 4k resolution android 9 pie launched flash sale on august 6

ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ధరల విషయాన్ని ప్రస్తావించే ముందు లభ్యత వివరాల గురించి తెలుసుకుందాం. ఇఫ్ఫాల్కాన్ K31 స్మార్ట్ టివి 2019 ఈ రోజు అంటే ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్‌లో భాగంగా వీటి యొక్క అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ ఫ్లాష్ అమ్మకాలలో భాగంగా స్మార్ట్ టీవీ యొక్క ఉత్పత్తులు త్వరగా స్టాక్ అయిపోతున్నందున ఆసక్తిగల కొనుగోలుదారులు త్వరగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలి.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

ఇఫ్ఫాల్కాన్ K31 స్మార్ట్ టీవీ 43 అంగుళాల నుండి 55 అంగుళాల వరకు మూడు వేర్వేరు డిస్ప్లే పరిమాణాలలో విక్రయిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క మూడవ వేరియంట్ 50 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. విభిన్న డిస్ప్లే ప్యానల్ పరిమాణాలతో ఉన్న ఈ స్మార్ట్ టీవీ యొక్క అన్ని వేరియంట్లు గొప్ప హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటాయి. స్టార్టర్స్ కోసం iFFALCON K31 స్మార్ట్ టివి సిరీస్ HDR10 మద్దతుతో 4K UHD డిస్ప్లే రిజల్యూషన్‌ మద్దతుతో వస్తుంది . ఈ సిరీస్ AI- టెక్నాలజీతో కూడిన స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. వీటిలో సౌండ్ ఇంజన్, వాయిస్ ఇంటరాక్షన్, ఇంటర్‌కనెక్ట్ మరియు పిక్చర్ ఇంజన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలలో హ్యాండ్స్‌ఫ్రీ వాయిస్ సెర్చ్ కూడా ఉంటుంది. ఇఫ్ఫాల్కాన్ K31 స్మార్ట్ టీవీ సిరీస్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత సాఫ్ట్‌వేర్ మద్దతుతో పనిచేస్తుంది.

ఫీచర్స్:

ఫీచర్స్:

అదనంగా ఈ స్మార్ట్ టీవీ సిరీస్ గూగుల్ అసిస్టెంట్-పవర్డ్ వాయిస్ రిమోట్‌తో కూడా వస్తుంది. క్వాడ్-కోర్ CPU, 2 Gb ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ సిరీస్ వస్తుందని ఇఫ్ఫాల్కాన్ రిలీజ్ చేసిన ల్యాండింగ్ పేజీ వెల్లడించింది. అంతే కాకుండా ఇది డాల్బీ ఆడియో మరియు స్టీరియో సౌండ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. iFFALCON టీవీలో అంతర్నిర్మిత Chromecast ని కూడా జోడించింది.

ధర వివరాలు:

ధర వివరాలు:

ఇఫ్ఫాల్కాన్ యొక్క 43-అంగుళాల వేరియంట్ ధర 27,999 రూపాయలు అలాగే 50-అంగుళాల వేరియంట్ ధర 32,999 రూపాయలు. చివరగా ఈ సిరీస్ లో అతి పెద్దదైన 55-అంగుళాల వేరియంట్ ధర 37,999 రూపాయలుగా నిర్దారించారు . ఈ కొత్త ప్రయోగంలో భాగంగా ఇఫాల్కాన్ సంస్థ iFFALCON K31 స్మార్ట్ టివి సిరీస్‌ను పొందడానికి పలు రకాల లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా సిటిబ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై అదనంగా 2,000 రూపాయల వరకు తగ్గింపు మరియు 10 శాతం తక్షణ తగ్గింపు అందిస్తుంది.

 

 

 ఇండియా మేనేజింగ్ డైరెక్టర్:

ఇండియా మేనేజింగ్ డైరెక్టర్:

లాంచ్‌లో భాగంగా టిసిఎల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైక్ చెన్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఇఫాల్కాన్ సంస్థ ద్వారా వస్తున్న ఇఫాల్కాన్ K310 స్మార్ట్ టీవీను ప్రత్యేక ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో ఆవిష్కరించినందుకు మేము సంతోషిస్తున్నాము. సింపుల్ జాయ్, సింపుల్ లవ్ అని చెప్పే నినాదంతో మా బ్రాండ్ తాజా ప్రయోగం సమలేఖనం చేయబడింది అని మైక్ చెన్ పేర్కొన్నాడు.

 

 

Best Mobiles in India

English summary
iffalcon k31 smart tv series with 4k resolution android 9 pie launched flash sale on august 6

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X