Home
News

సూపర్ ఫ్లాష్ సేల్ సండేను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్ తన సూపర్ ఫ్లాష్ సండేను ప్రకటించింది.ఈ సూపర్ ఫ్లాష్ సేల్‌లో భాగంగా ఐదు ఫోన్లు మంచి ఆఫర్లతో కొనుగోలుదారులు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెడ్‌మి K20 ప్రో, రెడ్‌మి K20, రియల్‌మి X, రియల్‌మి 3i, రెడ్‌మి 7A ఐదు ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు జూలై 28 న ఫ్లాష్ సేల్‌లో అమ్మకం జరుగుతాయి. అంటే ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్స్ మొదలవుతుంది.

flipkart super flash sunday sale july 28 12pm

ఈ సమయంలో ఈ ఫోన్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ పూర్తి మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను కూడా ఉత్తమ ధరలకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఫ్లాష్ సేల్ సండేను ఉపయోగించుకోవడానికి మీరు ముందే నమోదు చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము. ఈ ఫ్లాష్ సేల్ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు ఆన్‌లైన్‌లో ఉండండి. ఫోన్‌ల స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వేగంగా చెక్అవుట్ కోసం చెల్లింపు మరియు చిరునామా వివరాలను ముందే పూరించండి.

flipkart super flash sunday sale july 28 12pm

సూపర్ ఫ్లాష్ సేల్స్ లో రెడ్‌మి K20 , రెడ్‌మి K20 ప్రో, రెడ్‌మి 7A , రియల్‌మి X, మరియు రియల్‌మి 3i అన్నీ ఒకేసారి మధ్యాహ్నం 12 గంటలకు IST వద్ద అమ్మకాలకు వెళ్తాయి. స్టాక్స్ చివరి వరకు ఈ అమ్మకం కొనసాగుతుందని ఈ ఫోన్‌ల కొనుగోలుతో పాటు ఉత్తమ ధరలకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

రెడ్‌మిK20 , రెడ్‌మి K20 ప్రో:

రెడ్‌మిK20 , రెడ్‌మి K20 ప్రో:

రెడ్‌మిK20 , రెడ్‌మి K20 ప్రో ఫోన్‌లు ఈ ఆదివారం అమ్మకాలకు వస్తాయని షియోమి ఇప్పటికే ప్రకటించింది. భారతదేశంలో రెడ్‌మి K20 ధర 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 21,999రూపాయలు కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 23,999 రూపాయలు. అయితే రెడ్‌మి K20 ప్రో ధర 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌కు 27,999 రూపాయలు కాగా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 30,999 రూపాయలు. ఫ్లాష్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతుండగా మీరు ఫోన్‌లను Mi.com మరియు Mi హోమ్ స్టోర్స్‌ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి 7A:

రెడ్‌మి 7A:

రెడ్‌మి 7A ను సూపర్ సేల్స్ ఆఫర్‌లలో భాగంగా రిలయన్స్ జియోపై 125 జీబీ అదనపు డేటాతో పాటు 2,200 విలువైన క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ 44 డిస్కౌంట్ వోచర్‌ల రూపంలో పొందవచ్చు. ఈ డిస్కౌంట్ వోచర్‌లు మై జియో యాప్‌లో ఒకొకటి 50 రూపాయల చప్పున రీఛార్జి చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను పొందటానికి తమ జియో కనెక్షన్‌ను రూ. 198 లేదా రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాలి.

రియల్‌మిX :

రియల్‌మిX :

రియల్‌మి ఫోన్‌ల విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ రియల్‌మిX కూడా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు IST అమ్మకాలకు వెళ్తుందని చెప్పారు. భారతదేశంలో రియల్‌మిX ధర 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్‌కు 16,999 రూపాయలు. అలాగే ఫోన్ యొక్క 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 19,999 రూపాయలు. రియల్‌మిX పోలార్ వైట్ మరియు స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ అమ్మకం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే జరుగుతుంది. రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో తదుపరి అమ్మకం జూలై 31 న జరుగుతుంది.

రియల్‌మి 3i:

రియల్‌మి 3i:

చివరగా రియల్‌మి 3i కూడా ఫ్లిప్‌కార్ట్ యొక్క సూపర్ ఫ్లాష్ సేల్ సండేలో అందుబాటులో ఉన్నది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ ధర 7,999రూపాయలు కాగా, హై-ఎండ్ వేరియంట్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ధర 9,999 రూపాయలు. దీనిని డైమండ్ బ్లాక్, డైమండ్ బ్లూ మరియు డైమండ్ రెడ్ కలర్ ఎంపికల మధ్య ఎంచుకోవచ్చు. ఈ అమ్మకం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే జరుగుతుంది మరియు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో తదుపరి అమ్మకం జూలై 30 న జరుగుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
flipkart super flash sunday sale july 28 12pm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X