ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డిస్కౌంట్లతో మొదలైన మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్స్

|

మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను రాయితీ ధరలకు అందించడంలో ముందు ఉండే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కూడా మరొక సేల్స్ తో మన ముందుకు వచ్చింది. గూగుల్ పిక్సెల్ 3, మోటరోలా వన్ పవర్, హానర్ 9 ఎన్, పోకో ఎఫ్ 1, మరియు నోకియా 6.1 లు ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ అమ్మకంలో డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి.

 
ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్స్

ఈ రోజు ప్రారంభమైన ఈ సేల్స్ జూలై 31 బుధవారం వరకు ఉంటుంది. ఇందులో భాగంగా హానర్ 10 లైట్, హానర్ 7, హానర్ 9i మరియు హానర్ 9 లైట్ మొబైల్ లు కూడా రాయితీ ధరలకు ఫ్లిప్‌కార్ట్‌ అందించనుంది. వినియోగదారులు శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో రెనో 10X జూమ్ మరియు హానర్ 20 వంటి మోడళ్లపై కూడా అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్స్

అదేవిధంగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో ఆసుస్ 6 జెడ్, బ్లాక్ షార్క్ 2, మరియు ఐఫోన్ 8 ప్లస్ మరియు మరిన్ని స్మార్ట్ ఫోన్లను నో-కాస్ట్ EMI ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

గూగుల్ పిక్సెల్ ఆఫర్స్:

గూగుల్ పిక్సెల్ ఆఫర్స్:

ముఖ్యమైన డిస్కౌంట్ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ అమ్మకంలో గూగుల్ పిక్సెల్ 3 మొబైల్ ను 49,999 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్‌ను గత ఏడాది 71,000రూపాయల ధర వద్ద ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో మోటరోలా వన్ పవర్ కూడా 10,999రూపాయల డిస్కౌంట్ ధర వద్ద లభిస్తుంది.ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ ధర15,999రూపాయల నుండి మొదలైంది.మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్స్ లో అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు నెలకు 1,833 రూపాయల నుండి మొదలవుతుంది.

హానర్ & పోకో ఆఫర్స్:

హానర్ & పోకో ఆఫర్స్:

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత అమ్మకాలలో భాగంగా హానర్ 9N మొబైల్ యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ "అత్యల్ప ధర" వద్ద అందిస్తున్నది. ఈ ఫోన్ యొక్క ధర కేవలం 8,999రూపాయలు కానీ సాధారణంగా దీని యొక్క ధర 9,999రూపాయలు.

పోకోF1 మొబైల్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర 20,000రూపాయల కంటే తక్కువగా కేవలం 18,999రూపాయలకు లభిస్తోంది. దీనిని నో-కాస్ట్ EMI ఆప్షన్లలో భాగంగా నెలకు కేవలం 3,000రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

 

నోకియా 6.1:
 

నోకియా 6.1:

ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో నోకియా 6.1 మొబైల్ యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ను కేవలం 7,999 రూపాయలకు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ యొక్క అధికారిక ధర 9,999రూపాయలు. హానర్ 10 లైట్ 3GB వేరియంట్ కూడా దాని సాధారణ ధర 12,999రూపాయల కంటే తక్కువ ధరకు కేవలం 9,999 రూపాయలకు అందిస్తోంది.

హానర్ మొబైల్ ఫోన్‌లపై డిస్కౌంట్స్:

హానర్ మొబైల్ ఫోన్‌లపై డిస్కౌంట్స్:

ఫ్లిప్‌కార్ట్ యొక్క మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ అమ్మకం సమయంలో మరికొన్ని హానర్ ఫోన్‌లకు కూడా తగ్గింపు లభించింది. హానర్ 7S యొక్క 2GB ర్యామ్ + 16GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 6,999రూపాయల కంటే కంటే తక్కువ ధరకు కేవలం 5,499రూపాయలకు లభిస్తోంది. అదేవిధంగా హానర్ 9i కూడా 8,999 రూపాయల డిస్కౌంట్ ధర వద్ద లభిస్తోంది. ఈ ఫోన్‌ను గత ఏడాది 17,999 రూపాయల వద్ద రిలీజ్ అయింది. హానర్ 9 లైట్ మొబైల్ కూడా రూ.10,999 కి బదులుగా 7,999 రూపాయలకు లభిస్తుంది. ఇంకా హానర్ ప్లే మొబైల్ కూడా రూ.12,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీని యొక్క అసలు ధర 19,999 రూపాయలు.

అలాగే ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో హానర్ 20i యొక్క ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై 1,000రూపాయల తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా ఇన్ఫినిక్స్S4 యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్ మీద కూడా 1,000రూపాయల ప్రీపెయిడ్ డిస్కౌంట్ పొందవచ్చు.

 

 ఐఫోన్:

ఐఫోన్:

ప్రీమియం ఫోన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో ఐఫోన్ 8 ప్లస్ యొక్క ప్రారంభ ధర కేవలం 51,999 రూపాయలు . దీని యొక్క సాధారణ ప్రారంభ ధర 66,000 రూపాయలు. వీటిని పొందడానికి నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా నెలకు 1,445 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.


మోటో G7 యొక్క ధర కూడా 16,999రూపాయల నుండి 14,999 రూపాయలకు తగ్గించబడింది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకం పానాసోనిక్ ఎలుగా Z1 ప్రో మొబైల్ కూడా 17,490 రూపాయల నుండి 7,490 రూపాయలకు తగ్గించబడింది. ఇంకా ఇన్ఫినిక్స్ నోట్ 5 స్టైలస్ మొబైల్ కూడా 15,999 రూపాయల ధర కంటే 3,000 రూపాయల తగ్గింపుతో కేవలం 12,499 రూపాయలకు అందించబడుతోంది.

 

అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు:

అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు:

ఫ్లిప్‌కార్ట్‌ యొక్క మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ అమ్మకం సమయంలో వినియోగదారులు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల కింద ఒప్పో ఎఫ్ 11 ప్రో, ఒప్పో F11, హానర్ 20, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో రెనో 10X జూమ్ మరియు గూగుల్ పిక్సెల్ 3a మొబైల్స్ మీద 6,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రియల్‌మి 3 ప్రో, ఆసుస్ 5Z, బ్లాక్ షార్క్ 2, టెక్నో ఫాంటమ్ 9, ఆసుస్ 6Z, శామ్‌సంగ్ గెలాక్సీS10, శామ్‌సంగ్ గెలాక్సీ S10 +, శామ్‌సంగ్ గెలాక్సీ S10e, మరియు శామ్‌సంగ్ గెలాక్సీS9 + ల మీద ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ EMI ఎంపికలను జాబితా చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
flipkart month end mobiles fest sale july 26 31

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X