ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్... మన భవిష్యత్ ఇదే

Written By:

పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తరువాతి తరం టెక్నాలజీ పెనుముప్పుగా మారే అవకాశముందని పానాసోనిక్ టాప్ సెక్యూరిటీ నిపుణుడు హైకోహైరో లిన్ హెచ్చరించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'ను ఉద్దేశించి తమ అభిప్రాయాన్ని వెళ్లగక్కిన లిన్ తరువాతి తరం గాడ్జెట్‌లతో తిప్పులు తప్పవని అంటున్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్... మన భవిష్యత్ ఇదే

ఈయన చెబుతోన్న దాని ప్రకారం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో భాగంగా మన ఇంట్లోని అన్ని వస్తువులు ఇంటర్నెట్‌కు అనుసంధానమవుతాయి. ఈ క్రమంలో వీటిని తప్పుదోవ పట్టించే మాల్వేర్లు తీవ్రంగా పెచ్చురిల్లే అవకాశముందని లిన్ అభిప్రాయపడుతున్నారు. పర్యావసానంగా ఇళ్లు తగలబడిపోవటం పెను ప్రమాదాలు కూడా తప్పకపోవచ్చని అంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ ను సురక్షితంగా వాడుకోగలమని లిన్ చెబుతున్నారు.

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కే దక్కింది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది. మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..?

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!

మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.

ఫోన్ మెమరీ ఫుల్ అయ్యిందా..?

మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి రకరకాల పనులను ఖచ్చితమైన సమయపాలతో వాటి వాటి మేధస్సును ఉపయోగించి సమర్థవంతంగా పూర్తి చేసేస్తాయి. 2020 నాటి కల్లా ఐఓటీ పరిధి మరింత విస్తరించి అందులో ఉపకరణాల సంఖ్య 20 వేల కోట్లకు చేరుకుంటుదని ఓ అంచనా. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌

 సోలార్ రోడ్డు మార్గాలు

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అడువుల పర్యవేక్షణ

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పటిష్టమైన కారు సెక్యూరిటీ

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌

టాయ్ మెయిట్, వైర్‌లైస్ నెట్‌వర్క్ పై స్పందించే ఆట బొమ్మలు

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌

అండర్ వాటర్ నెట్‌వర్క్ నోడ్స్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gadgets of the future could burn down homes: Panasonic cyber security. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot