Google Duo లో ఒకే సారి 12 మందితో మాట్లాడవచ్చు!!!!

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ యొక్క వీడియో కాలింగ్ యాప్ గూగుల్ డుయో ఇప్పుడు తన గ్రూప్ కాలింగ్‌లో ఒకే సారి 12 మందికి మద్దతునిస్తుంది. ఈ విషయాన్ని గూగుల్ సంస్థ యొక్క ప్రొడక్ట్ అండ్ డిజైన్ సీనియర్ డైరెక్టర్ సనాజ్ అహారీ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

గ్రూప్ వీడియో కాలింగ్

ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్ కాలింగ్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. గూగుల్ డుయో యొక్క ఈ కొత్త ఫీచర్ నేటి నుండే అమల్లోకి వస్తుందని కూడా తన ట్విట్టర్ లో తెలిపారు. కరోనావైరస్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండి పని చేయడంతో ఆఫీస్ యొక్క మీటింగ్ మరియు వివిధ రకాల సేవల కోసం గ్రూప్ వీడియో కాలింగ్ మరియు మెసేజింగ్ అనేది కమ్యూనికేషన్ కోసం ప్రస్తుత పరిస్థితులలో అధికంగా ఉపయోగిస్తున్నారు.

గూగుల్  ప్రొడక్ట్ అండ్ డిజైన్ సీనియర్ డైరెక్టర్ ట్విట్

గూగుల్ ప్రొడక్ట్ అండ్ డిజైన్ సీనియర్ డైరెక్టర్ ట్విట్

గూగుల్ యొక్క ప్రొడక్ట్ అండ్ డిజైన్ సీనియర్ డైరెక్టర్ సనాజ్ అహారీ పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంటులోని సమాచారం విషయానికి వస్తే "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమకు ఇష్టమైన వారిని చూడటానికి మరియు వారితో మాట్లాడడానికి గూగుల్ డుయో యాప్ ను వినియోగదారులు ఉపయోగిస్తున్నవారందరికి మా యొక్క కృతజ్ఞతలు. గ్రూప్ కాలింగ్ అనేది ప్రస్తుత పరిస్థితులలో చాలా క్లిష్టమైనదని మేము గుర్తించాము. గ్రూప్ కాలింగ్ లో పాల్గొనేవారి సంఖ్యను ఇప్పుడు 8 మంది నుండి 12 మందికి పెంచాము. #AllInThisTogether # COVID19. " గూగుల్ డుయోను వారి ప్రాధమిక వీడియో కాలింగ్ యాప్ గా ఉపయోగించే వ్యక్తులకు ఈ కొత్త అప్ డేట్ గొప్ప శుభవార్తగా ఉంటుంది అని భావిస్తున్నాము.

గూగుల్ డుయో గ్రూప్ వీడియో కాలింగ్‌

గూగుల్ డుయో గ్రూప్ వీడియో కాలింగ్‌

2016 లో మొదటిసారిగా ప్రారంభించిన సమయంలో గూగుల్ డుయో గ్రూప్ వీడియో కాలింగ్‌కు మద్దతు ఇవ్వలేదు. గత సంవత్సరం గూగుల్ నలుగురు వ్యక్తుల మద్దతుతో గ్రూప్ కాలింగ్ జోడించాలని నిర్ణయించింది. సుమారు ఒక నెల తరువాత గ్రూప్ వీడియో కాల్‌లో మద్దతును ఇచ్చే వారి సంఖ్యను ఎనిమిది మందికి పెంచింది. ఇప్పుడు గూగుల్ డుయో ఒకే గ్రూప్ కాల్‌లో 12 మందికి మద్దతు ఇస్తుంది.

గ్రూప్ వీడియో కాలింగ్ అప్ డేట్

గ్రూప్ వీడియో కాలింగ్ అప్ డేట్

12 వ్యక్తుల గ్రూప్ వీడియో కాలింగ్ కోసం ఎటువంటి అప్ డేట్ అవసరం లేదు. మీరు యాప్ ను ఓపెన్ చేసినప్పుడు నేరుగా ఒకే సమూహంలో 11 మందిని జోడించి చాటింగ్ ప్రారంభించవచ్చు.

*** మీరు యాప్ ను ఓపెన్ చేసినప్పుడు మీ పరిచయాలను చూపించడానికి పైకి స్వైప్ చేయండి.

*** తరువాత గ్రూపును సృష్టించడానికి గల ఎంపిక మీద నొక్కండి.

*** దీని తరువాత 11 మంది వరకు జోడించండి.

*** తరువాత స్క్రీన్ దిగువన గల "Done" బటన్ మీద నొక్కండి.

*** మీరు సృష్టించిన గ్రూప్ కు పేరు పెట్టడానికి మీకు ఒక ఎంపిక ఇవ్వబడుతుంది.

*** ఆ తర్వాత మీరు "Start" అనే బటన్ మీద నొక్కండి. ఈ యాప్ అదనపు పరిచయాలను డయల్ చేయడం కూడా ప్రారంభిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Google Duo Group Call Now Allow Up to 12 Participants

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X