ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

Written By:

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ టెక్ రంగంలో టాప్ ప్లేస్ ని ఆక్రమించిన ఆనందం ఎక్కువ రోజులు ఆ కంపెనీకి ఉండేలా లేదు. ఈ దిగ్గజ కంపెనీకి త్వరలోనే భారీషాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం 2010లో వేసిన ఓ కేసుకు సంబంధించి ఆ సంస్థకు భారీగానే డబ్బులు ముట్టజెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ కేసు ఏమిటంటే సెర్చ్ ఇంజన్లో తనకు నచ్చిన కంపెనీలకే ముందు స్థానం ఇస్తూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ 2010లో ఓ కేసు దాఖలైంది.

Read more : గూగుల్ డాట్ కాం చాలా డేంజర్ : షాకిచ్చిన గూగుల్

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

ఈ కేసులో తీర్పు గూగుల్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుమారు 23 వేల కోట్ల (మూడు బిలియన్ యూరోల) భారీ జరిమానా పడనుందని పేర్కొంది. గత ఆరేళ్లుగా గూగుల్ యూరోపియన్ యూనియన్(ఈయూ) తో పోటీ పడి పలుదఫాలు విఫలం చెందిందనీ, ఇక ఈయూ పక్కకు తప్పుకుంటే తప్ప గూగుల్ జరిమానా నుంచి తప్పించుకోలేదని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జరిమానా నిర్ణయం జూన్ మొదటి వారంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు.

Read more: టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

అంతేకాకుండా తనకు నచ్చిన కంపనీ సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే హక్కును కూడా గూగుల్ కోల్పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. మాములుగా సెర్చ్ లో మొదటి స్థానం సంపాదించిన కంపెనీలకూ 10 శాతం మేర జరిమాన విధించే అవకాశం ఉంది.గూగుల్ కు సంబంధించిన ఆసక్తికర నిజాలు ఓ సారి తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

గూగుల్ వ్యవస్థాపకులు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

గూగుల్ ఉద్యోగి మరణిస్తే

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

గూగుల్ ఉద్యోగి మరణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదరు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

2020 లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

2020 లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

అడ్వర్టైజింగ్ విభాగంలో

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్లు.

నిమిషానికి సెర్చ్‌లు

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.

జీమెయిల్‌

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

మొదటి కంప్యూటర్ స్టోరేజ్

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.

తనను తానే ప్రోగ్రామ్

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

నెలకు రెండు కంపెనీల కొనుగోలు

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

2010 నుంచి గూగుల్ నెలకు రెండు కంపెనీలు చొప్పున కొనుగోలు చేస్తూ వస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Faces Record 3 Billion Euro EU Antitrust Fine: Report
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting