Home
News

తాడిని తన్నేవాడిని తలదన్నే టెక్నాలజీ.. గూగుల్ జెమ్మా 3 దెబ్బకి డీప్‌సీక్ డీలా..

Google Gemma 3: "తాడిని తన్నేవాడు ఉంటే, వాడి తలని తన్నేవాడు ఉంటాడు" అని పెద్దలు ఊరికే అనలేదు. గూగుల్ సంస్థ డీప్‌సీక్ విషయంలో సరిగ్గా అదే చేసింది టెక్నాలజీ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా గూగుల్ అదిరిపోయే పని చేసింది. గూగుల్ సంస్థ జెమ్మా 3 పేరుతో సరికొత్త ఓపెన్ సోర్స్ AI మోడల్స్‌ను రిలీజ్ చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా, వీటి పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు.

ఒక్క ఎన్విడియా H100 GPU ఉంటే చాలు, ఈ మోడల్స్ దుమ్ము రేపుతాయి. జెమ్మా 3 సిరీస్‌లో 1 బిలియన్, 4 బిలియన్, 12 బిలియన్, 27 బిలియన్ పారామీటర్లు కలిగిన మోడల్స్ ఉన్నాయి. చిన్న 1B మోడల్ తప్ప మిగతావన్నీ మల్టీమోడల్ మోడల్సే. అంటే మాటలతో పాటు బొమ్మల్ని, వీడియోల్ని కూడా అర్థం చేసుకుంటాయి.

Google Gemma 3 Matches DeepSeek R1 in Performance

అంతేకాదు, 140కి పైగా భాషల్లో అద్భుతంగా పనిచేస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీటిని ఎక్కడైనా, ఎప్పుడైనా వాడేసుకోవచ్చు. గూగుల్ సరికొత్త ఏఐ మోడల్స్‌ను సగర్వంగా ప్రదర్శిస్తోంది. చైనీస్ ఏఐ మోడల్స్ తమ మోడల్స్ చాలా సత్తా కలిగి ఉన్నాయని గూగుల్ చెప్పకనే చెబుతోంది.

* పెద్ద AI మోడల్స్‌ను కూడా దాటేసింది..

జెమ్మా 3 సిరీస్‌లో టాప్ మోడల్ అయిన జెమ్మా 3 27B, AI బెంచ్‌మార్కింగ్ టెస్టుల్లో అదరగొట్టింది. డీప్‌సీక్ V3 671B, లామా 3.1 405B, మిస్ట్రల్ లార్జ్, o3-మిని లాంటి భారీ మోడల్స్‌ను కూడా బీట్ చేసింది. LMSYS చాట్‌బాట్ ఎరీనాలో ఏకంగా 1,338 ఎలో స్కోర్ సాధించింది.

డీప్‌సీక్ R1 రీజనింగ్ మోడల్ (స్కోర్ 1,363) తర్వాత స్థానంలో నిలిచింది. సైజులో చిన్నగా ఉన్నా, పెర్ఫార్మెన్స్‌లో మాత్రం పెద్ద పులిలా దూసుకుపోతోంది. ఈ సక్సెస్ వెనుక గూగుల్ వాడిన కొత్త పోస్ట్-ట్రైనింగ్ టెక్నిక్స్‌ ఉన్నాయంట. వీటితో మ్యాథ్స్, కోడింగ్, చాటింగ్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్, మల్టీలింగ్యువల్ ప్రాసెసింగ్ వంటి AI ఫీచర్లు శక్తివంతంగా మారాయి.

* తక్కువ ఖర్చు, అదిరిపోయే టెక్నాలజీ..

జెమ్మా 3 మోడల్స్‌ను తయారు చేయడానికి గూగుల్ నాలెడ్జ్ డిస్టిలేషన్ అనే అడ్వాన్స్‌డ్ టెక్నిక్‌ను వాడింది. దీనివల్ల AI మోడల్స్‌లో చాలా డేటా ఉన్నా, అవి చాలా ఫాస్ట్‌గా పనిచేస్తాయి. జెమ్మా 3 27B మోడల్ పెర్ఫార్మెన్స్ దాదాపు జెమిని 1.5 ఫ్లాష్‌తో సమానంగా ఉండటం విశేషం.

అంతేకాదు, ఈ మోడల్స్‌లో 128K టోకెన్స్ లాంగ్ కాంటెక్స్ట్ విండో ఉంది. అంటే పెద్ద పెద్ద కబుర్లు, కష్టమైన ప్రశ్నలు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలవు. ఫంక్షన్ కాలింగ్, స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్ సపోర్ట్‌తో జెమ్మా 3 డెవలపర్లకు ఒక శక్తివంతమైన సాధనం అయిపోయింది. ఇది ఓపెన్-వెయిట్ మోడల్ కాబట్టి, డెవలపర్లు దీన్ని ఫ్రీగా మార్చుకుని వాడుకోవచ్చు.

జెమ్మా 3ని డీప్‌సీక్ R1, లామా 3 405B మోడల్స్‌కు పోటీగా గూగుల్ బరిలోకి దింపింది. ఈ అడ్వాన్స్‌డ్ మోడల్స్‌ను లాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు లాంటి డివైజ్‌లలో కూడా వాడుకోవచ్చు. తక్కువ ఖర్చు, మంచి పర్ఫార్మెన్స్, అందరికీ అందుబాటులో ఉండేలా గూగుల్ జెమ్మా 3ని రూపొందించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Gemma 3 models rival DeepSeek R1 in performance, despite being smaller and efficient. Open-source, multimodal, and multilingual, they mark a significant AI advancement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X