గూగుల్ కొత్త ఫీచర్, Online visiting కార్డులను సొంతంగా తయారుచేయడం ఎలా ?

|

ఇండియాలో మొబైల్ సెర్చ్ వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ కొత్తగా "పీపుల్ కార్డ్స్" ఫీచర్‌ను విడుదల చేసింది. కొన్ని సంవత్సరాలుగా పరీక్ష దశలో ఉన్న ఈ క్రొత్త ఫీచర్ మొత్తానికి ఇండియాలో లాంచ్ అయింది. ఇది గూగుల్ సెర్చ్‌ వినియోగదారులకు వర్చువల్ విజిటింగ్ కార్డుల లాంటి అనుభవాన్ని అందిస్తుంది.

 

గూగుల్ పీపుల్ కార్డు కొత్త ఫీచర్

గూగుల్ పీపుల్ కార్డు కొత్త ఫీచర్

గూగుల్ పీపుల్ కార్డు కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ యొక్క గుర్తింపును ప్రజలకు వివరించడానికి మరియు వారి యొక్క ప్రస్తుత వెబ్‌సైట్‌లను లేదా సోషల్ మీడియా ప్రొఫైల్‌లను హైలైట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ సపోర్ట్

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ సపోర్ట్

గూగుల్ సంస్థ తన "పీపుల్ కార్డ్స్" ఫీచర్‌ను మొదటగా మొబైల్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను సృష్టించడానికి మీరు మీ మొబైల్ డివైస్ లో మీయొక్క గూగుల్ అకౌంటుతో లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర భాషలను జోడించడానికి ఎక్కువ అవకాశం ఉంది.

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ ముఖ్య ఉద్దేశం
 

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ ముఖ్య ఉద్దేశం

గూగుల్ సంస్థ కొత్తగా విడుదల చేసిన పీపుల్ కార్డు ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే గూగుల్ సెర్చ్‌లో పబ్లిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉండటానికి వ్యక్తులను అనుమతించడం. అది అన్ని రకాల ఫలితాల మీద ప్రదర్శించబడుతుంది. ఇది మొదట ఫిబ్రవరిలో ప్రొఫైల్ కార్డులుగా గుర్తించబడింది.

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ కంటెంట్‌

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ కంటెంట్‌

గూగుల్ పీపుల్ కార్డు ఫీచర్ తో ప్రజలకు "అవసరమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని" అందించడమే లక్ష్యంగా ఉందని గూగుల్ పేర్కొంది. ప్రజల యొక్క పీపుల్ కార్డులలోని సమాచారంను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఉండడానికి వీలైనంత తక్కువగా ఉండడం మంచిది. అలాగే నాణ్యమైన కంటెంట్‌ను ఫ్లాగ్ చేయడానికి ఇది వినియోగదారులందరికీ ఎంపికను ఇస్తుంది. అలాగే ఉల్లంఘన కంటెంట్‌ను ఫ్లాగ్ చేయడానికి సెర్చ్ దిగ్గజం మానవ సమీక్ష మరియు స్వయంచాలక పద్ధతుల కలయికను కలిగి ఉంది. ఇంకా నకిలీ ప్రొఫైల్‌లను పరిమితం చేయడానికి గూగుల్ అకౌంటుకు ఒక కార్డును మాత్రమే అనుమతించబడుతుంది.

Google కార్డ్‌ను సృష్టించడం ఎలా?

Google కార్డ్‌ను సృష్టించడం ఎలా?

*** మీరు మొదట మీ యొక్క ఫోన్ లో గూగుల్ అకౌంటుతో సైన్ ఇన్ చేయాలి.

*** ఇప్పుడు 'సెర్చ్' బాక్స్ లో మీ పేరును శోధించండి. లేదా "యాడ్ మి టూ సెర్చ్" టైపు చేసి ఆపై కనిపించే ప్రాంప్ట్‌ను నొక్కండి.

*** మీ యొక్క కార్డును సృష్టించడానికి మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్ నుండి ఫోటోను చేర్చడానికి, మీ వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ప్రొఫైల్‌లకు లింక్‌లు, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను జోడించడాన్ని ఎంచుకోవచ్చు.

*** మీరు ప్రత్యేకమైన మొబైల్ నంబర్‌తో అకౌంటును అంతేంటికెట్ చేయాలి.

 

Best Mobiles in India

English summary
Google Launched "People Cards" Feature in India!!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X