Google Pixel Phones: ఒకేసారి మూడు కొత్త పిక్సెల్ ఫోన్‌లు లాంచ్ !!! ఫీచర్స్ అదుర్స్...

|

ప్రపంచం మొత్తం మీద ఐఫోన్ తరువాత ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్లలో గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు ఉన్నాయి. గూగుల్ సంస్థ తయారుచేసే ఈ పిక్సెల్ ఫోన్‌లకు ప్రపంచం మొత్తం మీద చాలా మంది అభిమానులు ఉన్నారు.

గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు

గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు

కరోనా కారణంగా ఈ ఏడాదిలో గూగుల్ సంస్థ కొత్త ఫోన్లను విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు తన అభిమానుల కోసం సంస్థ కొత్త శుభవార్తను తీసుకువచ్చింది. ఈ ఏడాది చివర్లో కొత్తగా మూడు పిక్సెల్ ఫోన్‌లను విడుదల చేయనుంది. I / O 2020 రద్దు కారణంగా కంపెనీ పిక్సెల్ 4A ఫోన్ లాంచ్ ను ముందుకు పొడిగించవలసి వచ్చింది. కావున సంస్థ ప్రపంచానికి కొత్తగా మరో మూడు కొత్త పిక్సెల్ ఫోన్‌లను అందివ్వాలని నిర్ణయించుకున్నారు.

పిక్సెల్ 4A, 4A 5G, పిక్సెల్ 5

పిక్సెల్ 4A, 4A 5G, పిక్సెల్ 5

గూగుల్ సంస్థ తన అభిమానుల కోసం పిక్సెల్ 4A, పిక్సెల్ 4A 5G మరియు పిక్సెల్ 5 పేర్లతో కొత్త ఫోన్లను అందివ్వనున్నది. పిక్సెల్ 4A ఫోన్ 2019 లో విడుదల అయిన పిక్సెల్ 3A సిరీస్‌కు అప్ డేట్ వెర్షన్ గా అందుబాటులోకి రానున్నది. అలాగే దీనికి అనుగుణంగా పిక్సెల్ 4A యొక్క 5G వేరియంట్‌ను కూడా ఆశ్చర్యకరంగా అందిస్తున్నది. పిక్సెల్ 4A మిడ్-రేంజ్ ప్రాసెసర్‌తో వస్తుండడంతో ఈ ఫోన్ యొక్క ధర తక్కువగానే ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 4A, 4A 5G ఫోన్‌ల పూర్తి వివరాలు

గూగుల్ పిక్సెల్ 4A, 4A 5G ఫోన్‌ల పూర్తి వివరాలు

గూగుల్ పిక్సెల్ 4A 5G మరియు పిక్సెల్ 5 ఫోన్‌లు సరికొత్త స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో రన్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల యొక్క లీక్‌ల ప్రకారం గూగుల్ పిక్సెల్ 4A XL ఫోన్‌ను 5G వేరియంట్‌ యొక్క అప్ డేట్ వెర్షన్ తో వస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇది ఫోన్ యొక్క అదే నాణ్యతను మరియు అదే డిజైన్ ను కలిగి ఉంది. హార్డ్‌వేర్ విభాగంలో పిక్సెల్ 5 ప్రీమియం మెరుగైన ఫీచర్స్ మరియు డిజైన్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే పిక్సెల్ 5 ఫోన్ వైర్‌లెస్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో రాబోతున్నట్లు కూడా కొన్ని లీక్ లు తెలియజేస్తున్నాయి.

గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్‌ల ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్‌ల ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 5A కంటే పిక్సెల్ 4A మరియు 4A 5G ఫోన్ అతి పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటాయని కొన్ని లీక్లు తెలియజేస్తున్నాయి. ఇతర వివరాల విషయానికి వస్తే ఇది ఐఫోన్ 12 లేదా శామ్‌సంగ్ గెలాక్సీ Se సిరీస్‌లకు పోటీగా గొప్ప ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా సోలి రాడార్ ఫీచర్‌ను తొలగించి దానికి బదులుగా సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ యొక్క కొత్త ఫోన్‌ల యొక్క ధరల విషయానికి వస్తే పిక్సెల్ 4a ఫోన్ యొక్క ధర ఐఫోన్ SE 2020 కన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆశించవచ్చు. అయితే పిక్సెల్ 4a 5G ఫోన్ మెరుగైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్లను కలిగి ఉండడం వల్ల ఇది ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. దీని యొక్క ధర ఐఫోన్ SE ధరకు దగ్గరగా ఉంటుంది. అలాగే పిక్సెల్ 5A ఫోన్ గూగుల్ సంస్థ నుండి వస్తున్న అత్యంత సరసమైన ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్‌గా ఆశించవచ్చు. గూగుల్ తన హార్డ్‌వేర్ సిరీస్‌ను ఎలా ఉంచాలనుకుంటుందో అన్న సమాచారం కోసం ఇంకా కొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంది.

Best Mobiles in India

English summary
Google Launches Three Pixel SmartPhones in This Year

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X