మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆస్తికర విషయాలు

Posted By:

అనేక వాయిదాలు, సవరణల తరువాత మొబైల్ సేవలను అందిస్తోన్న అన్ని టెలికాం కంపెనీలు దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకురావల్సి ఉంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్,
ఆర్‌కామ్, ఐడియా సెల్యులర్, యూనినార్ వంటి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు మొదలుకుని ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్లు దేశ్యవాప్త ఎంఎన్‌పీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలను జారీ చేసాయి.

Read More: సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?

ఈ కొత్త విధానం అమల్లోకి రావటం ద్వారా దేశంలో ఏ ప్రాంతానికి బదిలీ అయినా మీ మొబైల్ నెంబర్ మీతోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిప్ట్ అయ్యారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా మీరు హైదరాబాద్ లో వినియోగించిన మొబైల్ నెంబర్ ద్వారానే ఢిల్లీలో కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. వాస్తవానికి దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం మే 3 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. అయితే, టెలికాం ఆపరేటర్లు కొంత గడువు కోరటం వల్ల జూలై 3 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. నిన్నటి వరకు ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అనేది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంది.

Read More: డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల మేరకు

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల మేరకు పసలేని కారణాలు చూపించి మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనను తిరస్కరించిన సర్వీస్ ప్రొవైడర్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ఫిర్యాదు చేయాల్సి వస్తే

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే   ఈ నిబంధనలను ఆచరించండి.

ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

ముందుగా మీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి.

ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

వెంటనే సంబంధిత టెల్కో నుంచి ఫిర్యాదు నెంబర్, తేది, సమయంతో తదితర అంశాలతో కూడిన మెసేజ్ అందుతుంది. ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి.

సమస్య పరిష్కారం కాని పక్షంలో

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ ఫిర్యాదు నెంబర్‌ను రుజువుగా చూపించి తదుపరి చర్యకు సన్నద్ధంకండి.

అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

మీ ఫిర్యాదుకు సంబంధించి సదరు టెల్కో స్పందించనట్లయితే అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది.

సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి. లేదా మీసిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి.

కొంత సమయాన్ని అడుగుతారు

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

మీ ఫిర్యాదు స్వీకరించిన అప్పీలేట్ అధికారి సమస్య పరిష్కారానికి కొంత సమయాన్ని అడుగుతారు. వారు పేర్కొన్న వివరాలను భద్రంగా ఉంచాలి.

టెలికాం శాఖకు

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

అక్కడ కూడా మీ సమస్య ఓ కొలిక్కిరానట్లయితే అప్పీలేట్ అధికారి ఇచ్చిన వివరాలను రుజువులుగా పేర్కొంటు టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

మీ సమస్యను పరిష్కరించటంలో అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే నేరుగా సంబంధిత రుజువులతో ‘భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖ'(డాట్ )కు ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు అందాల్సిన చిరునామా

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

ఫిర్యాదు అందాల్సిన చిరునామా: పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్, రూమ్ నెం.518, సంచార్ భవన్, 20, ఆశోకా రోడ్, న్యూఢిల్లీ 110001

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nation wide Mobile Number Portability From Today. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting