రైల్వే శాఖ బంఫర్ ఆఫర్ : రైల్వే టికెట్‌తో విమానంలో ప్రయాణం

Written By:

మీరు రైల్లో టికెట్ బుక్ చేసుకున్నారా...అయితే అది వెయిటింగ్ లిస్ట్ జాబితాలో ఉందా..ఇక మీరు ఎటువంటి టెన్సన్ పడనవసరం లేదు. మీరు విమానంలో ప్రయాణం చేయవచ్చు. రైల్వేశాఖ ఈ కొత్త సదుపాయాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మీ టికెట్ తోనే మీరు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించండి అంటూ మీ మొబైల్ కు రైల్వే శాఖ నుంచి ఏ క్షణమైనా మెసేజ్ రావచ్చు. దీంతో మీరు ఆ రైలు కన్నా ఎన్నో గంటల ముందుగా గమ్యస్థానానికి చేరవచ్చు. ఈ మేరకు ఐఆర్సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య అవగాహన కుదరగా, రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more : రైల్వే టికెట్ క్యాన్సిల్ ఇప్పుడు మీ చేతుల్లో..

రైల్వే శాఖ బంఫర్ ఆఫర్ : రైల్వే టికెట్‌తో విమానంలో ప్రయాణం

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్ ఉన్న వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే, విమాన టికెట్ లభిస్తుంది. ఇక తరువాతి తరగతుల్లో టికెట్లున్నవారు రూ. 2 వేలు చెల్లించాల్సి వుంటుంది. రైలు వెళ్లే రూట్లో ఉన్న విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా నడుపుతున్న సర్వీసులు, వాటిల్లో ఖాళీలను బట్టి ఎంతమంది వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు చోటు లభిస్తుందన్నది ఎప్పటికప్పుడు మారుతుంటుంది.

Read more: మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి..మరి కొత్త నింబధనలేంటో ఓ లుక్కేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని విస్తరించింది.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్ / ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం చెల్లుబాటుకాదు.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

అయితే వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక మీరు ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. అంతే కాకుండా చార్జీలో తేడాలున్నా మీకు ఎటువంటి రీఫండ్ ఇవ్వరు.దీనికి ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

తత్కాల్ లో అయితే మీరు మీ ప్రయాణానికి సంబంధించి టికెట్లను రద్దు చేసుకుంటే టికెట్ లో సగం మొత్తం వెనక్కిస్తారు . ప్రస్తుతం ఇందులో అటువంటి రీఫండ్ సౌకర్యం లేదు.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు కూడా చేశారు. ఏసీ బుకింగ్ లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ లకు ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంచారు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు.

రైల్వే నిబంధనలు మారాయి: కొత్త నిబంధనలు అదిరాయి

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Here Write Got an unconfirmed train ticket Via online IRCTC website? No worries, fly Air India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot