వాట్సాప్, స్కైప్‌లో డేంజరస్ స్కామ్.. 87,000 ఖాతాలు బ్లాక్.. మీరు సేఫ్‌గా ఉండాలంటే ఈ పని చేయండి..!!
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పోలీసుల్లా, అధికారుల్లా నమ్మించి జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసాల్ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏకంగా 87 వేలకు పైగా అకౌంట్లని బ్లాక్ చేసింది. ఈ అకౌంట్లన్నీ స్కామ్‌లతో సంబంధం కలిగి ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ డేంజరస్ స్కామ్‌ని కనిపెట్టింది.
అంతేకాదు, 3,962 స్కైప్ అకౌంట్లని, 83,668 వాట్సాప్ అకౌంట్లని బ్లాక్ చేసింది. స్కామర్లు వీటి ద్వారానే యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. యూనియన్ మినిస్టర్ సంజయ్ బండి కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాలన్నీ చెప్పారు. స్కామర్లు పోలీసులో, సీబీఐలో, ఆర్బీఐలో, లేదంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు.

మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ తర్వాత ఏమవుతుందో తెలుసా.. ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..
ఆ తర్వాత బాధితుల్ని బెదిరించడం మొదలుపెడతారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో ఇరికించామని భయపెడతారు. వారు చెప్పేది నిజమేనేమో అని అమాయక జనం హడలిపోతారు. ఇదే అదునుగా వాళ్లను డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక రూమ్‌లో బందీలా కూర్చోబెట్టి డబ్బు గుంజేస్తారు. ఇలాంటి కేసుల్లో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు.
* డిజిటల్ అరెస్ట్ స్కామ్స్: రోజురోజుకూ పెరిగిపోతున్న నష్టాలు
ఈ స్కామ్‌ల వల్ల జనం పోగొట్టుకుంటున్న డబ్బు చూస్తే షాకవుతారు. 2022లో 39,925 కేసులు నమోదయ్యాయి. బాధితులు అక్షరాలా రూ.91.14 కోట్లు నష్టపోయారు. 2023లో కేసులు 60,676కి పెరిగాయి. నష్టం కూడా భారీగా పెరిగి రూ.339.03 కోట్లకు చేరింది. 2024లో 1,23,672 కేసులు నమోదైతే, జనం ఏకంగా రూ.1,935.51 కోట్లు పోగొట్టుకున్నారు.
2025 ఫిబ్రవరి నెల ఒక్కటే చూస్తే 17,718 కేసులు, నష్టం రూ.210.21 కోట్లు. ఈ స్కామర్లు జనాన్ని సైకలాజికల్‌గా టార్చర్ పెడతారు. ఫేక్ గవర్నమెంట్ డాక్యుమెంట్లు చూపిస్తారు, నంబర్లు మార్చి ఫోన్లు చేస్తారు, అర్జెంటుగా డబ్బు కట్టాలని బెదిరిస్తారు. ఇలా భయపెట్టి మరీ జేబులు గుల్ల చేస్తున్నారు.
* సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం చర్యలు..
ఈ స్కామ్‌లని అరికట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు మొదలుపెట్టింది. కాలర్ ట్యూన్స్‌లో వార్నింగ్‌లు పెట్టింది. న్యూస్‌పేపర్లలో యాడ్స్, మెట్రో అనౌన్స్‌మెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు.. ఇలా అన్ని విధాలా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 గురించి ప్రచారం చేస్తున్నారు.
హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా 7.81 లక్షల సిమ్ కార్డుల్ని, 2,08,469 IMEI నంబర్లని బ్లాక్ చేసేశారు. I4C వాళ్లు సైబర్ బెదిరింపుల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ యాక్షన్ తీసుకుంటున్నారు. స్కామర్ల వలలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* జాగ్రత్తలు
ఎవరైనా ఫోన్ చేసి తాము గవర్నమెంట్ ఆఫీసర్లమని చెప్తే వెంటనే నమ్మేయకండి. వాళ్ల మాటలు నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్లమని చెప్పేవాళ్లు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓటీపీలు అడగరు. స్కామర్లు భయపెట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు.
మీరు మాత్రం టెన్షన్ పడకుండా కామ్‌గా ఉండాలి. తొందరపడి ఏమీ చేయొద్దు. ఫోన్‌లో చెప్పిన వెంటనే ఎవరికీ డబ్బులు పంపించవద్దు. మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకూడదు. ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫోన్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయాలి.


Click it and Unblock the Notifications








