EMI పద్దతిలో నెలకు రూ.141 చెల్లించి Jio Phone 2 ను కొనుగోలు చేసే గొప్ప అవకాశం...
ఇండియా యొక్క అతి పెద్ద సంస్థలలో ఒకటైన రిలయన్స్ ఎప్పుడు ఎదో ఒక అద్భుతానికి తెరలేపుతున్నది. టెలికాం రంగంలోకి జియో పేరుతో ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నది. తరువాత అతి తక్కువ ధరలోనే జియో యొక్క ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు దీనికి అప్ డేట్ వెర్షన్ గా జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు శ్రీ క్రిష్ణ జనమాష్టమి ఆఫర్‌లో భాగంగా జియోఫోన్ 2 ఫీచర్ ఫోన్‌ను నెలకు కేవలం రూ.141 EMI పద్దతిలో చెల్లించి కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది.

రిలయన్స్ జియో జనమాష్టమి ఆఫర్
రిలయన్స్ సంస్థ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ రిలయన్స్ జియో యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే జాబితా చేయబడింది. జియో ఫీచర్ ఫోన్ 2 యొక్క ధర 2,999 రూపాయలు. అయితే ఇప్పుడు దీనిని రూ.141.17 నుండి ప్రారంభమయ్యే EMI పద్ధతి ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ క్రెడిట్ కార్డుల మీద మాత్రమే వర్తిస్తుంది. రూ.99 ధర వద్ద కొనుగోలుదారులు ఆర్డర్ చేసిన 3-5 రోజులలోపు ఫోన్ ను తమ చేతులలో పొందవచ్చు. జియో సిమ్‌ను సమీపంలోని జియో స్టోర్ / జియో రిటైలర్ నుండి యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని జియో సంస్థ తెలిపింది.

జియోఫోన్ 2 స్పెసిఫికేషన్స్
జియో ఫోన్ 2 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ నానో సిమ్ కార్డ్ 4G వోల్టిఇ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ఇది 2.4-అంగుళాల QWGA డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫీచర్ ఫోన్ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ మరియు గూగుల్ మ్యాప్ వంటి యాప్ లకు మద్దతునిచ్చే కైయోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. జియోఫోన్ 2 యొక్క ముఖ్యమైన ఫీచర్ లలో మరొకటి దాని QWERTY కీప్యాడ్.

జియోఫోన్ 2 ర్యామ్, స్టోరేజ్ సపోర్ట్
ఇది 2000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది 24 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది వాయిస్ కమాండ్స్ సపోర్ట్ మరియు అంకితమైన వాయిస్ అసిస్టెంట్ బటన్ తో కూడా వస్తుంది. జియో ఫోన్2 యొక్క ర్యామ్ మరియు స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో వస్తుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 128GB వరకు పొడిగించడానికి అనుమతిని ఇస్తుంది.

జియోఫోన్ 2 ఫీచర్స్
జియోఫోన్ 2 యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ విధుల కోసం ఫోన్ వెనుక భాగంలో 2MP కెమెరా మరియు VGA ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం రిలయన్స్ జియో ఫోన్ 2 లో ఎఫ్ఎమ్, బ్లూటూత్, వై-ఫై, NPS మరియు GPS సపోర్ట్ ఉంది.


Click it and Unblock the Notifications








