సవాల్ : ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే 6 కోట్లు మీ సొంతం

Posted By:

కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ జీరోడియమ్ (Zerodium) హ్యాకర్లకు సరికొత్త సవాల్ విసిరింది. యాపిల్ ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టంను హ్యాక్ చేసి చూపించిన వారికి 1 బిలియన్ డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.66010450)ను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. జీరోడియమ్ సైబర్ సెక్యూరిటీ సంస్థను ఫ్రెంచ్ ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ Chaouki Bekrar ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభించారు.

Read More : చావు డప్పు.. అలా మోగింది!

ఐఫోన్ అలానే ఐప్యాడ్‌‌లలో ఎక్విప్ చేయబడిన iOS 9 సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసిన ముగ్గురు సభ్యులు లేదా మూడు బృందాలకు బిలియన్ డాలర్లు చొప్పున బహుకరించటం జరుగుతుందని సెక్యూరిటీ సంస్థ హెడ్ తెలిపారు. ఈ సవాల్ ‌ స్వీకరించిన వారు వెబ్ పేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఐఓఎస్ 9 సెక్యూరిటీని దారి మళ్లించాల్సి ఉంటుంది. యాపిల్ సంస్థ iOS 9 సాఫ్ట్‌వేర్‌ను ఇటీవలే  అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Read More : ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

అమెరికా అధ్యక్షుడు వినియోగించే సెల్‌ఫోన్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. బరాక్ ఒబామా మనందరికీ తెలిసన బ్లాక్‌బెర్రీ ఫోన్‌నే ఉపయోగిస్తారు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

అయితే, ఆయన ఉపయోగించే బ్లాక్‌బెర్రీ మోడల్ ఫోన్ మరెవ్వరి దగ్గరా కనిపించదు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

బ్లాక్‌బెర్రీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా ఓ ఫోన్‌ను తయారు చేసింది. ఒబామా ఉపయోగించే ఫోన్ ప్రపంచంలోనే సురక్షితమైన ఫోన్ అని చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఒబామా ఫోన్‌లోని పలు ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ప్రొఫెషనల్ హ్యాకర్స్ మొదలుకుని రాటు తేలిన స్పై ఎజెన్సీల వరకు హ్యాక్ చేయలేని విధంగా ఒబామా ఉపయోగించే ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ డిజైన్ చేసింది.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

10 సంవత్సరాల కాలంగా ఒబామా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

2008లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (ఎన్ఎస్ఏ) తమ అధ్యుక్షుడు వినియోగిస్తోన్న ఫోన్‌లో సెక్యూర్ వాయిస్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచింది. ఈ ఫీచర్లు ఎన్ఎస్ఏ వృద్థి చేసినవే.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఒబామా వినియోగిస్తోన్న ప్రత్యేకమైన బ్లాక్‌బెర్రీ ఫోన్‌లో వాట్స్‌యాప్, సెల్ఫీ కెమెరా, గేమ్స్, టెక్స్టింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉండవు.సెక్యూరిటీ కారణాల రిత్యా వీటిని ఫోన్ నుంచి తొలగించారు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఒబామా వినియోగించే ఫోన్‌లో కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసే వీలు ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఆ పది మంది కూడా ఇదే తరహా ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్న ఫోన్‌‌లను మాత్రమే వినియోగిస్తారు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఒబామా తరచూ మాట్లాడే వారిలో వైస్ ప్రెసిడెంట్, స్టాఫ్ చీఫ్ ఆఫీసర్, పలువురు టాప్ అడ్వైజర్లు, ప్రెస్ సెక్రటరీ, తన భార్య అలానే ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఒబామా వినియోగించే శక్తివంతమైన బ్లాక్‌బెర్రీ ఫొన్ సాధారణ టవర్ల సహాయంతో పనిచేయదు.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఈ ఫోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెక్యూర్ బేస్ స్టేషన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఈ టవర్ డివైజ్ ఐఎమ్ఈఐ నంబర్‌ను కనిపించకుండా చేస్తుంది. అంతేకాకుండా ట్రాక్ చేయడాన్ని నిరోధిస్తుంది.

అమెరికా అధ్యక్షుడి ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఈ సెక్యూర్ బేస్ స్టేషన్‌ను ఒబామా ఎక్కడికి వెళితే అక్కడికి వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది తరలిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hack Apple's iOS 9, earn $1 million. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot