హ్యాకింగ్ భూతం.. రోజుకు 7,000 దాడులు!

Posted By:

ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తూ వారివారి ఆకౌంట్‌లకు హ్యాకర్లు హానికరమైన లింకులను పంపుతున్నట్లు ప్రముఖ సెక్యూరిటీ నెట్‌వర్క్ సంస్థ కాస్పర్‌స్కై సెక్యూరిటీ నెట్‌వర్క్ (కెఎస్ఎన్) వెల్లడించింది. 2012లో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ గేమర్ల పై రోజుకు 7,000 దాడులు జరిగాయని కెఎస్ఎన్ వివరించింది. హ్యాకర్లు గేమింగ్ యూజర్‌ల ఆన్‌లైన్ అకౌంట్‌లలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయటమే కాకుండా వర్చ్యువల్ (కాల్పనిక) ఆట వస్తువులను ఎరచూపి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేసేవారిని కెఎస్ఎన్ తెలిపింది. అంతేకాకుండా హానికరమైన లింకులతో కూడిన ఈమెయిళ్లను సగటును రోజుకు పది చొప్పున గేమర్ అకౌంట్‌లకు హ్యాకర్లు పంపిన్నట్లు పేర్కొంది. గేమర్ల ఆన్‌లైన్ అకౌంట్‌లను దొంగిలించే క్రమంలో హ్యాకర్లు ప్రముఖ గేమింగ్ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించిన్నట్లు వివరించింది. ఈ దాడుల భారిన పడిన దేశాల్లో భారత్, రష్యా.. చైనా తరువాతి స్థానంలో నిలిచిందిని కాస్పర్‌స్కై తెలిపింది.

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

హ్యాకింగ్ భూతం.. రోజుకు 7,000 దాడులు!

కరుడుగట్టిన హ్యాకర్లు వీరే...

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్ల పేర్లను తెలుసుకుందాం.

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo' మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు. మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James' 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris'. ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen' పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting