విండోస్ 10ను ఉచితంగా పొందాలంటే..?

Posted By:

తమ ఓఎస్‌ను పరీక్షించిన ప్రతిఒక్కరికి విండోస్ 10 ఫైనల్ వర్షన్‌ను ఉచితంగా అందిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ 10 లేటెస్ట్ ప్రివ్యూ (బిల్డ్ 10130)ను తమ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని విండోస్ ఇన్‌సైడర్ ప్రోగ్రామ్‌తో రిజిస్టర్ అయిన మైక్రోసాఫ్ట్ అకౌంట్‌ను వినియోగించుకుంటున్నట్లయితే, వారికి విండోస్ 10 ఫైనల్ వర్షన్ ఉచితంగా లభిస్తుంది.

Read More: వాట్సాప్‌లో మార్పులు!

అంతేకాదు.. విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలకు సంబంధించి జెన్యున్ వర్షన్‌లను వాడుతున్న వారికి విండోస్ 10 పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఆయా ఒరిజినల్ వర్షన్‌లను వినియోగిస్తున్న వారు విండోస్ 10 విడుదలైన ఏడాది‌లోగా అప్‌గ్రేడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఒకసారి ఉచితంగా లభించిన విండోస్ 10ను దాని జీవితం కాలం ముగిసేంత వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఓఎస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ఉచిత అప్‌డేట్స్ లభిస్తుంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టార్ట్ మెనూ

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10లో పొందుపరిచిన స్టార్ట్ మెనూ కొత్త లుక్‌లో మరింత యూజర్ ఫ్రెండ్లీగా దర్శనమిస్తుంది. ఈ సరికొత్త స్టార్ట్ మెనూ సాంప్రదాయ అలానే మోడ్రన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది

మల్టిపుల్ డెస్క్‌‌టాప్స్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

విండోస్ 10 యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై మల్టిపుల్ డెస్క్‌‌టాప్‌లను ఓపెన్ చేసుకుని వాటిలో కావల్సిన విండోలను ఓపెన్ చేసుకుంటూ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

టాస్క్ స్విచర్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

సాధారణంగా విండోస్ యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు Alt+Tab షార్ట్‌కట్‌ను వినియోగిస్తుంటారు. అయితే, విండోస్ 10 యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బటన్‌ను విండోస్ 10 టాస్క్‌బార్‌లో పొందుపరిచింది. ఈ టాస్క్ స్విచర్ మల్టీ టాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

యూనివర్సల్ సెర్చ్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10లోని స్టార్ట్ మెనూతో సమీకృతం చేయబడిన సరికొత్త యూనివర్సల్ సెర్చ్ ఫీచర్ ద్వారా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లతో పాటు వెబ్‌లోని అంశాలను శోధించవచ్చు. మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజన్ ‘బింగ్' వెబ్‌సెర్చ్‌కు తోడ్పడుతుంది.

స్నాప్ వ్యూ ఫీచర్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10లో ఏర్పాటు చేసిన స్నాప్ వ్యూ ఫీచర్ ద్వారా ఏకకాలంలో నాలుగు అప్లికేషన్‌లను స్ర్కీన్ పై ఓపెన్ చేసుకుని లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

మోడ్రన్ యాప్స్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మోడ్రన్ అప్లికేషన్‌లతో పాటు సాంప్రదాయ (ట్రెడిషనల్) అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

యూనివర్సల్ అప్లికేషన్ స్టోర్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 ఈ యాప్ స్టోర్ విండోస్ 10 ఆధారిత డెస్క్‌టాప్, టాబ్లెట్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 యూజర్లు తమకు కావల్సిన యాప్‌లను ఈ స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

కాంటినుమ్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన కాంటినుమ్ ఫీచర్ 2 ఇన్ 1 విండోస్ డివైస్‌లకు మరింత ఉపయుక్తంగా నిలస్తుంది. మీరు ఉపయోగించే మోడ్‌ను బట్టి ఉపయోగానికి అనువుగా స్ర్కీన్ రూపం మారుతుంటుంది.

సరికొత్త కమాండ్ ప్రాంప్ట్

విండోస్ 10లోని ప్రత్యేకతలు

విండోస్ 10లో ఏర్పాటు చేసిన కమాండ్ ప్రాంప్ట్ సరికొత్త ఫీచర్లతో అలరిస్తుంది

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

కోర్టానా

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 యాపిల్ సిరి, గూగుల్ నౌలకు పోటీగా మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ద్వారా కోర్టానా పేరుతో సిరికొత్త వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను పరిచయం చేస్తోంది.

ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌

విండోస్ 10లోని ప్రత్యేకతలు

 విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే మరింత వేగవంతంగా స్పందించే ఈ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ నేషనల్ టూల్, డిస్ట్ర్రాక్షన్ ఫ్రీ రీడింగ్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ యాప్ ఫర్ విండోస్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని డివైజ్‌లలో ఈ ఎడ్జ్ బ్రౌజర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ 10ను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల్లో విడుదల చేయునున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సోమవారం వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ తన మునుపటి ఓఎస్ విండోస్ 8ను మార్కెట్లో విడుదల చేసి దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం రిటైల్ ధరకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఏ విధమైన వివరాలను వెల్లడించలేదు.

Read More: మీ అవసరాలను తీర్చే ముఖ్యమైన ఆండ్రాయిడ్ యాప్స్

English summary
Here's how you can get Microsoft Windows 10 for free. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot