ప్రపంచాన్ని బూడిద చేసే ఆయుధాలు వారి సొంతం

Posted By:

కర్కశం..అరాచకం..తమను కాదన్న వారిని అమానుషంగా మట్టుపెట్టడం..ఇవన్నీ ఆ మతోన్మాద సంస్థ వికృతచేష్టలు. చివరకు ఆల్ ఖైదా కూడా దాన్ని దూరం పెట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా... క్లుప్తంగా ఐఎస్ఐఎస్. ఇప్పుడీ నెట్ వర్క్ శరవేగంగా భారత్ లో విస్తరిస్తోంది. 

Read more: ముష్కరమూకల పనిపట్టే ‘ఆధునిక టెక్నాలజీ'

ఇంటర్నెట్ లో సంస్థ ప్రచారం శరవేగంగా దూసుకుపోతోంది. సంస్థ తన కార్యకలాపాలతో పాటు తన లక్ష్యాలను కూడా హిందీలో తర్జుమా చేసి మరీ నెట్ లో పెట్టింది. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లో రసాయన ఆయుధాలు ఉన్నాయని, వీటితో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదముందని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖా మంత్రి జూలీ బిషప్ ఈ మధ్యనే హెచ్చరించారు. వీరు క్లోరిన్‌ను ఆయుధంగా వాడుతున్నారని, రసాయన ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున సాంకేతిక నిపుణులను చేర్చుకుంటున్నారన్నారు. అయితే వారి వద్ద ఉన్న ఆయుధాలేంటి అనేదానిపై కొన్ని అమెరికా పత్రికలు తమ కథనాలను ప్రచురించాయి. సో వారి వద్ద ఉన్న ఆయుధాలేంటో ఏంటో చూద్దాం.

Read more:రణ రంగం.. పాక్ వెనుక చైనా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోవియట్ ఏరా టీ-72 ట్యాంక్స్

ఇరాకీ అర్మీపై ఈ మధ్య ఐఎస్ఐఎస్ ఈ ట్యాంకులతోనే యుద్ధం చేసింది. ఆధునాతన సోవియట్ టీ -72 ట్యాంకులు దాదాపు 10 వరకు ఉన్నాయని సమాచారం

టైప్ 59 ఆర్టిల్లరీ

ఇది సోవియట్ యూనియన్ యుద్ధంలో 1950లో వాడారు.ఆగష్టు నుంచి ఇది ఐఎస్ఐఎస్ చేతుల్లోకి వచ్చి చేరింది. ఇరాకీ ఆర్మీ యుద్ధంలో దీన్ని వాడుతున్నారు.

ఫిమ్ 92 స్ట్రింగర్ మ్యాన్ పాడ్స్

అమెరికా ఉపయోగించే అత్యాధునియ ఆయుధాలు ఇవి. వీటిని ఐఎస్ఐఎస్ ఇరాక్ యుద్ధంలో వీటిని ఉపయోగిస్తున్నారని ఫోక్స్ న్యూస్ తెలిపింది ఒక సైనికుడు దీన్ని ఆపరేట్ చేయగలడు.

జూ-23-2సెర్గీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్యానన్

సోవియట్ యాంటీ ఎయిర్ క్రాప్ట్ ఇప్పుడు ఐఎస్ఐఎస్ చేతుల్లోకి చేరింది. దీంతో ఎంతటి శక్తివంతమైన దానినైనా క్షణాల్లో భస్మీపటలం చేయవచ్చు.

ఇరాకీ కెమికల్ ఆయుధాలు

ఇరాక్ లో పాత కెమికల్ ఆయుధాలన్నీ ఐఎస్ఐఎస్ చేతుల్లోకి చేరాయి. ఇవన్నీ బాగ్దాద్ సమీపంలో ఉన్నాయని సమాచారం.

చైనీస్ హెచ్‌జె-8

1980లో చైనా తన యుధ్దంలో వాడిన ఆయుధం ఇది. ఇది పాతదైనా కాని 90 శాతం మేర పెను విస్ఫోటనం సృష్టిస్తుంది.

9కె 32 స్టెరిలా -2/ఎస్ ఎ-7 గ్రెయిల్

ఇదొక అత్యాధునిక ఆయుధం. దగ్గర ఉన్నవాటిని ఒక్క బుల్లెట్ తో భస్మీపటలం చేస్తుంది. కొండ పై నుంచి వీటిని ప్రయోగిస్తే కింత అంతా బూడిదగా మారుతుంది. వీటిని కూడా తీవ్రవాదులు వాడుతున్నారని వాషింగ్టన్ తన కథనంలో పేర్కొంది.

అమెరికన్ ఇరాకీ హమ్ వీస్

వీటితో ఇరాక్ లో సైన్యాన్ని మట్టికరిపించింది ఐఎస్‌ఐఎస్.ఇప్పుడు ఇవి చాలానే ఉన్నాయని సమాచారం

ఎమ్ 98 హోవిట్జర్

అమెరికాకు చెందిన 55 ఎమ్ 98 హోవిట్జర్ లు ఇరాకీ ఆర్మీ యుద్ధంలో ఈ తీవ్రవాదులు వాడారని బిజినెస్ ఇన్ సైడర్ కథనం తన కధనంలో పేర్కొంది. దీని దెబ్బకు 50 మీటర్ల దూరంలో ఏ ఒక్కటి మిగలదు

అసలు ఐఎస్ఐఎస్ అంటే ఏమిటి.?

ఉత్తర ఇరాక్ తో పాటు సిరియాలోనూ బలవంతంగానైనా అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాలని భావించిన అతివాదుల సమాహారమే ఐఎస్ఐఎస్. 11 ఏళ్ల క్రితం ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన అమెరికా, తాజాగా మళ్లీ తన సైన్యంతో విరుచుకుపడటానికి ఈ సంస్థే కారణంగా నిలుస్తోంది.

భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లిన ముస్లిం యువకులకు వల

ఇప్పటికే భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లిన ముస్లిం యువకులకు వల వేసిన ఈ సంస్థ, వారిని తమ దళంలో చేర్చుకుంది. తమిళనాడు నుంచి సింగపూర్ వెళ్లిన ఓ యువకుడు, తాను ఐఎస్ఐఎస్ లో చేరానని, అందుకు గర్వంగా ఉందని ఇటీవల తన తల్లిదండ్రులకు పంపిన సందేశం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఐఎస్‌ఐఎస్ భారత్‌పై వార్ ప్రకటించనున్నదా..?

ఇక ఇరాక్, సిరియా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ భారత్‌పై వార్ ప్రకటించనున్నదా..? భారత్‌ను లక్ష్యంగా చేసుకునే పాక్, ఆఫ్ఘన్‌లో ఆ సంస్థ పావులు కదుపుతున్నదా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

యూఎస్‌ఏ టుడే ఓ ప్రత్యేక కథనం

తాలిబన్ సంస్థతో కలిసి ఆఫ్ఘన్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐఎస్‌ఐఎస్.. వేర్వేరుగా పనిచేస్తున్న పాక్, ఆఫ్ఘన్ తాలిబన్ సంస్థలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని, తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టాలన్నదే ఆ సంస్థ పన్నాగమని అమెరికాకు చెందిన యూఎస్‌ఏ టుడే ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది.

32 పేజీల ఉర్దూ డాక్యుమెంట్

పాక్ తాలిబన్ సంస్థతో సంబంధాలున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సేకరించిన 32 పేజీల ఉర్దూ డాక్యుమెంట్ ఈ విషయాలు వెల్లడించిందని పేర్కొన్నది. భారత్‌లో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐఎస్ ప్రణాళికలు వేస్తుండటం.. అమెరికాపై ప్రత్యక్ష యుద్ధానికి కాలు దువ్వడంలో భాగంగానేనని ఆ పత్రిక హెచ్చరించింది.

ఉపఖండంలో సుస్థిరతకు ముప్పు

ఈ డాక్యుమెంట్‌ను హార్వర్డ్ పరిశోధకుడు తర్జుమా చేయగా.. నిపుణులు దానిని ధ్రువీకరించారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి, ప్రస్తుతం బ్రూకింగ్స్ సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ రీడెల్ ఈ కథనంపై మాట్లాడుతూ.. భారత్‌వంటి దేశంలో దాడులకు పాల్పడటం వల్ల ఐఎస్‌ఐఎస్ స్థాయి పెరుగుతుందని.. ఉపఖండంలో సుస్థిరతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇస్లామిక్ రాజ్య చరిత్ర, ప్రవక్త చెప్పిన రాజ్యం

ఈ అంశం దక్షిణాసియా జిహాదీలకు అందివచ్చిన అవకాశంగా మారుతుందన్నారు. ఇస్లామిక్ రాజ్య చరిత్ర, ప్రవక్త చెప్పిన రాజ్యం టైటిల్‌తో ఉన్న తేదీ లేని ఈ డాక్యుమెంట్‌లో పాక్, ఆఫ్ఘన్‌లోని డజన్లకొద్దీ ఉన్న ఉగ్రవాద ముఠాల వివరాలు, రెండు దేశాల్లోని తాలిబన్లను ఏకం చేసేందుకు నిర్దేశించిన ప్రణాళికలు ఉన్నట్లు పత్రిక వెల్లడించింది.

అల్‌కాయిదాను సైతం ఐఎస్‌ఐఎస్‌తో జత చేసే ప్రయత్నాలు

ప్రపంచం నివ్వెరపోయే స్థాయిలో ఉగ్ర ప్రణాళికలు ఉన్నాయని, అల్‌కాయిదాను సైతం ఐఎస్‌ఐఎస్‌తో జత చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని 100కోట్ల మంది ముస్లింలను ఏకంచేసి.. ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్నది ఐఎస్‌ఐఎస్ అంతిమలక్ష్యమని డాక్యుమెంట్ తెలుపుతున్నదని పేర్కొన్నది.

ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా

విజయ్‌దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోనూ ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలో ఐఎస్‌ఐఎస్ జాడలు లేకపోయినా, భవిష్యత్‌లో ఆ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఆఫ్ఘన్‌లో ఐఎస్‌ఐఎస్ కదలికలపై తమకు పూర్తి సమాచారం ఉందని, ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోని 100 దేశాల్లో ఐఎస్‌ఐఎస్ రిక్రూట్‌మెంట్లు

ఇక ఆఫ్ఘన్‌లో ఐఎస్‌ఐఎస్ కదలికలను సునిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది. ప్రపంచంలోని 100 దేశాల్లో ఐఎస్‌ఐఎస్ రిక్రూట్‌మెంట్లు జరుపుతున్నదని రష్యానిఘా విభాగం అధినేత అలెగ్జాండర్ బొర్త్నికోవ్ తెలిపారు.

యువతీయువకులే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్ రిక్రూట్‌మెంట్లు

ప్రపంచవ్యాప్తంగా స్లీపర్‌సెల్స్‌ను ఏర్పాటుచేయడం, ఆయా దేశాల్లో సుస్థిరతకు ముప్పు తేవాలని ఐఎస్‌ఐఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. యువతీయువకులే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్ రిక్రూట్‌మెంట్లు చేస్తున్నదన్నారు. యరోస్లావ్ పట్టణంలో 60 దేశాల నిఘా విభాగం అధికారుల రెండు రోజుల సదస్సులో బొర్త్నికోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తీవ్రవాద సంస్థలను ఆదిలోనే మట్టుబెట్టాల్సిన ఆవశ్యకత

భారత్ లో పాతుకుపోవాలని చూస్తున్న ఈ తీవ్రవాద సంస్థలను ఆదిలోనే మట్టుబెట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తేనే భవిష్యత్ భారతానికి మార్గం ఏర్పడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here Write high tech weapons That Will Shock You
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot