ఇకపై అన్ని నోకియా ఫోన్ల తయారీ భారత్‌లోనే..

Written By:

నోకియా బ్రాండ్‌ మార్కెటింగ్‌ అధికారాలను పదేళ్ల కాలానికి చేజిక్కించుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా-3310తో సహా ఇతర అన్ని నోకియా ఫోన్లను భారత్‌లోనే తయారు చేయనుంది. తమ అన్ని ప్రొడక్టులను ఇండియాలోనే తయారు చేయాలని భావిస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ మెహ్‌తా తెలిపారు.కాగా కంపెనీ 4జీ ఫీచర్‌ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017, అదరహో అనిపించిన బెస్ట్ ఫోన్స్ ఇవే!

ఇకపై అన్ని నోకియా ఫోన్ల తయారీ భారత్‌లోనే..

అందుబాటులోని అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, భారత్‌ తమకు ప్రధాన మార్కెట్‌ అని తెలిపారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్‌కు తయారీ భాగస్వామిగా ఉంది. కాగా కంపెనీ పలు ఆండ్రాయిడ్‌ ఫోన్లతోపాటు ఐకానిక్‌ నోకియా-3310 ఫోన్‌ను ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో మార్కెట్‌లోకి తీసుకురానున్నది. నోకియా నుంచి వచ్చిన నోకియా 6 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. 5 బెస్ట్ ఫీచర్లను పరిశీలిస్తే..

6జిబి ర్యామ్, హోమ్ బటన్ లేకుండా HTC Ocean Note

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు 2.5డీ గొరిల్లా గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లేలో అమర్చిన పోలరైజర్ లేయర్ సన్‌లైట్ కండీషన్‌లలోనూ యూజర్‌కు క్లియర్ కట్ అనుభూతులను చేరువచేయగలదని కంపెనీ చెబుతోంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్

ధరకు తగ్గట్టుగానే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ అలానే 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. ర్యామ్ ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో గేమర్స్ అలానే హెవీ యూజర్స్‌కు ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ కావొచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

కెమెరా విభాగం..

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను నోకియా నిక్షిప్తం చేసింది. మొత్తానికి ఈ రెండు కెమెరాలు లీఇకో, షియోమీ, వివో బ్రాండ్‌లతో పోటీ పడే విధంగా ఉన్నాయి.

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో

డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో కూడిన డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తోంది. తద్వారా ఈ ఫోన్ నుంచి హైక్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0

ఆపరేటింగ్ సిస్టం నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అంటే, హైక్వాలిటీ ఆండ్రాయిడ్ అనభూతులను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HMD Global to make Nokia 3310, other models in India Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot