మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017, అదరహో అనిపించిన బెస్ట్ ఫోన్స్ ఇవే!

Written By:

స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శన ఈ రోజుతో ముగిసింది. నాలుగురోజుల పాటు పలు రకాల టెక్ కంపెనీలు, మొబైల్ సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అయితే వాటిల్లో కొన్ని అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫోన్లు అయితే జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ ఫోన్లు లిస్ట్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

పానాసోనిక్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్లు, ధర ఎంతంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎల్‌జీ జీ6

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీని ధ‌ర‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధ‌ర రూ.16,117.

Best spec sheet, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ ప్రీమియం

5.5 ఇంచ్ 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్, డ్యుయ‌ల్ సిమ్‌, వాట‌ర్ రెసిస్టెన్స్‌, 19, 13 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3230 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0 వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని ధ‌రను వెల్ల‌డించ‌లేదు.

బెస్ట్ బడ్జెట్ ఫోన్ మోటో జీ 5 ప్లస్

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని ధ‌ర రూ.19,630.

బెస్ట్ అట్రాక్షన్ ఫోన్ నోకియా 3310

పాత నోకియా 3310 ఫోన్‌కు అనేక మార్పులు చేర్పులు చేసి నోకియా సంస్థ దీన్ని విడుద‌ల చేసింది. ఇందులో 2.4 ఇంచ్ పోల‌రైజ్డ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 మెగాపిక్స‌ల్ కెమెరా, 16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, 2జీ, సింగిల్‌/డ‌్యుయ‌ల్ సిమ్, నోకియా సిరీస్ 30+ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, బ్లూటూత్ 3.0, ఎఫ్ఎం రేడియో, 1200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 31 రోజుల స్టాండ్ బై టైం, 22 గంట‌ల టాక్‌టైం, 51 గంట‌ల మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధ‌ర రూ.3500.

బెస్ట్ కెమెరా ఫోన్ హువావే పీ10 ప్లస్

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 960 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు దీంట్లో ఉన్నాయి. ధ‌ర రూ.56వేలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Our favorite phones and tech from 2017’s Mobile World Congress read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot