ఊచకోత!!

స్మార్ట్‌ఫోన్ పటిష్టతను బట్టి రేటింగ్ ఇవ్వటం ఇటీవల కాలంలో షరా మామూలై పోయింది. ఈ రేటింగ్ ప్రక్రియలో భాగంగా సంబంధిత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ ప్రతికూల వాతవరణాల్లో పరీక్షించి తద్వారా దాని మనుగడను అంచనావేస్తున్నారు. యాపిల్ ఐఫోన్‌ల సామర్థ్యాన్ని పరీక్షించే క్రమంలో పలువురు యాపిల్ ఐఫోన్ లను ఘోరాతిఘోరంగా కాల్చారు. ఆ తరువాత ఏం జరిగిందో క్రింది వీడియోలో మీరే చూడండి.
Read More: మనిషిని చంపేసిన రోబోట్
యాపిల్ ఐఫోన్ 5సీ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచింది. డానియల్ కెన్నడీ అనే 25 సంవత్సరాల బ్రిటీష్ యువకుడు తన వైపుగా షూట్ చేయబడిన బులెట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలిగాడు. ఆ ప్రమాదం నుంచి తనను కాపాడిన తన ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌కు కెన్నడీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తప్పులేదు.

Read More: డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు
ఆలస్యంగా వెలగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నీటి వ్యవహారానికి సంబంధించి ఓ గొడవలో కెన్నడీకి మరో వ్యక్తికి మధ్య మాటా మాటా పెరిగి పెనుగులాటకు దారి తీసింది. దీంతో సహనం కోల్పొయిన అవతలి వ్యక్తి తన దగ్గర ఉన్న షాట్ - గన్‌తో కెన్నడీ చాతీ భాగాన్ని షూట్ చేసాడు. ఆ బుల్లెట్ నేరుగా వచ్చి కెన్నడీ షర్ట్ జేబులో ఉన్న ఐఫోన్ 5సీని తాకటంతో పెను ప్రమాదం తప్పింది.


Click it and Unblock the Notifications








