గూగుల్ లో ఈ 10విషయాలు సెర్చ్ చేయడం చాలా ప్రమాదం

|

ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగదారులు తమకు కావలసిన సమాచారాన్ని పొందడానికి గూగుల్ సెర్చ్ విండోను ఓపెన్ చేయడం ప్రతి ఒక్కరికి ఉన్న ఒక పెద్ద అలవాటు. ముఖ్యముగా వంటలు తయారుచేయడానికి కావలసిన రెసిపీ నుండి ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరియు క్యాష్ బదిలీ చేయడం మరియు మందులు కొనడం ఎలాగో ప్రతిదీ తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ ను మాత్రమే ఉపయోగిస్తారు.

 

గూగుల్

ముఖ్యముగా అందరు తెల్సుకోవలసింది ఏమిటంటే గూగుల్ స్వంతంగా ఎటువంటి కంటెంట్‌ను సృష్టించదు. ఇది మీకు అవసరమైన సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌లను కనుగొనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ మాత్రమే. కాబట్టి గూగుల్ లోని సెర్చ్ ద్వారా మీరు చూసే లేదా నేర్చుకునే ప్రతిదీ సరైనది మరియు ఖచ్చితమైనది కానవసరం లేదు. కావున మీరు గూగుల్ లో సెర్చ్ చేయకుండా ఉండవలసిన 10 సాధారణ విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ల కోసం సెర్చ్ చేయడం

ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ల కోసం సెర్చ్ చేయడం

బ్యాంకింగ్ వెబ్‌సైట్ల గురించి మీకు ఖచ్చితమైన అధికారిక URL తెలియకపోతే మీ బ్యాంక్ యొక్క ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను కనుగొనడానికి గూగుల్ సెర్చ్ చేయకపోవడం చాలా మంచిది. ఎల్లప్పుడూ మీ యొక్క అకౌంట్ సురక్షితంగా ఉండటానికి మరియు బ్యాంకు యొక్క వెబ్ సైట్‌ను యాక్సిస్ చేయడానికి మీ బ్యాంక్ యొక్క ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్ యొక్క అధికారిక URL ని నమోదు చేసుకోండి. దీనికి కారణం మీ వెబ్‌సైట్ యొక్క లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను వెబ్‌సైట్‌లో ఫిషింగ్ చేసే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. అది బ్యాంక్ యొక్క అధికారిక వెబ్‌సైట్ లాగా ఉండవచ్చు మరియు బదులుగా ఫిషింగ్ సైట్ కూడా కావచ్చు.

కస్టమర్ కేర్ నంబర్లను సెర్చ్ చేయడం
 

కస్టమర్ కేర్ నంబర్లను సెర్చ్ చేయడం

మోసగాళ్ళు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడమే కాకుండా తమ వెబ్‌సైట్లలో నకిలీ వ్యాపార జాబితాలను మరియు కస్టమర్ కేర్ నంబర్లను పోస్ట్ చేస్తున్నారు. అది గహించని చాలా వ్యక్తులు అసలు కస్టమర్ కేర్ నంబర్లు అని నమ్మి మోసపోతున్నారు. కావున ఆన్‌లైన్ లో కస్టమర్ కేర్ నంబర్ సెర్చ్ చేయడం అనేది గూగుల్‌లో సర్వసాధారణమైన మోసాలలో ఒకటి.

యాప్ లు మరియు సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి

యాప్ లు మరియు సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి

మొబైల్ యాప్ ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం Google Play మరియు ఐఫోన్స్ కోసం App Store వంటి అధికారిక యాప్ స్టోర్లలో మాత్రమే ఎల్లప్పుడూ యాప్ ల కోసం సెర్చ్ చేయండి. గూగుల్ లో యాప్ లను శోధించడం ద్వారా మాల్వేర్ కంటెంట్‌తో కూడిన నకిలీ యాప్ ఇన్‌స్టాలేషన్‌లకు దారితీయవచ్చు.

మెడిషన్స్ మరియు వైద్య లక్షణాల కోసం

మెడిషన్స్ మరియు వైద్య లక్షణాల కోసం

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక వ్యాధి యొక్క లక్షణాలు మరియు వాటి యొక్క మందుల గురించి తెలుసుకోవడానికి వైద్యుడిని కాకుండా గూగుల్ సెర్చ్ యొక్క సమాచారంపై ఆధారపడటం చాలా ప్రమాదం. గూగుల్‌లో మీరు కనుగొన్న సమాచారం ఆధారంగా మందులు కొనడం కూడా చాలా ప్రమాదకరం. ఇది ఒకో సారి ప్రాణాలకు కూడా ప్రమాదం.

స్టాక్ మార్కెట్‌ యొక్క సలహాలు మరియు గైడ్ కోసం

స్టాక్ మార్కెట్‌ యొక్క సలహాలు మరియు గైడ్ కోసం

ఆరోగ్యం వలె వ్యక్తిగత ఫైనాన్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరినీ ధనవంతులుగా చేసే పెట్టుబడి ప్రణాళిక ఎప్పుడూ ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టేటప్పుడు గూగుల్ సెర్చ్ యొక్క ఫలితాల నుండి సలహాలు తీసుకోవడం మానుకోండి.

ప్రభుత్వ వెబ్‌సైట్లు సులభమైన స్కామ్ లక్ష్యాలు

ప్రభుత్వ వెబ్‌సైట్లు సులభమైన స్కామ్ లక్ష్యాలు

బ్యాంకింగ్ వెబ్‌సైట్ల మాదిరిగానే మునిసిపాలిటీ టాక్స్, హాస్పిటల్స్ వంటి ప్రభుత్వ వెబ్‌సైట్‌లను స్కామర్ల ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నారు. ఏ వెబ్‌సైట్ అసలైనదో గుర్తించడం చాలా కష్టం కనుక గూగుల్‌లో శోధించే బదులు ఏదైనా నిర్దిష్ట ప్రభుత్వ వెబ్‌సైట్‌ను నేరుగా సందర్శించడం చాలా మంచిది.

సోషల్ మీడియా వెబ్‌సైట్‌లను లాగిన్ అవ్వడానికి

సోషల్ మీడియా వెబ్‌సైట్‌లను లాగిన్ అవ్వడానికి

మీ యొక్క సోషల్ మీడియా ఖాతాలను యాక్సెస్ చేయడం కోసం బ్రౌజర్ యొక్క బాక్స్ లో URL ను నేరుగా టైప్ చేయడం ఎల్లప్పుడూ చాలా మంచిది. గూగుల్ లో లాగిన్ పేజీ కోసం శోధించడం ద్వారా ఇది ఫిషింగ్‌కు దారితీయవచ్చు కాబట్టి గూగుల్ లో లాగిన్ పేజీ కోసం సెర్చ్ చేయడం మానుకోవాలి.

ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేదా ఆఫర్‌ల కోసం

ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేదా ఆఫర్‌ల కోసం

ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆఫర్లు అందిస్తున్నారు అని తెలిపే నకిలీ వెబ్ పేజీలు గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఇది వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలను దొంగిలించడానికి హానికరమైన వెబ్‌సైట్‌లపై క్లిక్ చేయడానికి ఆకర్షణీయమైన ఒప్పందాలతో ప్రజలను ఆకర్షించే మరో క్లాసిక్ స్కామ్.

యాంటీవైరస్

యాంటీవైరస్ యాప్ లేదా సాఫ్ట్‌వేర్ కోసం

గూగుల్‌లో యాంటీవైరస్ యాప్ లు లేదా సాఫ్ట్‌వేర్‌ల కోసం సెర్చ్ చేయడం మానుకోండి. ఎందుకంటే అక్కడ చాలా నకిలీ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఇవి అసలు వాటితో పోలి ఉండి గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది.

 

డిస్కౌంట్

డిస్కౌంట్ పొందడానికి కూపన్ కోడ్‌ల కోసం

మీరు ఏదైన షాపింగ్‌లో తగ్గింపు కోసం కూపన్ కోడ్‌ను పొందినట్లయితే అది చాలా మంచిది. అలా కాకుండా మీరు నకిలీ వెబ్‌సైట్ల ద్వారా తక్కువ ధరకు కూపన్ కోడ్‌ను పొందినట్లయితే అవి క్లయిమ్ చేసేటప్పుడు మీ బ్యాంకింగ్ వివరాలను దొంగిలించవచ్చు.

 

Best Mobiles in India

English summary
These 10 things to search on Google are very risky

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X