RS.6,999లకే మొదటిసారి ఫ్లిప్‌కార్ట్‌లో 4GB RAM ఇన్ఫినిక్స్ హాట్ 8

|

ఇన్ఫినిక్స్ యొక్క తాజా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 8 ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటిసారిగా అమ్మకానికి ఉంచింది. ఈ హ్యాండ్‌సెట్ గత వారం ఇండియాలో 7,999 రూపాయలకు లాంచ్ అయ్యింది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో దీనిని అక్టోబర్ 30 వరకు 6,999 రూపాయల ప్రత్యేక ధరకు అందిస్తోంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

7,999 రూపాయల ధర వద్ద లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 8 యొక్క అమ్మకాలు ఇండియాలో మొదటిసారి జరుగుతున్న సందర్బంగా ఇన్ఫినిక్స్ సంస్థ దీనిని కేవలం 6,999 రూపాయలకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తోంది.ఇది ఫ్లిప్‌కార్ట్‌లో క్వెట్జల్ సియాన్ మరియు కాస్మిక్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది.

ప్రత్యేక ఆఫర్స్

ప్రత్యేక ఆఫర్స్

ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 8 కేవలం ఒకే ఒక వేరియంట్‌తో 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే విడుదల అయింది. నేటి అమ్మకం కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుల వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా ఇన్ఫినిక్స్ హాట్ 8 వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ జాబితా చేసిన ఇఎంఐ ఎంపికలతో పాటు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 8 యొక్క స్మార్ట్‌ఫోన్ లో 6.52-అంగుళాల డిస్ప్లే 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో మరియు 20: 9 కారక నిష్పత్తి మరియు 2.5 D గ్లాస్ తో ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ HD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది డ్రాప్ నాచ్ డిస్ప్లే డిజైన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ డిరాక్ హెచ్డి సరౌండ్ సౌండ్కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా XOS 5తో రన్ అవుతుంది . ఇది మెడిటెక్ హెలియో P22 SoC చేత పనిచేస్తుంది.

కెమెరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 8 యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇది AI- ఆధారిత ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. వెనుక కెమెరా సెటప్‌లో తక్కువ లైట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ సెటప్‌లో క్వాడ్ లీడ్ ఫ్లాష్ మరొక అదనపు ఆకర్షణ. అలాగే ముందు వైపు కూడా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ బ్యాటరీ ఫోన్‌కు 25 రోజుల పాటు స్టాండ్‌బై సమయం ఇవ్వగలదని కంపెనీ తెలిపింది.

కనెక్టవిటీ

ఇన్ఫినిక్స్ దీనిని 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల చేసింది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు. ప్రైవసీ ప్రయోజనం కోసం హ్యాండ్‌సెట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది మరియు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఆప్షన్ కూడా అందిస్తుంది. మరియు ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఇందులో ప్రత్యకతలు.

Best Mobiles in India

English summary
Infinix Hot 8 First Sale Starts today at 12:00PM via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X