YouTube Premium ను 6 నెలల పాటు ఉచితంగా పొందడం ఎలాగో తెలుసా?
యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు లేదా సినిమాలు చూస్తున్నపుడు మధ్యలో వచ్చే ప్రకటనల కారణంగా చాలా మంది ఇబ్బందికి గురిఅవుతూ ఉంటారు. దీనికి పరిష్కారంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అందిస్తున్నది. ఈ సబ్స్క్రిప్షన్ సహాయంతో యూట్యూబ్‌లో మీరు ఎటువంటి కంటెంట్‌ను అయిన సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడవచ్చు.

ప్రీమియం సభ్యత్వం సహాయంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యూట్యూబ్‌ను బ్యాక్ గ్రౌండ్ లో అమలు చేయగల సామర్థ్యం మరియు ఓన్లీ-ఆడియో మోడ్‌ను అమలు చేయడం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే మీరు ఈ ఫీచర్ సహాయంతో ఇతర యాప్ లను వినియోగిస్తున్నపుడు ఏదైనా క్లిప్ యొక్క ఆడియోను ప్రసారం చేయవచ్చు. Motorola Moto G8 Power Lite: Rs.8,999 ధరకే మోటరోలా కొత్త ఫోన్!!! ఫీచర్స్ అదుర్స్...

ఫ్లిప్‌కార్ట్ ప్లస్- యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్
యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని మొదటి 30-రోజులు ట్రయల్ ఆఫర్ కింద ఉచితంగా తీసుకోవచ్చు. దాని తరువాత కొనుగోలు చేయవచ్చు. యూట్యూబ్ ప్రీమియం యొక్క అన్ని ప్రయోజనాలను ఉచితంగా పొందడానికి మరొక మార్గం కూడా ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యొక్క కస్టమర్ అయితే కనుక 6 నెలల ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. 150 సూపర్ నాణేల ద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా ఎలా పొందాలో తెలుసుకోవడానికి కింద ఉన్న దశలను పాటించండి. COVID19 సమయంలో మీకు సహాయపడే ప్రభుత్వ యాప్ లు ఇవే...

స్టెప్ 1
మీ యొక్క సిస్టంలో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ప్రత్యామ్నాయంగా మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలో లభించే ఫ్లిప్‌కార్ట్ యాప్ కి కూడా వెళ్ళవచ్చు. మీరు ఇప్పటికి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఐడిలోకి లాగిన్ అవ్వకుండా ఉంటే కనుక మొదట లాగిన్ అవ్వాలి. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను పొందడానికి మీకు సాధారణ ఫ్లిప్‌కార్ట్ ఐడి కాకుండా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఐడి ఉండాలి అని గుర్తుంచుకోండి.

స్టెప్ 2
వెబ్‌సైట్‌లోని లేదా అప్లికేషన్‌లోని ‘ఫ్లిప్‌కార్ట్ జోన్‌కు' వెళ్లండి. మీరు ఇక్కడకు వచ్చిన తర్వాత, ‘క్లెయిమ్ ఎక్స్‌క్లూజివ్ రివార్డ్' విభాగం కోసం చూడండి. BSNL Combo 18 Plan: అధిక డేటా వినియోగదారులకు సరైన ప్లాన్...

స్టెప్ 3
ఎక్స్‌క్లూజివ్ రివార్డ్ విభాగం కింద యూట్యూబ్ ప్రీమియం రివార్డ్‌ను ఎంచుకోండి. ఇందుకోసం మీకు 150 సూపర్ నాణేలు ఖర్చు అవుతాయి. మీరు ఆఫర్‌ను ఎంచుకున్న తర్వాత మీరు వెంటనే దాని కోసం ఒక వోచర్ ను అందుకుంటారు. ఈ వోచర్ ఇప్పుడు 6 నెలల ఉచిత ప్రీమియం సభ్యత్వాన్ని రీడీమ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే మీరు ఇంతకు ముందు యూట్యూబ్ ప్రీమియం లేదా దాని ట్రయల్ ఉపయోగించని క్రొత్త కస్టమర్ అయితే మాత్రమే ఇది పని చేస్తుంది.

స్టెప్ 4
వోచర్ కోడ్‌ను పొందిన తరువాత YouTube ప్రీమియం సబ్స్క్రిప్షన్ పేజీకి వెళ్ళండి. ఇక్కడ మీరు వోచర్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని యూట్యూబ్ ప్రీమియం రివార్డ్ నుండి మీరు అందుకున్న వోచర్ కోడ్‌ను నమోదు చేయండి. తరువాత ‘దీన్ని ప్రయత్నించండి' అనే బటన్ మీద క్లిక్ చేయండి.

ఇది మొత్తం పూర్తి అయిన తరువాత చెల్లింపు రూపంగా మీరు రూ.150 చెల్లించవలసి ఉంటుంది అని గమనించండి. ఇది పూర్తయిన తర్వాత మీ 6 నెలల ఉచిత YoutUbe ప్రీమియం సభ్యత్వం యాక్టివేట్ అవుతుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆఫర్ పొందటానికి వినియోగదారులు వారి క్రెడిట్ / డెబిట్ కార్డు వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ఏదైనా పరిమితం చేయబడిన కార్డులు ప్రాసెస్‌కు చెల్లవు. ఇంకా ఈ ప్రక్రియ మాస్టర్ కార్డ్ మరియు వీసా కార్డులతో మాత్రమే పని చేస్తుంది. ట్రయల్ వ్యవధి ముగియడానికి ముందే వినియోగదారులు ఎప్పుడైనా సభ్యత్వాన్ని ముగించవచ్చు. అయితే మీరు 6 నెలల ఆఫర్ వ్యవధి ముగిసిన తరువాత యూట్యూబ్ ప్రీమియం పోస్ట్‌ను ఉపయోగించడం కొనసాగిస్తే మీకు చందా కోసం అదనపు మొత్తం చెల్లించవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








