Vodafone,Jio,Airtel ఫోన్ నెంబర్ లను ATM ద్వారా రీఛార్జ్ చేయడం ఎలా?
ఇండియాలో ప్రస్తుతం చాలా రకాల టెలికాం ఆపరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఇండియాలో చాలా మంది ఫోన్ లను ఉపయోగిస్తున్నందున ప్రతి ఒక్కరు ఏదో ఒక సిమ్ ను వాడుతున్నారు. మిలియన్ల మంది చందాదారులకు తమ యొక్క రీఛార్జ్ సౌకర్యాన్ని అందించడానికి టెలికాం ఆపరేటర్లు రిటైల్ దుకాణాలతోనే కాకుండా వేరే ఛానెళ్లతో కూడా జతకట్టారు.

లాక్డౌన్ కాలం ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు COVID-19 ను ఎదుర్కోవటానికి ఇళ్ళ వద్ద ఉండవలసి వస్తుంది. అలాగే భద్రతా చర్యల ప్రకారం అవసరమైన వస్తువులు మినహా అన్ని దుకాణాలు మూసివేయబడ్డాయి. ఒత్తిడితో కూడిన ఇటువంటి సమయాల్లో ప్రజలు తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ,అందుకోసం వోడాఫోన్ ఐడియా సంస్థ యొక్క చందాదారులు వివిధ ఎటిఎంల ద్వారా తమ రీఛార్జిని పొందవచ్చు అని సంస్థ ప్రకటించింది. అదేవిధంగా భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి టెల్కోలు కూడా తమ చందాదారులకు వారి రీఛార్జ్ చేసుకోవడానికి వివిధ రకాల ఎటిఎంల నుండి పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌ల చెల్లుబాటు
లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి వోడాఫోన్ ఐడియా 2020 ఏప్రిల్ 17 వరకు దాదాపు 100 మిలియన్ ప్రీపెయిడ్ చందాదారుల యాక్సిస్ ను పెంచింది. ఇది మాత్రమే కాదు టెల్కో దిగ్గజం తమ చందాదారులు అకౌంటులో రూ.10 టాక్ టైమ్ క్రెడిట్‌ను జమ చేసింది. ముందస్తు ప్రీపెయిడ్ వాలిడిటీ ప్లాన్ మరియు అదనపు టైమ్ క్రెడిట్ లు ఇటువంటి సమయంలో సహాయపడతాయి. లాక్డౌన్ వ్యవధిలో రోజువారీ వేతన సంపాదకులు తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ మరియు భారతి ఎయిర్టెల్ వంటి ఇతర టెల్కోలు కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క చెల్లుబాటును పెంచడమే కాకుండా టాక్ టైమ్ క్రెడిట్ ను కూడా చందాదారుల అకౌంట్ లలో జమచేశారు.

భారతి ఎయిర్‌టెల్ రీఛార్జ్
ఇండియాలో భారతి ఎయిర్‌టెల్ సుమారు 100 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉన్నారు. లాక్డౌన్ వ్యవధిలో తమ చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతి ఎయిర్‌టెల్ తన చందాదారులకు రీఛార్జ్ సదుపాయాన్ని కల్పించడానికి హెచ్‌డిఎఫ్‌సి మరియు ఐసిఐసిఐ బ్యాంక్‌లతో జతకట్టింది. ఇది మాత్రమే కాదు లాక్డౌన్ కాలంలో పనిచేస్తున్న అపోలో ఫార్మసీలతో పాటు టెల్కో దిగ్గజం బిగ్ బజార్ కిరాణా దుకాణాలతో జతకట్టింది.

రిలయన్స్ జియో రీఛార్జ్
భారతదేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తమ చందాదారులకు రీఛార్జ్ సమస్యలు కలగ కుండా ఉండడానికి తొమ్మిది వేర్వేరు బ్యాంకులతో జతకట్టింది. జియో భారతదేశంలో 350 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఈ బ్యాంక్ జాబితాలో SBI, యాక్సిస్ సిటీ బ్యాంక్, డిసిబి బ్యాంక్ వంటివి మరెన్నో ఉన్నాయి. రిలయన్స్ జియో చందాదారులు భారతదేశంలో పనిచేస్తున్న ఈ తొమ్మిది బ్యాంకుల్లో దాదాపు 90,000 ఎటిఎంలలో రీఛార్జిని పొందగలుగుతారు.

ATM ద్వారా రీఛార్జ్ చేయడం ఎలా?
*** మొదటగా మీ యొక్క simను రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తున్న బ్యాంక్ ఎదో కనుకోండి.
*** మొదటగా మీ యొక్క బ్యాంక్ ATMను అందులో "ఇన్సర్ట్" చేయండి.
*** తరువాత మీ యొక్క భాషను ఎంచుకోండి.
*** తరువాత "మొబైల్ రీఛార్జ్" అనే ఎంపిక మీద క్లిక్ చేయండి.
*** మీ యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
*** మీరు రీఛార్జ్ చేయవలసిన ప్లాన్ ను ఎన్నుకోండి.
*** తరువాత మీ యొక్క ATM పిన్ నెంబర్ ను నొక్కండి.


Click it and Unblock the Notifications








