‘హాక్ ఐ’.. నేరాలకు బైబై

Posted By:

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ శాఖ ‘హాక్ ఐ' పేరుతో సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చంది. ముఖ్యంగా ఈ యాప్ మహిళలకు మరింత రక్షణ కల్పిస్తుందని నగర కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ‘హాక్ ఐ’.. నేరాలకు బైబై

ఈ యాప్‌ను మొబైల్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా సాధారణ పౌరులు సైతం నేరాల గురించి సత్వరం ఫిర్యాదు చేయడంతో పాటు భద్రతా లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. నగర పోలీసులకు సంబంధించి ముఖ్యమైన ఫోన్ నెంబర్లన్నీ ఈ యాప్ ద్వారా పొందవచ్చని కమీషనర్ వెల్లడించారు.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లే మహిళలు ఆటో, క్యాబ్, ట్యాక్సీ, బస్, రైలు తదితర వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చినపుడు అక్కడి వాతవరణాన్ని వీడియో తీయడంతో పాటు సదరు వాహనానికి సంబంధించి నెంబర్, వెళ్తున్న ప్రదేశం పేరును రాసుకుని ఆ సమాచారాన్ని యాప్‌లో పొందుపరిచినట్లయితే, ఏదైనా అనుకోని సంఘటన చోటుచేసుకున్నప్పుడు పోలీసులు వెంటనే స్పందించేందుకు ఆస్కారం ఉంటుందని కమీషనర్ పేర్కొన్నారు.

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

అత్యవసర సమయంలో సహాయం కోసం యాప్‌లో ఎస్ఓఎసీ బటన్‌ను ఏర్పాటు చేసామని ఈ బటన్‌ను నొక్కితే అత్యవసర మెసేజ్, యాప్‌లో సేవ్ చేసిన బంధువులకు వెళుతుందని అంతేకాకుండా సంఘటన ప్రదేశానికి సంబంధించి భౌగోళిక వివరాలు వెంటనే సంబంధిత ఎస్‌హెచ్‌ఓ, ఎస్పీ, డీఎస్పీ, గస్తీ వాహనాలు, ప్రధాన కంట్రోల్ రూమ్‌కు వెళతాయని తద్వారా పోలీసులు తక్షణమే స్పందించి బాధిత వ్యక్తులను కాపాడగలుగుతారని కమీషనర్ వివరించారు.

ఈ యాప్లో రిపోర్ట్ వయ్‌లేషన్ టు పోలీస్, ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్, రిసిస్టర్ డిటెయిల్స్ ఆఫ్ సర్వెంట్స్, వర్కర్స్, టెనంట్, ఎస్ఓఎస్, ఎమర్జెన్సీ ఫోలీస్ కాంట్రాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి విభాగాలు ఉంటాయని, వీటిని వినియోగించుకుని  హైదరాబాద్‌ను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కమీషనర్ కోరారు.

English summary
Hyderabad Police Mobile App for Women's Safety. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot