AI-ఎనేబుల్డ్ ఫీచర్ తో TCL కొత్త స్మార్ట్ టీవీ

|

ఇండియాలో ఇప్పుడు అధిక భాగం స్మార్ట్ ఫోన్ రంగంలో పోటీ పడుతున్నారు. దాని తరువాత ఎక్కువగా టీవీ రంగంలో నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. గత కొన్ని నెలలుగా కొత్త కొత్త కంపెనీలు టీవీ రంగంలోకి ప్రవేశించడంతో పోటీ మరింత ముదిరింది. స్మార్ట్ టీవీ మార్కెట్లో షియోమి, శామ్‌సంగ్, ఎల్‌జీలకు సవాలు చేయడానికి ఇప్పుడు టిసిఎల్ పూర్తిగా సన్నాహాలు చేస్తోంది.

 
tcl planning to launch advanced ai enabled smart tvs in india next week

చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ తన తాజా శ్రేణిలోని స్మార్ట్ టీవీలలో అధునాతన AI-టెక్నాలిజీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేంజ్ స్మార్ట్ టీవీలు వచ్చే వారం ఇండియాలోకి ప్రవేశించవచ్చని తెలుస్తోంది. దేశంలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంగా TCL కంపెనీ AI ఫీచర్లతో కూడిన పలు స్మార్ట్ టీవీలను ప్రకటించాలని యోచిస్తోంది.

టిసిఎల్ నుండి కొత్త AI- టెక్నాలిజీ శ్రేణి టీవీలు:

టిసిఎల్ నుండి కొత్త AI- టెక్నాలిజీ శ్రేణి టీవీలు:

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు యుద్ధభూమిగా ఉన్న ఇండియా ఇప్పుడు స్మార్ట్ టీవీ మార్కెట్‌కు కూడా ప్రధాన అక్షయపాత్రగా మారుతోంది. ప్రముఖ షియోమి కంపెనీ కూడా 17 నెలల క్రితం స్మార్ట్ టీవీ రంగంలోకి ప్రవేశించడంతో స్మార్ట్ టీవీ మార్కెట్ ఇప్పుడు పెద్ద అణుబాంబుగా పేలింది. థామ్సన్ మరియు మెట్జ్ వంటి కంపెనీలు కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించి మార్కెట్ వాటాను పొందటానికి పోటీ పడుతున్నారు. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇండియన్ ఇ-కామర్స్ ప్లేయర్ ఫ్లిప్‌కార్ట్ కూడా షియోమి మరియు ఇతరులతో పోటీ పడటానికి MarQ అనే సొంత స్మార్ట్ టివి బ్రాండ్‌ను కూడా విడుదల చేసింది. ఈ రేసులో టిసిఎల్ కూడా ముందంజలో ఉంది.

AI-ఎనేబుల్డ్ ప్రీమియం స్మార్ట్ టీవీ:
 

AI-ఎనేబుల్డ్ ప్రీమియం స్మార్ట్ టీవీ:

ఇండియాలో గత వారం LG కి సంబంధించిన AI-ఎనేబుల్డ్ ప్రీమియం స్మార్ట్ టీవీలను విడుదల చేసిన తర్వాత TCLకు సంబంధించి కొన్ని ప్రణాళికలు లీక్ అయ్యాయి. ప్రపంచంలో కొత్త టెక్నాలిజీలతో అందించే మొదటి రెండు టీవీ బ్రాండ్లలో టిసిఎల్ కూడా ఒకటి. ఈ కొత్త టీవీలు భారతదేశంలో ప్రస్తుతం అందిస్తున్న టీవీల శ్రేణికి కొంత భిన్నంగా ఉంటాయి. ఈ కొత్త టీవీలతో టీసీఎల్ AI మరియు ఇంటర్నెట్ కు సంబందించిన థింగ్స్‌పై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. భారతదేశంలో TCL యొక్క తదుపరి స్మార్ట్ టీవీలు స్మార్ట్ బల్బ్, థర్మోస్టాట్ వంటి ఇతర అన్ని పరికరాలను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తాయని దీని అర్థం. టిసిఎల్ తన టీవీల్లో వాయిస్ చర్యలకు మించి AI ని ఉపయోగించాలని చూస్తున్నట్లు వెల్లడించింది.

మార్కెట్లో పోటీ:

మార్కెట్లో పోటీ:

పిక్చర్ నాణ్యతను పెంచడానికి టీవీ తయారీదారులు AI ని ఉపయోగిస్తున్నారు TCL కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది. దీనికి కనెక్ట్ చేయబడిన స్పీకర్లు మరియు పెరిఫెరల్స్ ద్వారా మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించడానికి IoT ని ఉపయోగించవచ్చు.ప్రస్తుతం ఈ చైనా సంస్థ తన టీవీ శ్రేణిని భారతదేశంలో ఎలా మార్చాలని యోచిస్తుందో చూడాలి. షియోమి ఇప్పటికే ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో పెద్ద బ్రాండ్‌గా అవతరించింది. థామ్సన్ కూడా ఈ విభాగంలో పుంజుకుంటుంది. టిసిఎల్ కంపెనీ దాని ఉత్పత్తితో మార్కెట్ లో గొప్ప ట్రెండ్ సృష్టించడానికి కూడా అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
tcl planning to launch advanced ai enabled smart tvs in india next week

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X