అంతరిక్షంలోకి తొలి స్మార్ట్‌ఫోన్.. ఇండియా అరుదైన రికార్డు

Posted By:

అంతరిక్షంలోకి తొలి స్మార్ట్‌ఫోన్.. ఇండియా అరుదైన రికార్డు
తాజా పీఎస్ఎల్‌వీ ప్రయోగం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్ చరిత్రను నమోదు చేసింది. బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫోన్‌శాట్ ‘స్ట్రాండ్ -1'ను పీఎస్ఎల్‌వీ రాకెట్ సాయంతో సోమవారం ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట కేంద్రంగా భూమికి 785 కిలోమీటర్ల పైనున్న కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఫోన్ ఆధారిత ఉపగ్రహం ‘స్ట్రాండ్ -1' బరువు 4.3 కిలోగ్రాములు. ఈ శాటిలైట్‌లో బ్రిటన్ శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్ విడిభాగాలతో పాటు పలు
అప్లికేషన్‌లను నిక్షిప్తం చేశారు. వీటిని అంతరిక్షంలో పలు విధాలుగా పరీక్షించనున్నారు.

‘విప్రో'ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

ఈ ఉపగ్రహ(శాటిలైట్) రూపకల్పనలో బ్రిటన్‌లోని సర్రీ విశ్వవిద్యాలయానికి చెందిన స్పేస్ సెంటర్, శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ విభాగాలు కీలక పాత్రపోషించాయి. తొలిదశలో భాగంగా ‘స్ట్రాండ్ -1'ను శాటిలైట్ ఆటిట్యూడ్ కంట్రోలింగ్ సిస్టం, లైనెక్స్ బేసిడ్ హైస్పీడ్ క్యూబ్ శాట్ కంప్యూటర్లు నియంత్రిస్తాయి. రెండవ దశలో భాగంగా శాటిలైట్ నియంత్రంణ స్మార్ట్‌ఫోన్ పరిధిలోకి వస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot