skype ద్వారా భార్యాభర్తలకు విడాకులు

By Sivanjaneyulu
|

తెలంగాణలోని ఓ సివిల్ కోర్ట్ దేశంలోనే మొట్టమొదటి సారిగా భార్యాభర్తలకు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ ద్వారా విడాకులు మంజూరు చేసింది. భార్య అమెరికాలో, భర్త ఖమ్మంలో ఉంటున్నందున న్యాయస్థానం skype వీడియో కాలింగ్ అప్లికేషన్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేుసింది.

స్కైప్ ద్వారా భార్యాభర్తలకు విడాకులు

వివరాల్లోకెళితే. ఖమ్మం నగరానికి చెందిన నల్లపునేని కిరణ్‌కుమార్‌కు ఇదే నగరానికి చెందిన కేతినేని పావనికి 2012 మార్చి 9న వివాహమైంది. కాపురానికి రాకముందే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వివాహాన్ని రద్దు చేయాలని కిరణ్‌కుమార్‌ 2012 జూన్‌ 8న ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అధిక వరకట్నం కోసం వేధించారని కిరణ్‌కుమార్‌, అతని తల్లిదండ్రులపై పావని, హైదరాబాద్‌ 13వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టులో 2013లో కేసు దాఖలు చేశారు. ఇరుపక్షాల మధ్య మూడేళ్లుగా విచారణ సాగింది. ఖమ్మంలోని ప్రముఖుల సహాయంతో, న్యాయవాదుల చొరవతో ఇరుపక్షాలు రాజీకి వచ్చాయి.

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న సమస్యలు, పరిష్కారాలు

ఇంతలో పావని అమెరికా వెళ్లి ఎంఎస్‌ పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమె ఖమ్మం కోర్టుకు వచ్చి అంగీకారం తెలపడానికి సమయం లేకపోయింది. ఆమె తండ్రికి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చింది. అయినా విడాకుల కేసులో ప్రతివాది నేరుగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రపంచపు మొట్టమొదటి 'Soap Proof' ఫోన్

అయితే, దేశంలోనే తొలిసారిగా ఇటీవల మద్రాసు రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు స్కైప్‌ ద్వారా ఒక కేసులో తీర్పునిచ్చారు. దీంతో అదే పద్ధతిలో ఈ కేసులోనూ విచారించాలని పావని తరపు న్యాయవాది కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ను ఆమోదించిన ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి మర్రిపాటి వెంకట రమణ శనివారం ఆమె సమ్మతిని స్కైప్‌ ద్వారా నమోదుచేసి విడాకులు మంజూరుచేశారు. నల్లపునేని కిరణ్‌కుమార్‌ తరపున న్యాయవాది కిలారు బాబ్జి వాదించగా కేతినేని పావని తరపున బత్తుల బసవ పున్నయ్య వాదించారు. కాగా, స్కైప్‌ ద్వారా కోర్టు తీర్పు వెలువడటం దేశంలో ఇది రెండోసారి కాగా, రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ఫేస్‌బుక్ వాట్స్‌యాప్ డీల్

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్స్‌యాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

గూగుల్ మోటరోలా మొబిలిటీ డీల్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, మోటరోలా మొబిలిటీని 12.5 బిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

హెచ్‌పీ అటానమీ డీల్

ప్రముఖ ప్రింటింగ్ ఇంకా కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పీ, సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ అటానమీని 10.3 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు
 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

 సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్కైప్ సర్వీసెస్‌ను 2011లో $8.5 బిలియన్‌లకు సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్‌ డీల్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్‌ను $7.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

మైక్రోసాఫ్ట్ నోకియా డీల్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియాను $7.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, నెస్ట్ ల్యాబ్స్‌ను $3.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

 ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్, ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ క్విస్ట్ సాఫ్ట్‌వేర్‌ను $2.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సెర్చ్ ఇంజన్ యాహూ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ టంబ్లర్‌ను $1.1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను $1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

Best Mobiles in India

English summary
India's first divorce on Skype, Telangana court hears wife online. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X