మొబైల్ లావాదేవీల మోసాలపై ఆసక్తికర విషయాలు

Written By:

ఇప్పుడు దేశమంతా ఇంటర్నెట్ మొబైల్ లావాదేవీల వైపు మారి తీరాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దానిపై భారీగానే కసరత్తులు చేస్తోంది. ఇదే అదనుగా 2017 నాటికి దేశంలో మొబైల్స్ ఇంటర్నెట్ కి సంబంధించి 60 నుంచి 65 శాతం మోసాలు జరిగే అవకాశం ఉందని ఓ స్టడీలో తేలింది. మొబైల్ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల్లో ఈ నేరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీలకు ఇది పెద్ద దెబ్బేనని అసోచామ్ రీసెర్చ్ సంస్థ ఈవై తెలిపింది.

మేము నోరు విప్పితే భారత్‌ కల్లోలమే !

మొబైల్ లావాదేవీల మోసాలపై ఆసక్తికర విషయాలు

సైబర్ క్రైమ్స్ విభాగంలో డెబిట్ కార్డ్ ,క్రెడిట్ కార్డు ద్వారా జరిగే మోసాలు గత మూడు సంవత్సరాల్లో ఆరు రెట్లు పెరిగి టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఇప్పుడు ఈ స్టడీ అందించిన సమాచారం ప్రకారం మొబైల్ ద్వారా 21 శాతం, ఈ మెయిల్ హ్యాకింగ్ ద్వారా 18 శాతం, ఎసెమ్మెస్ ద్వారా 12 శాతం చీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఆపిల్‌కు చుక్కలు చూపిస్తున్న దొంగలు

ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్ ఫోర్సింగ్ డేటా సెక్యూరిటీని వాడాలని స్టడీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ లావాదేవీలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాం చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూరిటీ టిప్స్ 1

మీ మొబైల్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని వాలెట్లు పడితే అన్ని వాలెట్లూ డౌన్లోడ్ చేసుకుని, వాటిలో డబ్బులు వేయటం సరికాదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెక్యూరిటీ టిప్ 2

మీ లావాదేవీల అవసరాన్ని బట్టి తక్కువ మొత్తాన్ని వేసుకుంటే చాలు. ఒకవేళ మొబైల్ పోయినా, మీ వాలెట్లో వివరాలు చోరీకి గురైనా నష్టం అందులో ఉన్న మొత్తానికి మాత్రమే పరిమితమవుతుంది.

సెక్యూరిటీ టిప్ 3

ఇపుడు కొన్ని మొబైల్ వాలెట్లు అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తున్నాయి. వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడల్లా పాస్‌వర్డ్ అడిగేలా రూపొందించారు. మీరు ఈ ఆప్సన్ ఎంచుకోండి.

 

సెక్యూరిటీ టిప్ 4

మీ మొబైల్ ఒకవేళ మిస్సయితే మీ కంప్యూటర్ నుంచి లాగిన్ అయి మీ వాలెట్ పాస్‌వర్డ్ మార్చేయండి. అపుడు చోరీ చేసిన వారు మొబైల్ ద్వారా వాలెట్‌ను యాక్సెస్ చేయటానికి ప్రయత్నించినా ఒపెన్ కాదు.

సెక్యూరిటీ టిప్ 5

ఒకవేళ మీ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే మీ నంబర్ ని బ్లాక్ చేయించడం మరో మార్గం. అలా చేయడం వల్ల ఓటీపి కోడ్ మీ మొబైల్ నంబర్ కి వచ్చే అవకాశం ఉండదు. మొబైల్ చోరీ చేసిన వ్యక్తి ఓటీపీ లేకుండా వ్యాలెట్ యాక్సెస్ చేయలేడు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India to see 65% rise in mobile frauds in 2017: Study read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot