మేము నోరు విప్పితే భారత్‌ కల్లోలమే !

Written By:

హ్యాకింగ్ తో ఈ మధ్య సంచలనం రేపుతున్న లీజియన్ గ్రూపు తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసిన ఈ గ్రూపు వాషింగ్టన్ పోస్టుకు మొబైల్ ఛాటింగ్ ద్వారా ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లీజియన్ క్రూ పేరుతో జరిపిన ఈ ఛాటింగ్‌లో అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయని, భారత రాజకీయ ప్రముఖుల డేటా కూడా ఉందని వెల్లడించింది.

ఆపిల్‌కు చుక్కలు చూపిస్తున్న దొంగలు

మేము నోరు విప్పితే భారత్‌ కల్లోలమే !

ఈ డేటాను బయటకు విడుదల చేస్తే భారత్‌లో మరో కల్లోలం తప్పదని ఈ గ్రూపు స్పష్టం చేసింది. ఈ మధ్య జయలలిత అపోలోలో చికిత్స తీసుకునే సమయంలో అపోలో కేంద్రంగా కొన్ని రోజుల పాటు రాజకీయాలు నడిచిన నేపథ్యంలో ఈ ఇంటర్యూ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే సమాచారం ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఈ గ్రూపు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా, అయితే మీ కోసమే ఈ నంబర్

మేము నోరు విప్పితే భారత్‌ కల్లోలమే !

పలు భారత సర్వర్ల నుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖుల డేటా ఉందని తెలిపింది. 40 వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టు దొరికిందని ఇది కొంతకాలం నుంచి మేము సాధించిన ప్రయత్నమని తెలిపింది.

ఈ యాప్స్‌తో మీ ఇంట వెలుగులే వెలుగులు !

మేము నోరు విప్పితే భారత్‌ కల్లోలమే !

దీంతో పాటు ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి మద్దతు తెలపాలనుకుంటే legion&group@sigaint.org మెయిల్ చేయవచ్చని కూడా ఈ గ్రూపు తెలిపింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, విజయ్ మాల్యా, బర్కాదత్ అకౌంట్లను ఈ గ్రూపు హ్యాక్ చేసిన విషయం విదితమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Lalit Modi and sansad.nic.in: Next targets for hacker group Legion read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot