అగ్ని..ప్రపంచ దేశాలను భయపెడుతోంది

|

అగ్ని... ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచదేశాలకు ముచ్చెమటలుపడుతున్నాయి. భారత అణు సామర్ధ్యాన్ని చాటి చెప్పిన 'అగ్ని' క్షిపణులు ఇప్పుడు ప్రపంచదేశాలకు యుద్ధ రంగంలో సవాల్ విసురుతున్నాయి. వరుసగా విజయవంతమవుతున్నఅగ్ని ప్రయోగాలతో భారత అణుసామర్ధ్యం ఇప్పుడు అగ్రరాజ్యాలకు ధీటుగా తయారైంది.

 

Read more: ప్రపంచ దేశాలకు భారత్ షాక్

శత్రు క్షిపణులను ఒకే ఒక్క దెబ్బతో సర్వనాశనం చేయగల ఈ అగ్ని ఎప్పుడు ప్రయోగం జరిపినా నిప్పులు చిమ్మకుంటూ ఆకాశంలోకి దూసుకెళుతోంది. పాకిస్తాన్ తో పాటు చైనా ను...అరబ్బు దేశాలను,అలాగే పశ్చిమాసియా దేశాలను ఈ అగ్ని క్షిపణులు వణికించగలవు. బాంబులు విసరగలవు.. ప్రపంచదేశాలకు వణుకుపుట్టిస్తున్న ఈ అగ్ని క్షిపణులపై ప్రత్యేక కథనం.

Read more: చైనాకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

మొట్ట మొదటి అగ్ని క్షిపణి

మొట్ట మొదటి అగ్ని క్షిపణి

మొట్ట మొదటి అగ్ని క్షిపణిని 1989లో చండీపూర్ ప్రాంతంలో పరీక్షించారు. ఇక అగ్ని అనగా నిప్పు అని అర్థం. అంతే కాక హిందుూ మతం దేవుడు అనే అర్థం కూడా వస్తుంది. 1989లో అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడాన్ని చూసిన అమెరికా శాస్త్ర సాంకే తిక పరిజ్ఞానం అందజేయడం లో అప్పట్లో నిషేధాన్ని విధించింది కూడా. అయినా ఇండియా బెదరక పరీక్షలను విజయవంతంగా ప్రయోగిస్తూ అణు సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది.

అగ్ని-I

అగ్ని-I

అగ్ని-I పరీక్షను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 11న విజయవంతంగా నిర్వహించింది. అయితే అగ్నితో ఇండియా అమ్ములపొదిలో దాదాపు అయిదు ఉన్నాయి. అవి అగ్ని 1,2,3,4,5. వీటిలో అగ్ని 4 వరకు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలను అందిస్తున్నాయి.

అగ్ని-I
 

అగ్ని-I

బరువు 12 టన్నులు, పొడవ 15 మీటర్లు. టన్నుకుపైగా పేలోడ్‌ను తీసుకెళ్లే విధంగా ఈ క్షిపణిని డిజైన్ చేశారు. డిఫెన్స్ లాబోరేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ సహకారంతో డీఆర్డీవో అడ్వాన్స్‌డ్ సిస్టం లాబోరేటరీ అభివృద్ధి చేసింది. ఇది 700 నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల ఆయుధాలను భస్మీపటలం చేయగలదు.

అగ్ని 2

అగ్ని 2

అగ్ని 1 తరువాత వచ్చిన మరొక ఆయుధం అగ్ని 2..ఇది 2000 నుంచి 3000 కిలోమీటర్ల దూరాల లక్ష్యాలను చేధిస్తుంది. 18 టన్నుల బరువు ఉంటుంది. ఉపరితలం నుంచి ఉపరితలంలో రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలదు ఈ క్షిపణి.

అగ్ని 2

అగ్ని 2

ఈ క్షిపణిని ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాక్ జిల్లా ధమరా అనే తీర ప్రాంతం నుండి ఆకాశంలోకి ప్రయోగించారు.18 టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి మరో వెయ్యి కేజీల బరువు కలిగిన అణ్వాయుధాలను మోసుకెళుతుంది.

అగ్ని-3:

అగ్ని-3:

3000-5500 కి.మీ పరిధిలో ఏం ఉన్నా వాటిని బూడిద చేయగల సత్తా దీని సొంతం. అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని-3లో రెండంచెల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది.

అగ్ని-3:

అగ్ని-3:

17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.

అగ్ని-4:

అగ్ని-4:

ఈ అస్త్రం 3,000-4,000 కి.మీ పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. గగన తలం నుంచి గగన తలంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి. అగ్ని-5 తర్వాత మరో శక్తివంతమైన క్షిపణి ఇదే.. 4 వేల కిలోల పేలుడు పదార్థాలను లేదా అణ్వాయుధాలను ఇది మోసుకెళ్ళగలదు. క్షిపణిలో పొందుపరిచిన ఇంటర్నేషనల్ నేవిగేషన్ సిస్టమ్, ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టంల సహాయంతో 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని అధికారులు చెబుతున్నారు.

అగ్ని-4:

అగ్ని-4:

రక్షణ రంగంలో ఇది మరో మైలురాయిగా నిలవగలదనీ చెప్పారు. చైనా రూపొందించిన భారత్ లోని సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులకు పోటీగా ఈ క్షిపణి నిలవగలదనీ రక్షణశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లోని ఏ ప్రాంతాన్నైనా ,చైనాలోని 40 శాతం భూభాగాన్ని కొన్ని అరబ్ దేశాలను పశ్చిమాసియా దేశాలను చేరే శక్తి సామర్ధ్యాలు అగ్ని4కు ఉన్నాయి.

అగ్ని-4:

అగ్ని-4:

20 మీటర్ల పొడవు 17 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని సరిహద్దులత నుంచి ప్రయోగిస్తే పాక్ లోని ఏ భాగాన్నైనా చేరవచ్చు. ముంబై తీరం నుంచి ప్రయోగిస్తే అరబ్ దేశాలను తాకుతుంది. ఇక అండమాన్ నుంచి ప్రయోగిస్తే పలు పశ్చిమాసియా ప్రాంతాలను తాకుతుంది.భారత సైన్యం అమ్ముల పొదిలోకి చేరింది.

అగ్ని-5:

అగ్ని-5:

ఈ క్షిపణి దాదాపు 5,000 -8,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు.ఉపరితలం నుంచి ఉపరితలానికి వెయ్యి కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.ఇప్పటి వరకు ఈ క్షిపణిని మూడు సార్లు ప్రయోగించగా.. ప్రతీసారి విజయవంతమైంది.

అగ్ని-5:

అగ్ని-5:

త్రీ స్టేజ్ మిస్సైల్ అయిన అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం.

అగ్ని-5:

అగ్ని-5:

ఇప్పుడు చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి రానున్నాయి. పైపెచ్చు.. ఈ తరహా క్షిపణిని ప్రయోగించి ఎలైట్ దేశాల సరసన చేరింది. ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని నగరాలపై దాడి చేయవచ్చు. అగ్ని-5 మిసైల్‌ను దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా తరలించే వెసులుబాటు ఉంది.

అగ్ని-5:

అగ్ని-5:

దీన్ని 486 మిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. అంతేకాకుండా, మల్టిపుల్ వార్‌హెడ్‌లతో పాటు.. శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అయితే, భారత ఆర్మీ ఆయుధ సంపత్తిలో చేర్చే ముందు దీనికి కనీసం నాలుగైదు సార్లు ప్రయోగ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని భారత రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అగ్ని-6:

అగ్ని-6:

దీర్ఘశ్రేణి అణుసామర్థ్యం గల అగ్ని-6 బాలిస్టిక్‌ మిస్సైల్‌ కూడా భారత్ అతి త్వరలో అభివృద్ధి చేయనుంది. ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించేందుకు బహుళ యుద్ధశీర్షాలను తీసుకువెళ్ళగల సామర్థ్యం ఈ మిస్సైల్‌కు ఉంది. ''అగ్ని-5 ప్రధాన వ్యూహాత్మక రక్షణ ఆయుధం. ఇప్పుడ రూపొందిస్తున్న అగ్ని-6 బహుళ సామర్థ్యం కలది.

అగ్ని-6:

అగ్ని-6:

అగ్ని-5 బాలిస్టిక్‌ మిస్సైల్‌ 5,500 కిలోమీటర్ల విస్తృతి కలిగి ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న అగ్ని-6 అంతకన్నా ఎక్కువ విస్తృతి కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అగ్ని-6 అభివృద్ధి చేయడం పూర్తయితే అదే సామర్థ్యం గల క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

అగ్ని-6:

అగ్ని-6:

ఇది దాదాపు 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలిగేలా దీనిని తయారుచేయనున్నారని సమాచారం. ఇప్పటికే దీని డిజైన్ పూర్తి అయిందని విడిభాగాల రూపకల్పన దశలో ఉన్నామని భారత రక్షణపరిశోధనాభివృద్ధి వ్యవస్థ చెబుతోంది.

అగ్ని-6:

అగ్ని-6:

భారత అమ్ములపొదిలో ఉన్న ఈ అగ్ని క్షిపణులతో ఇప్పుడు పొరుగుదేశాలకు ముచ్చమటలు పడుతున్నాయన్నది వాస్తవం..అగ్ని-6 కూడా బయటకు వస్తే భారత్ ఆయఉధ రంగంలో ప్రపంచదేశాలకు సవాల్ విసిరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అగ్ని-5తో సవాల్ విసిరింది కూడా.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Indian Hi Tech Missiles Agni are Superior to world in Quality

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X