చైనా కంపెనీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన శాంసంగ్

మొబైల్ మార్కెట్లో ఇండియాలో ఎదురులేకుండా దూసుకుపోతున్న చైనా కంపెనీలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం విభాగంలో తనను అగ్రస్థానం నుంచి త

|

మొబైల్ మార్కెట్లో ఇండియాలో ఎదురులేకుండా దూసుకుపోతున్న చైనా కంపెనీలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం విభాగంలో తనను అగ్రస్థానం నుంచి తోసేసిన వన్‌ప్లస్ కంపెనీకి శాంసంగ్ షాక్ ఇస్తూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. 2019 తొలి త్రైమాసికంలో ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుందని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తెలిపింది. గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ ఉండటం ఇందుకు కారణం.

 
చైనా కంపెనీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన శాంసంగ్

తర్వాతి స్థానంలో వన్‌ప్లస్
శాంసంగ్ తర్వాతి స్థానంలో వన్‌ప్లస్ ఉంది. ఇక మూడో స్థానంలో ఆపిల్ కొనసాగుతోంది. ఈ మూడు కంపెనీలే ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఏకంగా 90 శాతం వాటాను ఆక్రమించాయని రిపోర్ట్ తెలిపింది.కాగా 2019 క్యూ1లో వన్‌ప్లస్ 6టీ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

500 మిలియన్ డాలర్లను

500 మిలియన్ డాలర్లను

గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో మిడ్ రేంజ్ విభాగంలో కేవలం 40 రోజుల్లోనే 20 లక్షల స్మార్ట్‌‌ఫోన్లను విక్రయించి శాంసంగ్ దుమ్మురేపింది. ఏకంగా 500 మిలియన్ డాలర్లను అర్జించి రికార్డ్‌ను నమోదు చేసింది.

గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో

మిడ్ రేంజ్ విభాగంలో గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో దూసుకెళ్తోన్న కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోనూ గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్లతో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వన్‌ప్లస్ కంపెనీని వెనక్కు నెట్టి తన నెం.1 స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది.

 

ఏ10, ఏ30, ఏ50, ఏ20

ఏ10, ఏ30, ఏ50, ఏ20

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల విక్రయం ద్వారా ఈ ఏడాది ఏకంగా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. శాంసంగ్ తన గెలాక్సీ ఏ సిరీస్ కింద ఏ10, ఏ30, ఏ50, ఏ20 అనే నాలుగు రకాల స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది.

ధరలు

శాంసంగ్ గెలాక్సీ ఏ20 ధర రూ.12,490గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ10 ధర రూ.8,490గా, శాంసంగ్ గెలాక్సీ ఏ30 ధర రూ.16,990గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ50 రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఒకదాని ధర రూ.19,990గా, మరొక వేరియంట్ ధర రూ.22,990గా ఉంది. గెలాక్సీ ఏ70, ఏ80 ఫోన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

తగ్గిన ధరలు
 

తగ్గిన ధరలు

కాగా భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ9, గెలాక్సీ ఎ7 ధరలను తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. శాంసంగ్ ఎ9(2018) 6జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధర రూ.28,990 కాగా ఇప్పుడు దీనిని రూ.25,990కి తగ్గించింది. 8జీబీ ర్యామ్+128 జీబీ వెర్షన్ అసలు ధర రూ.31,990 కాగా, ఇప్పుడు దానిని రూ.28,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది నవంబరులో విడుదల చేసినప్పుడు దీని ధర రూ.36,990. శాంసంగ్ గెలాక్సీ ఎ7(2018) 6జీబీ ర్యామ్+64 జీబీ వేరియంట్ ధరను రూ.18,999 నుంచి రూ.15,990కి తగ్గించింది. 6జీబీ ర్యామ్+128జీబీ మోడల్‌ ధరను రూ.22,990 నుంచి రూ.19,990కి తగ్గించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎ50 ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ50 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచ‌ర్లు

6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 32, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఎ80 ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ80 ఫీచ‌ర్లు

6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు

6.4 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Indian millennials driving innovation for us: Samsung

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X