భయంకర బరాక్ ఆయుధం బారత్‌కి వస్తోంది

By Hazarath
|

ప్రపంచంలోనే ఆయుధాల దిగుమతిలో అగ్రభాగాన నిలుస్తున్న భారత్ ఇప్పుడు ఇజ్రాయిల్‌తో వంద బిలియన్ డాలర్ల ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నది. బరాక్ ఏర్ డిఫెన్స్ మిస్సైల్స్, స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్లు, లాంచర్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నది. ఇక భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే కొత్త ఇండో ఇజ్రాయిల్ లాంగ్ రేంజ్ క్షిపణి బరాక్ -8 విజయవంతంగా పూర్తి అయింది.

 

Read more: 'అగ్ని' ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది

భారతదేశం ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో ఈ క్షిపణిని డిజైన్ చేసి రూపొందించింది. ఇజ్రాయిల్ కు చెందిన ఐఏఐ,భారతదేశానికి చెందిన డీఆర్ డీవో సంయుక్తంగా వీటిని రూపొందించాయి. ఇజ్రాయిల్ కు చెందిన నావెల్ ఫ్లాట్ పామ్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. భూతలం నుంచి ప్రయోగించిన క్షిపణి వేగవంతంగా దూసుకువస్తున్న ఆకాశంలోని లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది.

Read more: సైబర్ కోరల్లో భారత కంపెనీలు విలవిల

ఇది రెండు విధాలుగా ప్రయోగించడానికి వీలయ్యే క్షిపణులు. ఈ పరీక్ష విజయంతో భారత సైనిక చరిత్రలో కీలకమైన మైలురాయిగా నిలిచినట్లయింది. యుద్ద నౌకల నుంచి ఈ క్షిపణిని శత్రు దేశాల నుంచి దైసుకువచ్చే విమానాలు అలాగే డ్రోన్లపై దాడికి వినియోగించవచ్చు. బరాక్ -8 పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఇది ఇండో ఇజ్రాయిల్ జాయింట్ ప్రాజెక్ట్

ఇది ఇండో ఇజ్రాయిల్ జాయింట్ ప్రాజెక్ట్

ఇది ఇండో ఇజ్రాయిల్ జాయింట్ ప్రాజెక్ట్. రెండు దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఇది శత్రువుల నుంచి వచ్చే మిస్సైల్స్ ను అలాగే విమానాలాను డ్రోన్లను కూల్చివేయగలదు. దీన్ని త్వరలో ఇండియాలో పరీక్షించనున్నారు.

గతవారం ఇజ్రాయిల్ లో విజయవంతంగా పరీక్షించారు

గతవారం ఇజ్రాయిల్ లో విజయవంతంగా పరీక్షించారు

దీన్ని గతవారం ఇజ్రాయిల్ లో విజయవంతంగా పరీక్షించారు.ఇంతకు ముందు ఉన్న దానిని అత్యాధునికంగా డెవలప్ చేసి బరాక్ 8ని రూపొందించారు. ఇది ఇండియన్ నేవీలో కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ మిస్సైల్స్ తో చైనా, పాకిస్తాన్ వార్ షిప్ ల మీద దాడి చేయవచ్చు.

రెండు విధాలుగా దాడులకు
 

రెండు విధాలుగా దాడులకు

దీనిని రెండు విధాలుగా దాడులకు ఉపయోగించవచ్చు. రాఫెల్ జెట్ విమానాల టెక్నాలజీ ఈ జెట్ విమానాలకు ఉంది. డేటా సిస్టం అలాగే కమాండ్ ,కంట్రోలింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.

బరాక్ -8 రాత్రి వేళ ఉపయోగించవచ్చు అలాగే పగలు కూడా దాడికి

బరాక్ -8 రాత్రి వేళ ఉపయోగించవచ్చు అలాగే పగలు కూడా దాడికి

బరాక్ -8 రాత్రి వేళ ఉపయోగించవచ్చు అలాగే పగలు కూడా దాడికి ఉపయోగించవచ్చు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఇది తట్టుకుని నిలబడగలదు. 360 డిగ్రీల రేంజ్ లో దీన్ని ప్రయోగించవచ్చు.

250 కిలోమీటర్ల దూరంలో శత్రువులవి ఏవి ఉన్నా

250 కిలోమీటర్ల దూరంలో శత్రువులవి ఏవి ఉన్నా

250 కిలోమీటర్ల దూరంలో శత్రువులవి ఏవి ఉన్నా కాని వాటిపైకి దూసుకెళ్లి వాటిని సర్వనాశనం చేయగలదు. ఇండియా ఇజ్రాయిల్ కలిసి సంయుక్తంగా దీన్ని రూపిందిస్తున్నాయి. రాపెల్ జెట్ విమానాలు తయారు చేసే కంపెనీ కూడా ఇందులో భాగస్వామ్యం కానుంది.

తరువాత పరీక్షను మన ఐఎన్ ఎస్ కోలకత్తా నుండి

తరువాత పరీక్షను మన ఐఎన్ ఎస్ కోలకత్తా నుండి

బరాక్ -8 తరువాత పరీక్షను మన ఐఎన్ ఎస్ కోలకత్తా నుండి పరీక్షించనున్నారు. దీన్ని ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ప్రయోగించనున్నారు.

rn

ఇది బరాక్ -8 ఆకాశంలోకి దూసుకెళుతున్న వీడియో

ఇది బరాక్ -8 ఆకాశంలోకి దూసుకెళుతున్న వీడియో

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Indo Israeli Hi tech Barak-8 missile may win orders worth billions

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X