Jio ప్లాట్‌ఫాంలో భారీగా ఇంటెల్ పెట్టుబడులు!!! దెబ్బకు అప్పులు అన్ని హంఫట్...

|

ఇండియాలో టెలికాం ప్లాట్‌ఫాం విభాగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క జియో అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా మారాయి. గత రెండు నెలల్లో టెల్కో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పొందింది.

ఇంటెల్-జియో డీల్

ఇంటెల్-జియో డీల్

ఈ పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అప్పులు లేకుండా పోవడానికి సహాయపడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఇంటెల్ క్యాపిటల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ జియోలో 0.39% ఈక్విటీ వాటాను 1,894.50 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టబోతున్నట్లు RIL ప్రకటించింది.

ఇంటెల్ క్యాపిటల్ పెట్టుబడులు

ఇంటెల్ క్యాపిటల్ పెట్టుబడులు

ఇంటెల్ క్యాపిటల్ యొక్క ఈ పెట్టుబడుల తరువాత జియో ప్లాట్‌ఫామ్‌లో మొత్తం పెట్టుబడులు 1,17,588.45 కోట్లకు పెరిగాయి. రిలయన్స్ సంస్థ ఇప్పుడు తన జియో ప్లాట్‌ఫామ్‌లలో నాలుగింట ఒక వంతు భాగం విక్రయించింది. జియో టెలికాం వెంచర్ ఇప్పుడు జియో ఇన్ఫోకామ్, మ్యూజిక్ మరియు మూవీ యాప్‌లను కూడా విడుదల చేసింది. ఫేస్‌బుక్ మరియు KKR వంటి సంస్థలు కూడా సుమారు 15.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను RILలో పెట్టాయి.

 

Also Read: డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టిస్తున్న షేర్‌చాట్ యాప్...Also Read: డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టిస్తున్న షేర్‌చాట్ యాప్...

జియో ప్లాట్‌ఫాం పెట్టుబడులు

జియో ప్లాట్‌ఫాం పెట్టుబడులు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నుంచి జియో ప్లాట్‌ఫాంకు అతిపెద్ద పెట్టుబడి లభించింది. ఫేస్‌బుక్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.43,574 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఈ పెట్టుబడిలో భాగంగా రిలయన్స్ సంస్థ తన జియోలోని 9.99% వాటాను ఫేస్‌బుక్‌కు ఇచ్చింది. ఒప్పందం సమయంలో రిలయన్స్ జియోకు లభించిన ప్రీ-మనీ విలువ 65.95 బిలియన్ డాలర్లు. దీని తరువాత రిలయన్స్ జియోలో మరిన్ని సంస్థలు కూడా భారీగా పెట్టుబడులను పెట్టాయి. ఇవి జియో ప్లాట్‌ఫారమ్‌ల యొక్క అధిక విలువను పెంచుతూనే ఉన్నాయి.

ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్

ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్

ఇండియాలో టెలికామ్ రంగంలోకి జియో అడుగుపెట్టాక తక్కువ ధర వద్దనే అన్ని రకాల డిజిటల్ సేవలను వినియోగించడానికి అవకాశం కుదిరింది. ఇప్పుడు మరిన్ని ఆకట్టుకునే ఇంజనీరింగ్ సామర్థ్యాలను జియో ప్లాట్‌ఫాంకు వర్తింపజేయడంపై అధికంగా దృష్టి సారించాయి. డిజిటల్ యాక్సెస్ మరియు డేటా వంటివి మంచిగా మార్చగలవని మేము నమ్ముతున్నాము. ఈ పెట్టుబడి ద్వారా భారతదేశంలో డిజిటల్ పరివర్తనలో సహాయపడటానికి మా వంతు పాత్ర పోషించడాన్ని మేము సంతోషిస్తున్నాము అని ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ మిస్టర్ వెండెల్ బ్రూక్స్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Intel-Jio Deal: Intel Capital Investment Arm Invests Rs.1894.50 Crore in Jio Platforms

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X