ఇంటెల్ చిప్‌తో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By: Staff

ఇంటెల్ చిప్‌తో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు!

 

హ్యాండ్‌సెట్ తయారీ సంస్థల భాగస్వామ్యంలో సొంత చిప్‌లతో మరిన్ని రకాల స్మార్ట్‌ఫోన్లను రూపొందించనున్నట్లు ఇంటెల్ తెలిపింది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్లు వచ్చే ఏడాది మధ్యలో అందుబాటులోకి రాగలవని ఇంటెల్ దక్షిణాసియా విభాగ ఎండీ దేవయాని ఘోష్ గురువారం తెలిపారు. ఈ ఫోన్ల ధర రూ. 7,000 పైన ఉంటుందని ఇన్ఫోకామ్ 2012 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం లావా సంస్థ ప్రవేశపెట్టిన లావా జోలో హ్యాండ్ సెట్‌లో ఇంటెల్ చిప్ ఉపయోగిస్తున్నారు.

ఇంటెల్ ప్రాసెసర్ పై స్పందించే లావా జోలో 900 ఫీచర్లు:

4 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

1.6గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటమ్ జడ్2460 ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

3జీ కనెక్టువిటీ,

బ్లూటూత్ కనెక్టువిటీ,

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

1జీబి ర్యామ్,

1460ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ నుంచి చవక ధర క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot