Home
News

BSNL కొత్తగా లాంచ్ చేసిన రూ.699 వోచర్‌ గురించి ఆశక్తికరమైన విషయాలు...

ప్రభుత్వ ఆద్వర్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచర్ నిగం లిమిటెడ్ తన యొక్క వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా మరొక వోచర్ ను దేశవ్యాప్తంగా అందిస్తున్నది. రూ.699 ధర వద్ద కేరళా ప్రాంతంలో లభించే ఈ వోచర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిల్ లలో లభిస్తున్నది. ఇది కొత్త వోచర్ కాదు అని గమనించాలి. కేరళ సర్కిల్ లో ప్రభుత్వ టెల్కో ప్రారంభంలో ఈ ఓచర్‌ను ప్రారంభించింది. ఈ వోచర్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.699 వోచర్‌ ప్రయోజనాలు

BSNL రూ.699 వోచర్‌ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.699 వోచర్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది యూజర్లకు 0.5GB రోజువారీ FUP డేటాను అందిస్తుంది. దీని తరువాత వినియోగదారులు 80Kbps వేగంతో డేటాను పొందవచ్చు. దీనితో పాటు వినియోగదారులు ఎటువంటి FUP పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 160 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి మరియు మెసేజ్ లను పంపడానికి మొబైల్ కనెక్షన్‌ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్ గొప్ప ఎంపికగా ఉంటుంది. ఇది నేటి నుంచి అంటే జనవరి 25, 2021 నుండి ఆఫర్‌లో ఉంటుంది.

BSNL రూ.699 వోచర్ ను పొందే విధానం

BSNL రూ.699 వోచర్ ను పొందే విధానం

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.699 వోచర్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు సంస్థ యొక్క వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు లేదా యుఎస్‌ఎస్‌డి కోడ్ ‘* 444 * 699 #' ను ఉపయోగించవచ్చు. PLAN BSNL699 ఫార్మాట్‌లో 123 కు SMS పంపడం ద్వారా కూడా వినియోగదారులు ఈ ప్లాన్ ను పొందవచ్చు. కానీ ప్రస్తుత యూజర్లు మెసేజ్ ను పంపే ముందు తమకు తగినంత బ్యాలెన్స్ ఉందని నిర్ధారించుకోవాలి.

BSNL ఉచిత 4G సిమ్‌ ఆఫర్

BSNL ఉచిత 4G సిమ్‌ ఆఫర్

బిఎస్ఎన్ఎల్ టెల్కో ప్రస్తుతం కేరళలోని వినియోగదారులకు ప్రస్తుతం 4G సిమ్ కార్డును ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది జనవరి 31, 2021 వరకు పరిమిత సమయంలో ప్రమోషనల్ ఆఫర్ కింద వరకు లభిస్తుంది. ఈ ఉచిత 4G సిమ్ కార్డును పొందడానికి వినియోగదారుడు చేయాల్సిందల్లా మొదటి రీఛార్జ్ కూపన్ (FRC) కోసం రూ.100 లేదా అంతకంటే ఎక్కువతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఈ షరతుతో వినియోగదారులు BSNL నుండి ఉచిత సిమ్ కార్డును పొందగలరు.

BSNL vs ఎయిర్‌టెల్ vs Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్‌లు

BSNL vs ఎయిర్‌టెల్ vs Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు తమ యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా తక్కువ ధరలో డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం 50GB వరకు మాత్రమే డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.250 పోస్ట్‌పెయిడ్ మొబైల్ డేటా ప్లాన్ ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్లలో అందరికంటే అధికంగా 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్ కనెక్షన్‌ ద్వారా డేటాను అధికంగా వినియోగించే వినియోగదారులకు ఈ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు అధికంగా ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Interesting Facts About BSNL's Newly Launched Rs.699 Voucher
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X